19, మార్చి 2021, శుక్రవారం

తిరుపతి బ్యాంకు ఆఫ్ బరోడా తదితరలో ఖాళీలు Tirupati 350 Jobs Bank of Baroda Jobs

 

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

రెగ్యులర్ పద్దతిలో భర్తీ కాబోయే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి మరియు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమార్చి 22, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :

శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజీ, కందుకూరు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

సంస్థల వారీగా ఉద్యోగాల ఖాళీలు :

హేటెరో డ్రగ్స్200
ఇన్నోవ్ సోర్స్ (బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ ) 50
అమర్ రాజా బ్యాటరీస్100

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 350 పోస్టులను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.

జాబ్ రోల్స్ మరియు అర్హతలు :

హేటెరో డ్రగ్స్ :

ఈ సంస్థలో ప్రొడక్షన్ కెమిస్ట్ /QA/QC/R&D ట్రైనీ /ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఐటీఐ / ఎనీ డిగ్రీ / ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ ) కోర్సులను 2016,17,18,19,2020 సంవత్సరాలలో పూర్తి చేసిన పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఇన్నోవ్ సోర్స్ ( బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ ) :

ఈ సంస్థలో ఖాళీగా ఉన్న సేల్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఇంటర్మీడియట్ మరియు ఆపై విద్యా అర్హతలు గల స్త్రీ / పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

అమర్ రాజా బ్యాటరీస్ :

ఈ సంస్థల్లో ఖాళీగా ఉన్న మెషిన్ ఆపరేటర్ పోస్టుల భర్తీని చేయనున్నారు.

10వ తరగతి మరియు ఆపై విద్యా అర్హతలు గల పురుష అభ్యర్థులు అందరూ ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

18  నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

హేటెరో డ్రగ్స్ లో ఉద్యోగాలకు ఎంపికైన వారికీ నెలకు 15,000 రూపాయలు వరకూ జీతం + ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

ఇన్నోవ్ సోర్స్ లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 15,000 రూపాయలు జీతం ఇవ్వనున్నారు.

అమర్ రాజా బ్యాటరీస్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు 10,500 రూపాయలు జీతం + ఉచిత భోజన, వసతి సౌకర్యాలు లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

8008986256

1800-425-2422

తిరుపతి లో మరిన్ని ఉద్యోగాలు Clik Here

Registration Link 

Website 

కామెంట్‌లు లేవు: