19, ఫిబ్రవరి 2022, శనివారం

SSC CHSL 2021కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ముఖ్యమైన ప్రకటన

SSC CHSL 2021 Exam updates: ఎస్సెస్సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL 2021)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుక్రవారం (ఫిబ్రవరి 18) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఎస్సెస్సీ నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 7, 2022ను చివరి తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐతే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను పూర్తి చేయడానికి చివరి తేదీ వరకు వేచి చూడకుండా అంత కంటే ముందే దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు తాజాగా సూచించింది. చివరి తేదీనాటికి సర్వర్‌ బిజీగా ఉంటడం వల్ల సకాలంలో దరఖాస్తులు చేసుకోవడంలో వైఫల్యం ఎదుకావచ్చు. అందువల్ల ముగింపు తేదీవరకు వేచిచూడకుండా అభ్యర్ధులు వీలైనంత త్వరగా దరఖాస్తులు పూరించవల్సిందిగా కోరింది. అంతేకాకుండా అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అన్ని ముఖ్యమైన సూచనలను చదవాలని కూడా తెల్పింది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను ఎస్సెస్సీఅధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/లో సందర్శించవచ్చు.

SSC CHSL 2021 భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు, ఇతర ముఖ్యసమాచారం మీకోసం.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ పరీక్ష ద్వారా లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు జనవరి 1, 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులను టైర్‌1, టైర్‌2, స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం రెండు విధానాల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అందులో మొదటిది టైర్‌-1 పరీక్ష దీనిని 200 మార్కులకి ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఇస్తారు. టైర్‌-2 పరీక్షను డిస్క్రిప్టివ్‌ పేపర్‌ రూపంలో నిర్వహిస్తారు. పేపర్‌ 1 200 మార్కులకు, పేపర్‌ 2 100 మార్కులకు ఉంటుంది. టైర్‌1 పరీక్షను 2022 మేలో నిర్వహిస్తారు. టైర్‌2 తేదీని ఇంకా ప్రకటించలేదు.

దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 7, 2022.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లిండానికి చివరి తేదీ: మార్చి 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి. 

అప్లికేషన్ల కొరకు సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

IGNOU online programs: ఫారెన్‌ లాంగ్వేజుల్లో రెండు కొత్త ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించిన ఇగ్నో

IGNOU online Spanish and French language courses: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU ) జనవరి 2022 సెషన్‌కు సంబంధించి స్కూల్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్‌ (School of Foreign Languages).. స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో ఆన్‌లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించింది. స్పానిష్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ (CSLCOL), ఫ్రెంచ్ లాంగ్వేజ్ (CFLOL)లో సర్టిఫికేట్ కోర్సులు అందించనుంది. ఈ భాషలను అర్థం చేసుకోవడం, చదవడం, రాయడం, వినడం, మాట్లాడటంలో నైపుణ్యాలను పెంపొందించడంలో కొత్త కోర్సులు సహాయపడతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ignouiop.samarth.edu.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు నెలల వ్యవధికలిగిన ఈ సర్టిఫికేట్ కోర్సులకు ఫీజు రూ.4,500గా నిర్ణయించింది. భ్యాసకులు భాషా నైపుణ్యాలు (ఉచ్చారణ, వ్యాకరణం, పదజాలం, ప్రాథమిక సంభాషణ సామర్థ్యం) పెంపొందించడమే ఈ కోర్సుల ముఖ్య ఉద్ధేశ్యం. రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి స్పానిష్ భాషలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక ఫ్రెంచ్ లాంగ్వేజ్‌ ప్రోగ్రామ్‌.. ఇంటర్నేషనల్‌ స్టాండర్డైజేషన్ పెడగాజీ ఆధారంగా రూపొందించిన ఈ కోర్సు యూరోపియన్ భాషా నైపుణ్యాల పెంపుకు ఉపయోగపడేలా ఉంటుంది. ఈ కోర్సులో ప్రవేశం కోరే అభ్యర్ధులు రూ. 6,600 చెల్లించాల్సి ఉంటుందని కోఆర్డినేటర్‌ డాక్టర్ దీపన్విత శ్రీవాస్తవ తెలిపారు. స్పెయిన్, ఫ్రెంచ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఇతర వివరాల కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignouiop.samarth.edu.in ను సందర్శించాలని అభ్యర్ధులకు సూచించారు.

 

Gemini Internet

17, ఫిబ్రవరి 2022, గురువారం

RBI Assistant Recruitment 2022: ఆర్బీఐలో 950 అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

RBI Assistant 2022 jobs: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్‌, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో అసిస్టెంట్‌ పోస్టుల (Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 950

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ పోస్టులు

హైదరాబాద్‌లో: 25

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు డిసెంబర్‌1, 2021నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధిస్తే చాలు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ స్థానిక భాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషెన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓబీసీ/జనరల్‌ అభ్యర్ధులకు: రూ.450
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.50

ఆన్‌లైన్‌ పరీక్షలు: 2022, మార్చి 26, 27 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

click here for official notification Gemini Internet

16, ఫిబ్రవరి 2022, బుధవారం

ECIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఈసీఐఎల్‌ హైదరాబాద్‌ నోటిఫికేషన్‌.. రాత పరీక్షలేకుండానే ఉద్యోగాలు

ECIL Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 12

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  • టెక్నికల్‌ ఆఫీసర్లు: 3
  • టెక్నికల్‌ అసిస్టెంట్లు: 4
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్లు: 4
  • జూనియర్‌ ఆర్టిజన్‌: 1

పే స్కేల్‌: నెలకు రూ.18,824ల నుంచి రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్దుల వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో ఐఐటీ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధులకు టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 25, 2022.

అడ్రస్‌: నోటిఫికేషన్‌లో తెల్పిన విధంగా సంబంధిత రాష్ట్రాల్లోని ఈసీఐఎల్ జోనల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Gemini Internet

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

అగ్రికల్చర్ విభాగంలో 8th పాస్ తో వ్రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ANGRAU వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటి నుండి కేవలం 8th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు Gemini Internet

పోస్టులు సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్
ఖాళీలు07
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు


విద్యార్హతలుసెమి స్కిల్ల్డ్ లేబర్ – 8వ తరగతి ఉత్తీర్ణత.
• బయో ఫర్టిలైజర్ విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు.
ల్యాబ్ టెక్నీషియన్ – సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ వుత్తీర్ణత
• బయో ఫర్టిలైజర్ విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
దరఖాస్తు విధానం • ఇంటర్వ్యూ కు హాజరయ్యే సందర్భంలో అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్తే సరిపోతుంది.
• క్రింది అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ఇంటర్వ్యూ తేదీఫిబ్రవరి 17, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ.

 ANGRAU Recruitment 2022 Application Form Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్

IISC Bangalore Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ్‌ట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఉద్యోగాలు.

IISC Bangalore Recruitment 2022: బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ్‌ట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ (Project Staff job) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

పోస్టుల వివరాలు:

  • ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్ (సివిల్‌, ఎలక్ట్రికల్‌): 2
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్ (సివిల్‌, ఎలక్ట్రికల్‌): 4
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్ (సివిల్‌, ఎలక్ట్రికల్‌): 6
  • ప్రోగ్రాం అసిస్టెంట్‌: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: పోస్టును బట్టి నెలకు రూ.28,000ల నుంచి 49,000లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 3, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

TCS Recruitment 2022: రూ. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు

TCS Jobs: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) క్యాంపస్ డిజిటల్ హైరింగ్ 2022 పేరుతో ఓ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఇంజనీర్లు, ఎంసీఎ, ఎమ్మెస్సీ డిగ్రీ పూర్తియిన వారి నుంచి దరఖాస్తులను కోరుతోంది. మీ కెరీర్ అపరిమితమైన వృద్ధికి, అసాధారణమైన అవకాశాలకు టీసీఎస్ వారధిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 2019, 2020, 2021 సంవత్సారల్లో ఇంజనీరింగ్ పూర్తయిన గ్రాడ్యుయేట్‌లు ఇందుకు అర్హులుగా పేర్కొంది. అలాగే 6 నుంచి 12 నెలల పాటు IT అనుభవం కూడా ఉండాలని పేర్కొంది.

ఎవరు అర్హులు: BE / B.Tech / ME / M.Tech / MCA/ M.Sc ఉత్తీర్ణత సాధించినవారు.

ఏ సంవత్సరంలో పాసైన వారు అర్హులు – 2019, 2020, 2021, 6 నుంచి 12 నెలల వరకు IT పని అనుభవం.

పదో తరగతి, ఇంటర్, డిప్లొమా (వర్తిస్తే), గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ పరీక్షలో ప్రతిదానిలో 70 శాతం లేదా 7 CGPA ఉండాలి. (అన్ని సెమిస్టర్‌లలోని అన్ని సబ్జెక్టులు)

అలాగే అభ్యర్థి నిర్ణీత కోర్సు వ్యవధిలో కోర్సును పూర్తి చేసి ఉండాలి. అంటే గ్యాప్ ఉండకూడదు. అభ్యర్థికి ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు కూడా ఉండకూడదు. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుంచి 28 సంవత్సరాల వయసు వారై ఉండాలని టీసీఎస్ పేర్కొంది.

ఈ ఎంపిక విధానం రెండు రౌండ్లుగా నిర్వహిస్తున్నారు. మొదట రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఎంపికైన వారు ఇంటర్వ్యూ రౌండ్‌కు ఎంపిక చేస్తారు.

అయితే రాత పరీక్ష మూడు విభాగాల్లో కండక్ట్ చేయనున్నారు. పార్ట్ 1లో అభ్యర్థుల అడ్వాన్స్‌డ్‌ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 2, పార్ట్‌ 3లలో అభ్యర్థుల వెర్బల్ ఎబిలిటీ స్కిల్స్, అడ్వాన్స్‌డ్ కోడింగ్ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి.

జీతం: అండర్ గ్రాడ్యుయేట్లకు సంత్సరానికి రూ. 7 లక్షలు కాగా, పీజీ చేసిన వరాకి ఏడాదికి రూ. 7.3 లక్షలు అందించనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ: TCS NextStep పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అందులో డిజిటల్ డ్రైవ్ కోసం అప్లై చేసుకోవాలి. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 25, 2022గా ఉంది. ఈలోపే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

రాత పరీక్ష ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తారు. టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్‌ 2022కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా టీసీఎస్‌ హెల్ప్‌డెస్క్‌కు ilp.support@tcs.com మెయిల్ పంపవచ్చు. అలాగే 18002093111 హెల్ప్‌లైన్ నంబర్‌‌కు కూడా కాల్ చేసి, సందేహాలు తీర్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం టీసీఎస్ వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

 

Gemini Internet