22, డిసెంబర్ 2020, మంగళవారం

TET Notification Details Update 2020 || ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) పరీక్ష నిర్వహణపై తాజా వార్త


ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) 2021 పై తాజా వార్త :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) నోటిఫికేషన్ పై కీలకమైన అప్డేట్ వచ్చినది.


ఏపీ లో సుమారుగా 15,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించనున్న మెగా డీఎస్సీ 2021 నోటిఫికేషన్ కు ముందుగానే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ విడుదల కానుంది.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో పలు జాతీయ పరీక్షలు నిర్వహణ జరుగుతుండడంతో ఆన్లైన్ స్లాట్స్ ఖాళీలు లేకపోవడం వల్ల మార్చి /ఏప్రిల్ 2021 ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్ ) జరగనున్నాయి అనే విషయం  ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది.

ఈ సారి ఏపీ లో నిర్వహించనున్న టెట్ పరీక్ష సిలబస్ లో స్వల్ప మార్పులు చోటుచేసుకొనున్నాయి. టెట్ సిలబస్ సిలబస్ మార్పు బాధ్యతలను ఏపీ విద్యా శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (AP SCERT ) కు అప్పగించినది. మరో వారంలో ఎస్ సీ ఈ ఆర్టీ  ఈ సిలబస్ మార్పులు చేర్పుల ప్రక్రియను  పూర్తి చేయనున్నట్లు సమాచారం.

కామెంట్‌లు లేవు: