డీఎస్సీ 2021 నోటిఫికేషన్ విడుదలపై క్లారిటీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ 2021 నోటిఫికేషన్ విడుదలపై ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.
ఏపీ లో రాబోయే నూతన సంవత్సరం 2021 ఫిబ్రవరి నెలలో డీఎస్సీ వ్రాతపరీక్షలను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది.
ఈ మేరకు గత డీఎస్సీ 2018 వ సంవత్సరంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగుల కేటగిరీ కొటా లలో ఖాళీలను పంపించాలని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులకు మార్గదర్శకాలు పంపినట్లు సమాచారం అందుతుంది.
గత డీఎస్సీ లలో మిగిలిన బ్యాక్ లాగ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను ఏపీ లో నూతన డీఎస్సీ 2021 పరీక్షలను ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నారు.
జనవరి నెలలో పలు పోటీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో ఆన్లైన్ విధానంలో ఏపీ డీఎస్సీ పరీక్షలను నిర్వహించేవిధంగా విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) తో సంబంధం లేకుండా ఏపీ లో నూతన డీఎస్సీ ని నిర్వహించనున్నట్లుగా సమాచారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి