11, జనవరి 2021, సోమవారం

AP Library Jobs Recruitment 2021 Telugu || పరీక్ష లేదు, ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ శాఖలో ఉద్యోగాలు

పరీక్ష లేదు, ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ శాఖలో ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా  జిల్లా గ్రంధాలయ సంస్థలో ఖాళీగా ఉన్న గ్రంథ పాలకులు మరియు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకీ గాను ఒక నోటిఫికేషన్ విడుదల అయినది.

 

ఈ ఉద్యోగాలకు స్థానిక జిల్లా పరిధిలో చదువుకున్న అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిజనవరి 28,2021 (5PM)

విభాగాల వారీగా ఖాళీలు :

గ్రంథ పాలకులు3
రికార్డు అసిస్టెంట్1

అర్హతలు :

గ్రంథ పాలకుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లైబ్రరీ సైన్స్ కోర్సులో B. Lisc/C. Lisc సర్టిఫికెట్స్ ను కలిగి , కంప్యూటర్ లో డేటా ఎంట్రీ స్కిల్ సర్టిఫికెట్ ను కలిగి ఉండవలెను. లేదా ఏదైనా డిగ్రీ  తో పాటు కంప్యూటర్ లో డేటా ఎంట్రీ స్కిల్స్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.

రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ మరియు కంప్యూటర్స్ లో డేటా ఎంట్రీ స్కిల్స్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం, మెరిట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా 15,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

దరఖాస్తులు పంపవాల్సిన చిరునామా :

అభ్యర్థులు దరఖాస్తులను నింపి తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ ను అటెస్టేడ్ చేసి, దరఖాస్తు కేటగిరీ పేరు వ్రాసి, సెల్ ఫోన్ నెంబర్ ను వేసి ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.

అడ్రస్ :

కార్యదర్శి,

కృష్ణా జిల్లా గ్రంధాలయ శాఖ,

పోర్ట్ రోడ్,

మచిలీపట్నం,

ఆంధ్రప్రదేశ్ – 521001.

ఫోన్ నెంబర్స్ :

08672-222221.

Website 

కామెంట్‌లు లేవు: