28, ఫిబ్రవరి 2024, బుధవారం

AIIMS: ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

AIIMS: ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌)- 6 నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

ఎయిమ్స్‌ సంస్థలు: ఎయిమ్స్‌ భటిండా, ఎయిమ్స్‌ భువనేశ్వర్, ఎయిమ్స్‌ బిలాస్‌పూర్, ఎయిమ్స్‌ దేవ్‌ఘర్, ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్, ఎయిమ్స్‌ గువాహటి, ఎయిమ్స్‌ కల్యాణి, ఎయిమ్స్‌ మంగళగిరి, ఎయిమ్స్‌ నాగ్‌పుర్, ఎయిమ్స్‌ రాయ్ బరేలీ, ఎయిమ్స్‌ న్యూదిల్లీ, ఎయిమ్స్‌ పట్నా, ఎయిమ్స్‌ రాయ్‌పూర్, ఎయిమ్స్‌ విజయ్‌పూర్.

అర్హత: డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.  స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.

వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. 

జీత భత్యాలు: రూ.9300- రూ.34800తో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: నార్‌సెట్‌-6 ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.03.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 18.03.2024 నుంచి 20.03.2024 వరకు.

సీబీటీ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 14-04-2024.

సీబీటీ మెయిన్ పరీక్ష తేదీ: 05-05-2024.

Important Links

Posted Date: 27-02-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

BRAOU Admissions (January 2024 Session): UG (BA, BCom & BSc) Admissions – Details Here

BRAOU Admissions (January 2024 Session): UG (BA, BCom & BSc) Admissions – Details Here

డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు (జనవరి 2024 సెషన్): పూర్తి వివరాలు ఇవే

=====================

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జనవరి 2024 సెషన్ డిగ్రీ కోర్సుల్లో జనవరి 8 నుంచి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసుం, కోర్సులు తదితర వివరాల కొరకు క్రింది వెబ్సైటు లలో పొందవచ్చన్నారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08-01-2024

దరఖాస్తుల చివరి తేదీ: 31-01-2024, 16-02-2024

=====================

NOTIFICATION

PROSPECTUS

APPLICATION

WEBSITE

MAIN WEBSITE

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

2024-25 | 8వ తరగతిలో మిలిటరీ అకాడమీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ | ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీ (జులై- 2024 టర్మ్) లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు – దరఖాస్తు వివరాలు ఇవే

APPSC-RIMC Admission (July 2024 Term) – Rashtriya Indian Military College Entrance Exam – Details Here  

ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీ (జులై- 2024 టర్మ్) లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాదూన్ లోని  రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ) జులై- 2024 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాలురు, బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది

ఆర్ఐఎంసీ లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు జులై- 2024 టర్మ్

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జులై నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.

వయసు: 01.07.2024 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. 02.07.2011 - 01.01.2013 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్షా విధానం: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్ (125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వోస్ (50 మార్కులు) నిర్వహిస్తారు. రాత పరీక్ష, వైవా వోస్ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఆరన్ఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి అసిస్టెంట్ సెక్రటరీ(ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు చివరి తేది: 15.10.2023.

పరీక్ష తేది: 02-12-2023.

=======================

NOTIFICATION

WEB NOTE

MAIN WEBSITE

APPSC WEBSITE

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

SSC: కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్‌ పోస్టులు

SSC: కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్‌ పోస్టులు 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) తాజాగా సెలక్షన్‌ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తోంది. పది, పన్నెండో తరగతి, డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఖాళీలున్న విభాగాలు: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్‌ హైవేస్ మినిస్ట్రీ, హోం అఫైర్స్‌ మినిస్ట్రీ, డిఫెన్స్‌ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, సెంట్రల్ ట్రాన్స్‌లేషన్ బ్యూరో, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ తదితరాలు.

ఖాళీల వివరాలు:

* సెలక్షన్‌ (ఫేజ్-XII/ 2024): 2,049 పోస్టులు (ఎస్సీ- 255; ఎస్టీ- 124; ఓబీసీ- 456; యూఆర్‌- 1028; ఈడబ్ల్యూఎస్‌- 186)

లెవెల్స్‌: 1, 2, 3, 4, 5, 6.

పోస్టులు: లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్‌మ్యాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్‌మాన్, జూనియర్ ఇంజినీర్, యూడీసీ, డ్రైవర్-కమ్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, సూపర్‌వైజర్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, స్టోర్ కీపర్ ఎంట్రీ ఆపరేటర్, రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, సీనియర్ జియోగ్రాఫర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: కనిష్ఠంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌- టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సంబంధిత ఖాళీలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

పరీక్ష విధానం (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలు, 50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు, 50 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అరిథ్‌మెటిక్ స్కిల్) (25 ప్రశ్నలు, 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్‌ నాలెడ్జ్‌) (25 ప్రశ్నలు, 50 మార్కులు). ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 26.02.2024 నుంచి 18.03.2024 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.03.2024.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19.03.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 22.03.2024 నుంచి 24.03.2024 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 06 నుంచి 08-05-2024 వరకు.

Important Links

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

రానున్న రోజుల్లో రైల్వే శాఖ నుంచి మరో 6 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు: టైమ్‌టేబుల్ ప్రకటించింది

భారతీయ రైల్వే శాఖ 2019 తర్వాత ఎలాంటి ప్రభుత్వ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జాబ్ నోటిఫికేషన్‌లను విడుదల చేయలేదు. ఇప్పుడు 2024 సంవత్సరంలో 7 కంటే ఎక్కువ ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ల విడుదలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. రైల్వే శాఖ ఇప్పటికే 3 ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. దీంతో పాటు ఈ ఏడాది అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారో రానున్న రోజుల్లో క్యాలెండర్ విడుదల చేసింది.  

SSLC, సెకండ్ పీయూసీ, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారంతా కూడా మరికొద్ది రోజుల్లో రైల్వే శాఖ విడుదల చేయనున్న ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి దిగువ తెలియజేయడం జరిగింది. 

 https://www.rrbbnc.gov.in/EMPLOYMENT%20NOTICES.html

రైల్వే శాఖ ఇప్పటికే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది

రైల్వే ప్రొటెక్షన్ స్టాఫ్ యొక్క 4660 SI, కానిస్టేబుల్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్.
రైల్వే శాఖలో 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
రైల్వే శాఖలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్. 

పైన పేర్కొన్న అన్ని పోస్ట్‌ల కోసం అర్హత, దరఖాస్తు తేదీ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ లింక్‌ని క్లిక్ చేయండి . తర్వాత పేర్కొన్న నోటిఫికేషన్‌ల వ్యక్తిగత లింక్‌లపై క్లిక్ చేసి వాటిని చదవండి.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసిన తదుపరి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ల విడుదల షెడ్యూల్ క్రింది విధంగా ఉంది. ఇది సాధ్యమయ్యే షెడ్యూల్. 

రైల్వే ఈ ఏడాది పై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహిస్తుంది. అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్ పోస్టుల సంఖ్యను ఇప్పటికే షార్ట్ నోటిఫికేషన్‌లో ప్రకటించారు. విడుదల చేయాల్సిన ఇతర పోస్టుల సంఖ్య ఇంకా విడుదల కాలేదు. పైన పేర్కొన్న పోస్టులకు అర్హతలు క్రింద పేర్కొనబడ్డాయి. 

పోస్ట్ వారీగా అర్హత

అసిస్టెంట్ లోకోపైలట్: ఎస్‌ఎస్‌ఎల్‌సీతోపాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
సాంకేతిక నిపుణులు: ITI / డిప్లొమా / టెక్నికల్ డిగ్రీ కోర్సులు.
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ- గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులు (స్థాయి 4, 5 & 6): ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ- అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్‌లు (లెవల్ 2, 3) : SSLC మరియు సెకండరీ PUC.
జూనియర్ ఇంజనీర్: డిప్లొమా లేదా BE/B.Tech ఉత్తీర్ణత.
పారామెడికల్ కేటగిరీ పోస్టులు: పోస్టుకు సంబంధించిన సబ్జెక్టులో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత.
లెవెల్ 1 పోస్టులు: SSLC తో ITI ఉత్తీర్ణత.
మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు: సెకండ్ పీయూసీ ఉత్తీర్ణత.

నోటిఫికేషన్ యొక్క సంభావ్య నెల పోస్టుల వివరాలు
జనవరి - మార్చి అసిస్టెంట్ లోకోపైలట్
ఏప్రిల్ - జూన్ సాంకేతిక నిపుణులు
జూలై - సెప్టెంబర్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ- గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు (స్థాయి 4, 5 & 6)
జూలై - సెప్టెంబర్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ- అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ పోస్ట్‌లు (లెవల్ 2, 3)
జూలై - సెప్టెంబర్ జూనియర్ ఇంజనీర్
జూలై - సెప్టెంబర్ పారామెడికల్ కేటగిరీ పోస్టులు
అక్టోబర్ - డిసెంబర్ స్థాయి 1 పోస్ట్‌లు
అక్టోబర్ - డిసెంబర్ మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు

రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, టైమ్ కీప్ టైం కీపర్, ఎస్. కమర్షియల్ అప్రెంటీస్ మరియు స్టేషన్ మాస్టర్స్. 

రైల్వేలో గ్రూప్ D పోస్టుల జాబితా (డిపార్ట్‌మెంట్ వారీగా) అసిస్టెంట్ (వర్క్‌షాప్) (మెకానికల్ డిపార్ట్‌మెంట్)
అసిస్టెంట్ బ్రిడ్జ్ (ఇంజనీరింగ్ విభాగం)
అసిస్టెంట్ C&W (మెకానికల్)
అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్ విభాగం)
అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్)
అసిస్టెంట్ పాయింట్స్‌మెన్ (ట్రాఫిక్ విభాగం)
అసిస్టెంట్ సిగ్నల్ మరియు టెలికాం డిపార్ట్‌మెంట్
అసిస్టెంట్ డిపో (దుకాణాలు)
అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ (ఇంజనీరింగ్ విభాగం)
హాస్పిటల్ అసిస్టెంట్ (వైద్య విభాగం)
అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్) (మెకానికల్ విభాగం)
ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్ 4 (ఇంజనీర్ విభాగం)
ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఇతర అసిస్టెంట్ పోస్టులు 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

APPSC: గ్రూపు-2 ప్రిలిమ్స్‌ క‌టాఫ్ ఎంతంటే?

APPSC: గ్రూపు-2 ప్రిలిమ్స్‌  క‌టాఫ్ ఎంతంటే?

* 50 నుంచి 60 మార్కుల మ‌ధ్య ఉండే అవ‌కాశం 

* 8 వారాల్లోగా ఫలితాలు 

* జూన్‌ లేదా జులైలో మెయిన్స్‌ నిర్వహణ

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25న నిర్వహించిన గ్రూపు-2 ప్రిలిమ్స్‌లో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉన్నందున అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ జనరల్‌ కేటగిరి కటాఫ్‌ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2.30 గంటల పరీక్షకు తగ్గట్లు ప్రశ్నలు లేకపోవడంతో సమయం సరిపోక హైరానా పడ్డారు. ముఖ్యంగా మెంటల్‌ ఎబిలిటీలో ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. ‘ఇండియన్‌ సొసైటీ’ కింద రాజ్యాంగం, ప్రభుత్వ పథకాలు, గణాంకాలతో కూడిన ప్రశ్నలు వచ్చాయి. జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా అడగడంతో జవాబుల గుర్తింపునకు మరింత సమయం పట్టింది. ఈ పరిణామాలు గ్రామీణ అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టాయి. బ్లూప్రింట్‌, వెయిటేజ్‌కు తగ్గట్లు ప్రశ్నపత్రం లేదని, పోటీ స్ఫూర్తి అందులో కనిపించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. పోస్టుల సంఖ్యను అనుసరించి ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 

* ‘ఆడుదాం ఆంధ్రా’పై ప్రశ్నలు

వర్తమాన వ్యవహారాల్లో ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులు, విశాఖపట్నంలో జరిగిన మిలాన్‌-2024 గురించి ప్రశ్నలొచ్చాయి. మెంటల్‌ ఎబిలిటీలో విజయవాడలోని అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ, ఆడుదాం ఆంధ్రాలను ఉదహరిస్తూ ప్రశ్నలు అడిగారు. జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న జీవన క్రాంతి పథకం, వైయస్‌ఆర్‌ నవోదయ పథకాలు, విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చిన అవార్డు గురించి ప్రశ్నలు ఇచ్చారు.

* 87.17% మంది హాజరు

గ్రూపు-2 మెయిన్స్‌ను జూన్‌ లేదా జులైలో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ సూత్రప్రాయంగా వెల్లడించారు. వీలైతే మేలో కూడా జరిపే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రిలిమ్స్‌ ఫలితాలను అయిదు నుంచి ఎనిమిది వారాల్లోగా వెల్లడిస్తాం. గ్రూపు-2 నోటిఫికేషన్‌ ద్వారా 897 పోస్టులకు 4,83,535 మంది దరఖాస్తు చేశారు. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్ష రాశారు. గ్రూపు-1 ప్రిలిమ్స్‌ను తొలుత ప్రకటించినట్లే మార్చి 17న నిర్వహిస్తాం. అందులో ఎలాంటి మార్పు లేదు. చిత్తూరు జిల్లాలో నకిలీ అడ్మిట్‌కార్డుతో ఒకరు పరీక్ష రాసేందుకు రాగా సిబ్బంది పట్టుకున్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదు’ అని గౌతం సవాంగ్‌ వెల్లడించారు.

* చిత్తూరులో నకిలీ అడ్మిట్‌కార్డు దుమారం

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షలో చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి ఏపీపీఎస్సీ దృష్టికి వెళ్లిన ఓ సమాచారం గందరగోళాన్ని సృష్టించింది. పరీక్షకు నకిలీ అడ్మిట్‌కార్డుతో వచ్చిన ఒకరిని పట్టుకున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. అయితే నకిలీ అడ్మిట్‌కార్డుతో ఎవరూ పరీక్షకు హాజరు కాలేదని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రకటించారు. ‘ఓ అభ్యర్థి తన పరీక్షా కేంద్రమైన.. నారాయణ కళాశాల, మర్రిమానువీధి చిరునామా ఎక్కడో చెప్పాలని ఫోన్‌ చేశారు. ఈ కేంద్రం చిత్తూరులో లేదని చెప్పాం. పరిశీలన కోసం వివరాల్ని ఏపీపీఎస్సీకి పంపించాం. వాళ్లు కూడా ఈ కేంద్రం చిత్తూరులో లేదని బదులిచ్చారు’ అని జిల్లా అధికారులు వివరణ ఇచ్చారు. సదరు అభ్యర్థి తిరుపతిలోని నారాయణ కళాశాలకు వెళ్లబోయి చిత్తూరుకు వచ్చారని ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఆయిల్‌ ఇండియాలో అవకాశాలు

ఆయిల్‌ ఇండియాలో అవకాశాలు

మహారత్న కేటగిరీకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ 15 సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ప్రొడక్షన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మహారత్న కేటగిరీకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ 15 సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ప్రొడక్షన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసవడంతోపాటు 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి. లేదా పెట్రోలియం ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ పీజీ 60 శాతం మార్కులతో పాసై 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

  • ఐడబ్ల్యూసీఎఫ్‌ రోటరీ డ్రిల్లింగ్‌ వెల్‌ కంట్రోల్‌- లెవెల్‌ 4 లేదా ఐఏడీసీ వెల్‌ షార్ప్‌ రోటరీ డ్రిల్లింగ్‌ వెల్‌ కంట్రోల్‌-సూపర్‌వైజర్‌ లెవెల్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.
  • ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో ఒక్క సంవత్సరంపాటు పనిచేసిన అనుభవం ఉన్నా సరిపోతుంది. ఈ ఉద్యోగులు పర్సనల్‌ ఇంటర్వ్యూ సమయంలో జీతభత్యాల వివరాలను సమర్పించాలి.
  • డ్రిల్లింగ్‌, వర్క్‌ఓవర్‌ రిగ్స్‌లో పని అనుభవం అవసరం.
  • డ్రిల్లింగ్‌, వర్క్‌ఓవర్‌ రిగ్స్‌ సామగ్రి నిర్వహణ, మడ్‌ కెమికల్స్‌ పరిజ్ఞానం ఉండాలి. మొత్తం 15 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 07, ఓబీసీలకు 04, ఎస్సీలకు 02, ఎస్టీలకు 01, ఈడబ్ల్యూఎస్‌లకు 01 కేటాయించారు. 11.03.2024 నాటికి అన్‌రిజర్వుడ్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 32-24, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు 35-37, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 37-39 సంవత్సరాలు ఉండాలి.
  • ఓఐఎల్‌ ఉద్యోగులకు గరిష్ఠ వయసు లేదు.
  • దివ్యాంగులకు కేటగిరీని బట్టి 10-15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు జనరల్‌/ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు రూ. 500 (ట్యాక్సులు అదనం). ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక

అభ్యర్థులను ఫేజ్‌-1లో జరిగే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫేజ్‌-2లో జరిగే పర్సనల్‌ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. సీబీటీకి 85 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు సీబీటీలో 50 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 శాతం సరిపోతుంది. ఇంటర్వ్యూకు అర్హత మార్కులు లేవు.

  • సీబీటీ వ్యవధి 90 నిమిషాలు. దీంట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే 1:5 నిష్పత్తిలో ఫేజ్‌-2కు ఎంపిక చేస్తారు.
  • ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

గమనించాల్సినవి

ఆన్‌లైన్‌ దరఖాస్తులో ప్రస్తుతం వినియోగిస్తోన్న ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లను మాత్రమే రాయాలి. ఏడాదిపాటు వీటిని మార్చకూడదు. సీబీటీ, ఇంటర్వ్యూలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అభ్యర్థులకు వీటి ద్వారానే తెలియజేస్తారు.

  • విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఇంటర్వ్యూ సమయంలో  పరిశీలిస్తారు.
  • ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటర్వ్యూ సమయంలో ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి.
  • ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయింపులు/ సడలింపులు వర్తిస్తాయి.
  • సీబీటీకి ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా అడ్మిట్‌కార్ట్‌ పంపిస్తారు. పోస్టులో పంపరు.  
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఏసీ-2 టైర్‌ రైలు ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 11.03.2024
వెబ్‌సైట్‌: https://oil-india.com