31, జనవరి 2021, ఆదివారం

'ఆయుష్ - 2021’ అడ్మిషన్లకు నోటిఫికేషన్


లబ్బీపేట (విజయవాడతూర్పు) : డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని కశాశాలల్లో 2021 విద్యా సంవత్సరానికి ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్లకు యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ సూచించారు. గతేడాది నవంబర్ 13 నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసిన వారు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

కామెంట్‌లు లేవు: