నవోదయల్లో లేటరల్ ఎంట్రీ ‣ తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు అత్యున్నత బోధనను ఉచితంగా అందించే వేదికల్లో ముఖ్యమైనవి నవోదయ విద్యా సంస్థలు. వీటిలో అవకాశం వచ్చినవారు ఇంటర్మీడియట్ (ప్లస్ 2) వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. ఈ సంస్థల్లో ఆరో తరగతి నుంచి విద్య ప్రారంభమవుతుంది. ఈ తరగతిలో చేరిన విద్యార్థులు మధ్యలో వైదొలిగితే ఆ ఖాళీలను తొమ్మిదో తరగతిలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎనిమిదో తరగతి చదువుతోన్నవారు లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిదిలో ఉన్న ఖాళీల భర్తీకి నవోదయ విద్యాసమితి ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యాసమితి నడుస్తోంది. ఈ పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులన్నీ పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. ఈ సంస్థల్లో బాలబాలికలు కలిసి చదువుకుంటారు. వసతి విడిగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతోపాటు దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు బోధనతో పాటు వసతి, భోజనం, ప...
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు