హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్స్ (HAL) లో ప్రభుత్వ ఉద్యోగాలు | HAL 100 Jobs Recruitment 2021
ఎక్కువ సంఖ్యలో భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు ప్రారంభం తేది | మార్చి 17, 2021 |
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది | ఏప్రిల్ 15, 2021 |
అడ్మిట్ కార్డ్స్ విడుదల తేది | ఏప్రిల్ 15, 2021 |
ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ నిర్వహణ తేది | ఏప్రిల్ 24,25, 2021 |
పరీక్ష ఫలితాల విడుదల తేది | ఏప్రిల్ 27, 2021 |
ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ విడుదల తేది | మే 4, 2021 |
ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ ప్రకటన తేది | మే 17 – 19, 2021 |
అపాయింట్ మెంట్స్ తేది | మే 22, 2021 |
మెడికల్ టెస్ట్స్ నిర్వహణ తేది | మే 25 – జూన్ 1, 2021 |
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభం తేది | జూన్ 21, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
డిజైన్ ట్రైనీస్ | 60 |
మేనేజ్ మెంట్ ట్రైనీ ( టెక్నికల్ ) | 40 |
మొత్తం ఖాళీలు :
మొత్తం 100 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఈ నోటిఫికెషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీల నుండి విభాగాల ఉద్యోగాలను అనుసరించి సంబంధిత విభాగాల ఇంజనీరింగ్ /టెక్నాలజీ లలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
విద్యా అర్హతలు గురించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికెషన్ ను చూడవచ్చును.
వయసు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించరాదు.
ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ/ PWD కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ / ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000 రూపాయలు నుండి 1,40,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.
కామెంట్‌లు