20, నవంబర్ 2020, శుక్రవారం

D.El.Ed Exams 2020 News update || డీ.ఎల్.ఈడీ పరీక్షలపై ముఖ్యమైన అప్డేట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (డీ. ఎల్. ఈడీ ) పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన వెలువడింది.

ఏపీ లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీ. ఎల్. ఈడీ ) 2018-2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన ద్వితీయ సంవత్సర పరీక్షలపై ఈ ప్రకటన ద్వారా స్పష్టత వచ్చింది.

రాబోయే నెల డిసెంబర్ నెలలో 2018-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఏపీ డీ. ఎల్. ఈడీ ద్వితీయ సంవత్సరం ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి.

డిసెంబర్ నెలలో జరిగే ఈ పరీక్షలకు 2018-20 బ్యాచ్ కన్నా ముందు బ్యాచ్ లో చదివినవారు కూడా హాజరు కావచ్చు.

ఏదైనా సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాకపోతే  ఈ పరీక్షలకు విద్యార్థులు హాజరు అయ్యి రాసుకోవచ్చు. దీనికి గాను ఈ పరీక్షలకు సంబంధించి ఫీజులను అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ నాటికీ చెల్లించవలెను.

50 రూపాయలు అపరాధ రుసుముతో డిసెంబర్ 7,2020 వరకూ ఫీజులను చెల్లించవచ్చు.

రెగ్యులర్ అభ్యర్థులు ఈ పరీక్షలకు 250 రూపాయలు ను పరీక్ష రుసుముగా చెల్లించవలెను అని ఏపీ సాంకేతిక విద్యా శాఖ ఒక ప్రకటనలో తెల్పింది.

కామెంట్‌లు లేవు: