ఏపీ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం, నెల్లూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి, తక్కువ విద్య అర్హతలతో ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలను 80%లోకల్ అభ్యర్థులతో,20% నాన్ – లోకల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు కావున ఏపీ లో అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 5,2020 |
దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 11,2020 సాయంత్రం 5 PM. |
విభాగాల వారీగా ఖాళీలు :
లైబ్రేరియన్ | 1 |
పర్సనల్ అసిస్టెంట్ | 1 |
జూనియర్ అసిస్టెంట్ | 3 |
డీఈఓ | 3 |
హౌస్ కీపర్స్ / వార్డెన్స్ | 2 |
అటెండర్స్ | 2 |
క్లాస్ రూమ్ అటెండర్స్ | 2 |
డ్రైవర్స్ – HV | 1 |
డ్రైవర్స్ – LV | 1 |
వాచ్ మెన్ | 2 |
క్లీనర్ /వ్యాన్ అటెండెంట్ | 1 |
ఆయాలు | 1 |
స్వీపర్స్ | 1 |
ల్యాబ్ అటెండెంట్ | 1 |
లైబ్రరీ అటెండెంట్ | 1 |
కుక్స్ | 3 |
కిచెన్ బాయ్స్ /టేబుల్ బాయ్స్ | 2 |
దోబీ | 1 |
తోటీ / స్వీపర్ | 2 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాల ఖాళీలను అనుసరించి 5వ తరగతి /7వ తరగతి /10వతరగతి /డిగ్రీ విత్ లైబ్రరీ సైన్స్ / డిగ్రీ విత్ బీఈడీ /కంప్యూటర్ PGDCA మొదలైన కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు కొన్ని విభాగాల ఉద్యోగాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ /ఎస్టీ /బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపును ఇచ్చారు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్, బీసీ కేటగిరి అభ్యర్థులు 300 రూపాయలును, ఎస్సీ /ఎస్టీ /పీహెచ్ కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
మెరిట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విభాగాలను అనుసరించి 12,000 రూపాయలు నుండి 15000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.
అభ్యర్థులు వారి దరఖాస్తులను ఈ క్రింది అడ్రస్ లో అందచేయవలెను.
అడ్రస్ :
గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్,
నెల్లూరు,
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి