తిరుపతి ఐజర్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, 31,000 రూపాయలు జీతం :
తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( ఐజర్ ) లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేది | జనవరి 15,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | జనవరి 18,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐజర్ ), తిరుపతి , చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో
ప్రాజెక్ట్ అసిస్టెంట్
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60% మార్కులతో ఎం. ఎస్సీ (కెమిస్ట్రీ ) కోర్సు లో ఉత్తీర్ణత సాధించాలి. CSIR యూజీసీ నెట్ /గేట్ /ఎల్. ఎస్ లకు సంబంధించి వాలీడ్ స్కోర్ కార్డు కలిగి ఉండవలెను.
సింథాటిక్ కెమిస్ట్రీ, మెటీరియల్ కెమిస్ట్రీ, కేటలిసిస్ అంశములలో అనుభవం అవసరం.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈమెయిల్ విధానం ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 31,000 రూపాయలు ఫెలో షిప్ గా అందించబడుతుంది. దీనితో పాటు 8 % హెచ్. ఆర్. ఏ కూడా లభిస్తుంది.
ఈమెయిల్ అడ్రస్ :
eb.raman@iisertirupati.ac.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి