22, డిసెంబర్ 2020, మంగళవారం

స్వయం ఉపాధి

సప్త స్వరాల సంగీతం.. ఇప్పుడు యువత సుస్థిర భవితకు పల్లవిగా మారుతోంది! సంప్రదాయ హిందుస్థానీ, కర్ణాటక సంగీతం మొదలు.. వెస్ట్రన్ మ్యూజిక్ వరకు ప్రతిభ ఉంటే.. ఆహ్వానం పలుకుతున్న అవకాశాలు అనేకం! మూస ధోరణి కెరీర్స్‌కు భిన్నంగా..ఆహ్లాదాన్ని పంచే,పెంచే..మ్యూజిక్ రంగ కెరీర్స్‌పై యువతలో ఆసక్తి పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే.. సంగీత ప్రపంచంలో ఓనమాల నుంచి ఆధునిక ట్రెండ్స్ వరకు..అన్ని అంశాలపై శిక్షణనిచ్చే కోర్సులూ అందుబాటులోకి వస్తున్నాయి!Career guidance

సంగీతంపై ఆసక్తి, ప్రతిభ ఉంటే.. విలక్షణ కెరీర్ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు! ఈ నేపథ్యంలో.. సంగీత ప్రపంచంలో అవకాశాలు దక్కించుకునేందుకు అందుబాటులో ఉన్న కోర్సులు, ఉపాధి మార్గాల గురించి తెలుసుకుందాం... 

 

 టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి వందల కోట్ల వ్యయంతో నిర్మించే భారీ బడ్జెట్ చిత్రాల వరకూ.. హిట్ కొట్టాలంటే.. మ్యూజిక్ పండాల్సిందే. తెలుగు, హిందీ వంటి భాషల్లో మ్యూజికల్ హిట్ సినిమాల గురించి మనకు తెలిసిందే!! ప్రేక్షకులను ఆకట్టుకునే టీజర్, ప్రోమోలు రూపొందాలన్నా.. వీనులవిందుచేసే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండాల్సిందే! లేదంటే.. సినిమా కథ, కథనం, స్క్రీన్ ప్లే ఎంత బాగున్నా.. ఆ సినిమా హిట్ అవుతుందో? లేదో చెప్పలేని పరిస్థితి. కేవలం మ్యూజిక్ మాయాజాలంతో హిట్ అయిన సినిమాలు ఎన్నో. కమర్షియల్ సినిమాల సక్సెస్‌లో మ్యూజిక్‌కు ఉన్న ప్రాధాన్యం ఇది. టాలీవుడ్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. బాహుబలి, అలా వైకుంఠపురం, గీత గోవిందం వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందడంలో బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్ ఎంతో కీలకంగా నిలిచింది. ఇంతటి కీలకమైన సంగీత రంగంలో ఉపాధి పొందేందుకు మార్గాలు అనేకం! మూస ధోరణి కెరీర్స్‌కు భిన్నంగా ఆలోచించే వారికి చక్కటి వేదికగా నిలుస్తోంది మ్యూజిక్ ఇండస్ట్రీ!!

 

పలు రకాల కొలువులు.. :

 {పస్తుతం మ్యూజిక్ రంగంలో పలు రకాల కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. మ్యూజిక్ డెరైక్టర్, మ్యూజిక్ క్రూమెంబర్స్ మాత్రమే కాకుండా.. వ్యక్తిగతంగా తమలోని సంగీత సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి. వీటి ద్వారా ఒక్కసారి క్రేజ్ సొంతం చేసుకుంటే.. కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు. ప్రఖ్యాత మ్యూజిక్ డెరైక్టర్ల దగ్గర, ప్రొడక్షన్ హౌస్‌లలో పనిచేసే అవకాశం తలుపు తడుతుంది.

