ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ | ప్రకటన వచ్చిన 7 రోజుల లోపు, ( నవంబర్ 24, 2020 ) |
ఉద్యోగాలు – వివరాలు :
తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఉన్న సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ – నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఉద్యోగాలు :
టీచింగ్ పోస్టులు :
ఈ ప్రకటన ద్వారా సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
టీచింగ్ పోస్టులు – బోధన విభాగాలు :
ఈ ప్రకటన ద్వారా కామర్స్, మాథ్స్,స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, తెలుగు, అరబిక్ లకు సంబంధించిన బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నాన్ – టీచింగ్ పోస్టులు :
ఇదే ప్రకటన ద్వారా సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో నాన్ టీచింగ్ విభాగంలో ఈ క్రింది ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.
నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్.
సీనియర్ లైబ్రేరియన్.
జూనియర్ లైబ్రేరియన్.
అర్హతలు :
టీచింగ్ పోస్టులు :
టీచింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AICTU, ఓయూ నిబంధనలు ప్రకారం విద్యార్హతలు కలిగి ఉండవలెను.
నాన్ – టీచింగ్ పోస్టులు :
నాన్ టీచింగ్ విభాగానికి మాస్టర్ డిగ్రీ లో ఉత్తీర్ణత, వివిధ విభాగాలను అనుసరించి లైబ్రరీ సైన్స్ కోర్సులలో బ్యాచిలర్ మరియు మాస్టర్ డిగ్రీ కోర్సులలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ల విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థుల విద్యా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా వేతనాలను అందుకోనున్నారు.
ముఖ్య గమనిక :
ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు ప్రకటన వచ్చిన వారం (7) రోజుల లోపు తమ తమ రెస్యూమ్ లు మరియు విద్యా ప్రామాణిక సర్టిఫికెట్స్ ను పంపవలెను.
ఈమెయిల్ అడ్రస్ :
saisudhircontact@gmail.com
సంప్రదించవల్సిన చిరునామా :
సాయి సుధీర్ డిగ్రీ & పీజీ కాలేజ్,
B -8/2,
E. C., ECIL X ROADS,
హైదరాబాద్ -50062.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి