పరీక్ష లేదు, 8వ తరగతి అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ANGRAU Recruitment
అతి తక్కువ విద్యా అర్హతలతో, ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే బయో ఫర్టిలైజర్ యూనిట్స్ లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు | మార్చి 20, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 10:30 AM |
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, అమరావతి – 522020, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
సెమీ స్కిల్డ్ వర్కర్స్ | 6 |
ల్యాబ్ టెక్నీషియన్స్ | 1 |
అర్హతలు :
8వ తరగతి విద్యా అర్హతగా కలిగి బయో ఫర్టిలైజర్ కు సంబంధించిన అంశాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రిక్స్ / ఎలక్ట్రానిక్స్ /మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలలో బీ. టెక్ / డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితిని ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
సెమీ స్కిల్డ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 9,000 రూపాయలు మరియు ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులకు ఎంపికైన వారికీ 11,000 రూపాయలు జీతంగా లభించనున్నాయి.
NOTE :
ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ, తమ బయో డేటా, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు , ఒరిజినల్ సర్టిఫికెట్స్, అటెస్ట్డ్ సర్టిఫికెట్ లను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
ఈమెయిల్ అడ్రస్ :
arsamaravathi@yahoo.com
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :
98490 36714
కామెంట్‌లు