 

గాయకులు(సింగర్స్) :

 సంప్రదాయ సంగీతంపై అవగాహన, వాటితో రాగాలాపన చేయగలిగే నైపుణ్యం ఉన్న వారు సింగర్స్‌గా వెలుగులీనేందుకు అవకాశం ఉంది. సింగర్‌గా ప్రతిభ నిరూపించు కోవాలంటే.. మ్యూజిక్ డెరైక్టర్ లేదా కంపోజర్ ఇచ్చిన ట్యూన్‌ను అర్థం చేసుకొని.. దానికి తగ్గట్టుగా పాటను ఆలపించే నైపుణ్యం ఉండాలి. వాస్తవంగా ఇది సహజ ఆసక్తితో లభించే సామర్థ్యం. ఇందులో ఓనమాలు నేర్చుకోవడానికి.. ఆ తర్వాత ట్యూన్స్‌కు అనుగుణంగా రాగాలు ఆలపించే నైపుణ్యం పొందడానికి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

 

కంపోజర్ :

 మ్యూజిక్ రంగంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన స్థానం.. మ్యూజిక్ కంపోజర్. దర్శకులు ఒక సన్నివేశాన్ని వివరించి.. దానికి అనుగుణంగా బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్ కోరుకుంటారు. సదరు సన్నివేశం ఆధారంగా ఎలాంటి మ్యూజిక్ రూపొందిస్తే.. ఆ సన్నివేశానికి సరిగ్గా సరిపోతుందో గుర్తించగలిగే నైపుణ్యం కంపోజర్‌కు అవసరం. అదే విధంగా పాటకు తగ్గట్టు ట్యూన్ రూపొందించడంతోపాటు, సినిమా ఆసాంతం వినసొంపైన మ్యూజిక్‌ను కంపోజ్ చేయగలిగే నేర్పు కంపోజర్‌కు ఉండాలి. దీనిపైనే ఆ సినిమాకు లభించే ఆదరణ ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి మన తెలుగు చిత్రాలను విశ్లేషిస్తే.. కేవలం మ్యూజిక్ బాగున్న కారణంగానే హిట్ అయిన సినిమాలు ఎన్నో! అందుకే సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ కంపోజర్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నైపుణ్యాన్ని, క్రేజ్‌ను బట్టి లక్షల్లో పారితోషికం తీసుకునే కంపోజర్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు. 

 

మ్యూజిక్ ప్రొడ్యూసర్ :

 మ్యూజిక్ విభాగంలో మరో కీలకమైన హోదా..మ్యూజిక్ ప్రొడ్యూసర్. సన్నివేశం, పాటకు అనుగుణంగా..మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెం ట్స్‌ను ఎంపిక చేసుకోవడం, సంబంధిత వాద్యకారులను గుర్తించడం, రికార్డింగ్ ప్రక్రియను పూర్తి చేయడం వంటివి మ్యూజిక్ ప్రొడ్యూసర్ ప్రధాన విధులు. సాహిత్యంలో చేయాల్సిన మార్పులను గుర్తించి.. వాటిని సదరు గేయ రచయితలకు తెలియజేయడం తదితర కీలకమైన బాధ్యతలను ఇతను నిర్వర్తించాల్సి ఉంటుంది.

 

మ్యూజిక్ రికార్డింగ్ :

 మ్యూజిక్ విభాగంలో రికార్డింగ్‌ను అత్యంత ప్రధానమైన అంశంగా పేర్కొనొచ్చు. రికార్డింగ్ స్టూడియోలో టెక్నికల్ సదుపా యాల నుంచి ఒక పాటకు సంబంధించిన మ్యూజిక్‌ను గ్రహించి.. రికార్డింగ్ చేయడం వంటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. రికార్డింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు, ఇతర శబ్దాలు వినపించకుండా.. కేవలం శ్రావ్యమైన సంగీతాన్ని మాత్రమే ప్రేక్షకులకు, శ్రోతలకు వినిపించే విధంగా సాంకేతికపరమైన టెక్నిక్స్‌ను ఉపయోగిం చడం కూడా మ్యూజిక్ రికార్డింగ్‌లో ముఖ్యం. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. మనం వినే పాటల్లో గాయకుల గొంతు, మ్యూజిక్ మాత్రమే వినిపించి మనల్ని అలరిస్తాయి. కానీ రికార్డింగ్ సమయంలో మరెన్నో శబ్దాలు కలుస్తాయి. వీటిని నిర్ణీత ఇన్‌స్ట్రుమెంట్స్ వినియోగించి తొలగించడం.. మ్యూజిక్ రికార్డింగ్, రీ-రికార్డింగ్ ద్వారా చేసి.. మనకు  అనవసర శబ్దాలు వినిపించకుండా.. శ్రావ్యమైన సంగీతాన్ని అందించడం మ్యూజిక్ రికార్డింగ్‌తోనే సాధ్యం అవుతుంది.

 

ఇన్‌స్ట్రుమెంటలిస్ట్ :

 సంగీత రంగంలో ఉపాధిని అందించే మరో మార్గం.. మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంటలిస్ట్. ఒకే సమయంలో రెండు, మూడు వాద్య పరికరాలను వినియోగించి.. పాటకు, లేదా సన్నివేశానికి అనుగుణమైన సంగీతాన్ని సమకూ ర్చడంలో ఇన్‌స్ట్రుమెంటలిస్ట్‌ల పాత్ర ఎంతో కీలకంగా నిలుస్తోంది. అదే విధంగా మ్యూజిక్ బృందానికి సంబంధించి.. ఆయా వాద్య పరికరాల సామర్థ్యాన్ని పరీక్షించడం, సన్నివేశానికి అనుగు ణంగా అవసరమైన ఇన్‌స్ట్రుమెంట్స్‌ను గుర్తించడంలోనూ వీరు ముఖ్య పాత్ర పోషిస్తారు. 

 

మ్యూజిక్ ఇండస్ట్రీ.. కార్పొరేట్ రూపు :

 మ్యూజిక్ ఇండస్ట్రీ అనగానే మనకు సినిమాలు, పాటలు, సన్నివేశాలే గుర్తుకొస్తాయి. ఇప్పుడు మ్యూజిక్ రంగం కూడా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. దీనికి కారణం.. ఓటీటీ విధానంలో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ సంఖ్య క్రమంగా పెరుగుతుండటమే. అదే విధంగా సోషల్ మీడియా, యూట్యూబ్, ఇతర మార్గాల ద్వారా సంగీత అభిమానులకు నేరుగా తమకు నచ్చిన సంగీతాన్ని వినే అవకాశం అందుబాటులోకి వస్తోంది. 

 

ఈ రంగాల్లోనూ అవకాశాలు..

  1.  మ్యూజిక్ విభాగంలో నైపుణ్యం పొందిన వారికి ఇప్పుడు ఇతర రంగాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మ్యూజిక్ కాలేజ్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్స్‌ను పేర్కొనొచ్చు. 
  2.  మ్యూజిక్ కాలేజ్‌లలో మ్యూజిక్ టీచర్స్‌గా కొలువు సొంతం చేసుకోవచ్చు.
  3.    రిహాబిలిటేషన్ సెంటర్స్‌లో.. మ్యూజిక్ థెరపిస్ట్‌గా కొలువు దక్కించుకోవచ్చు.
  4.    మ్యూజిక్ జర్నలిస్ట్‌గానూ మీడియా రంగంలో అడుగుపెట్టొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఎంటర్‌టైన్ మెంట్, ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో కాలమిస్ట్స్, రైటర్స్, క్రిటిక్స్‌గా అవకాశాలు లభిస్తున్నాయి.

 

స్వయం ఉపాధి :

 మ్యూజిక్ విభాగంలో నైపుణ్యాలు పొందినవారు స్వయం ఉపాధి మార్గాలు కూడా అన్వేషించొచ్చు. యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వెబ్‌సైట్స్, అడ్వర్టయిజింగ్ కంపెనీలకు పనిచేసే అవకాశం లభిస్తుంది. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు తాము రూపొందించే యాడ్స్‌కు సంగీతం సమకూర్చే క్రమంలో ఫ్రీలాన్సర్స్‌కు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి.

 

 భారీగా ఆదాయం :

 మ్యూజిక్ విభాగంలో నిష్ణాతులైన వారికి ఆదాయం భారీగానే ఉంటుం ది.  సక్సెస్ వచ్చే వరకూ సహ నంతో ప్రయత్నించాల్సి ఉంటుంది. సినిమా రంగాన్నే లక్ష్యంగా పెట్టుకుంటే స్థిరమైన ఆదాయం కోసం కొంతకాలం వేచి చూడక తప్పదు. ఒకసారి తమను తాము నిరూపించు కుం టే.. అవకాశాలకు, ఆదా యానికి కొదవ ఉండదు. 

 

మ్యూజిక్ ఇండస్ట్రీ.. ముఖ్యాంశాలు : 

  1.   ప్రపంచ మ్యూజిక్ ఇండస్ట్రీలో 15వ స్థానంలో భారత్ ఎ 2022 నాటికి పదో స్థానానికి చేరుకోనున్నట్లు అంచనా.
  2.   యువతకు విస్తృతం అవుతున్న అవకాశాలు.
  3.   ప్రధాన ఉపాధి వేదికలుగా సినిమారంగం, గేమింగ్ అండ్ యానిమేషన్, ఓటీటీ ప్రొవైడర్స్, యాడ్ ఏజెన్సీస్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వెబ్‌సైట్స్.
  4.  ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కు పెరుగుతున్న ఆదరణ. ఫలితంగా మ్యూజిక్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్.
  5.  ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్స్, ఇతర అకడమిక్ ఇన్‌స్టి ట్యూట్స్‌లో మ్యూజిక్ టీచర్స్‌గా కొలువులు.
  6.  నైపుణ్యాల పెంపునకు మార్గాలు :

 మ్యూజిక్ విభాగంలో నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అకడమిక్ స్థాయిలోనే పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో.. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌లతోపాటు షార్ట్‌టర్మ్ కోర్సుల పేరిట మ్యూజిక్ విభాగానికి సంబంధించి సౌండ్ ఇంజనీరింగ్, రికార్డింగ్, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 

 కోర్సులు అందించే విద్యాసంస్థలు : 

  1.  ఉస్మానియా యూనివర్సిటీ 
  2.  ఆంధ్రా యూనివర్సిటీ 
  3. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 
  4. ముంబై యూనివర్సిటీఎ  బెనారస్ హిందూ యూనివర్సిటీ
  5. ఢిల్లీ యూనివర్సిటీ 
  6. సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ 
  7. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 
  8. శంకర్ మహదేవన్ అకాడమీ
  9. కె ఎం కన్సర్వేటరీ 
  10. గ్లోబల్ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ 
  11.  మద్రాస్ మ్యూజిక్ అకాడమీ 
  12. బారిటోన్  మ్యుజిషియల్స్
  13.  కోల్‌కత స్కూల్ ఆఫ్ మ్యూజిక్. 

  

 ఆసక్తి, క్రియేటివిటీ ఉంటేనే..

 మ్యూజిక్ ఇండస్ట్రీలో రాణించాలం టే.. స్వ తహాగా సృజనాత్మకత, ఆసక్తి ఉండాలి. అప్పుడే సమర్థవంతంగా రాణించగలరు. కోర్సు పూర్తి చేస్తూనే, సర్టిఫికెట్ చేతికందుతూనే కొలువు లభిస్తుందని భావించొద్దు. ఆయా మ్యూజిక్ డెరైక్టర్లను సంప్రదించి తమను తాము నిరూపిం చుకున్నప్పుడే అవకాశాలు రావడం మొదల వుతుంది. పస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు.. మ్యూజిక్ డెరైక్టర్లు, మ్యూజిక్ స్టూడియోలని ర్వాహకులతో సంప్రదించి.. తమ విద్యార్థులకు అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. 

 - ఎస్.ఆర్.గణేశ్, మ్యూజిక్ డెరైక్టర్, డెరైక్టర్, ఎస్‌ఆర్‌జీ ఫిల్మ్ స్టూడియో

కామెంట్‌లు లేవు: