19, మార్చి 2021, శుక్రవారం

భారీ స్థాయిలో కేంద్ర పోలీస్ కొలువులు, 93,833 పోలీస్ ఉద్యోగాల భర్తీ | 93,833 Police Jobs Recruitment 2021 Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీస్ శాఖలలో మొత్తం 43,833 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు ఇటీవల లోక్ సభ వేదికగా లిఖిత పూర్వకంగా తెలియచేసారు.

ఈ ప్రకటన ద్వారా అతి త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ సంఖ్యలో  పోలీస్ శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికెషన్స్ విడుదల కానున్నాయి.

రాష్ట్రాల వారీగా పోలీస్ శాఖ – ఖాళీల వివరాలు :

ఆంధ్రప్రదేశ్14, 341
తెలంగాణ29,492

ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పోలీస్ శాఖల్లో సుమారుగా 50,000 ఖాళీల భర్తీకి ఈ నెల 25వ తేదీన నోటిఫికెషన్స్ విడుదల చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) ఒక ప్రకటన ద్వారా తెలిపినది.

త్వరలో విడుదల కాబోయే ఈ SSC GD – 2021 నోటిఫికెషన్  ద్వారా సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్, NIA, సెక్రటరియేట్ సెక్యూరిటీ ఫోర్స్, రిఫిల్ మెన్ ఇన్ అసోమ్ రిఫిల్స్ మొదలైన  కేంద్ర ప్రభుత్వ పోలీస్ శాఖ  విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 50,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను అప్లై చేయడానికి సందర్శించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

SSC GD – 2021 నోటిఫికెషన్ వివరాలు :

నోటిఫికెషన్ విడుదల తేదిమార్చి 25, 2021
రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిమే  10, 2021
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహణ తేదిఆగష్టు, 2021 

కామెంట్‌లు లేవు: