AP University Jobs: ఏపీ వర్సిటీల్లో 3,220 ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్
విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల
పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర
వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్‌లాగ్, 2,942 రెగ్యులర్
పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు వేటికవే ప్రకటనలు విడుదల చేశాయి. వీటిలో
ప్రొఫెసర్ పోస్టులు 418, అసోసియేట్ ప్రొఫెసర్లు 801, ట్రిపుల్‌ఐటీల
లెక్చరర్ పోస్టులతో కలిపి సహాయ ఆచార్యుల పోస్టులు 2,001 ఉన్నాయి.
దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువిచ్చారు.
దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్షకు అర్హత
సాధించిన వారి జాబితాను 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7
వరకు అభ్యంతరాలను స్వీకరించి, 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. స్క్రీనింగ్
పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. వర్సిటీ యూనిట్‌గా కొత్తగా
రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లతో పోస్టులను ప్రకటించాయి. అసోసియేట్
ఆచార్యులు, ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉండదు. విశ్వవిద్యాలయాల
స్థాయిలోనే నియామకాలు చేపడతారు.
ఖాళీల వివరాలు...
1. ప్రొఫెసర్ పోస్టులు- 418
2. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు- 801
3. ట్రిపుల్‌ఐటీ లెక్చరర్, సహాయ ఆచార్యుల పోస్టులు- 2,001
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఎంఫిల్/ పీహెచ్‌డీ, యూజీసీ/ సీఎస్‌ఐఆర్ నెట్/ ఏపీ స్లెట్/ సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్టు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా.
స్క్రీనింగ్ పరీక్ష: స్క్రీనింగ్ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, ఒక తప్పునకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వర్సిటీల్లో ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తు రుసుము: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో పరీక్షలు రాయాలనుకుంటే మాత్రం విడివిడిగా రుసుము చెల్లించాలి. ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు,ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్ పోస్టుకు రూ.150 డాలర్లు/ రూ.12,600, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు 100 డాలర్లు/ రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్‌లో దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు తుది గడువు: 20.11.2023.
పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర ధ్రువపత్రాల సమర్పణ గడువు: 27.11.2023
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్‌కు అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితా ప్రదర్శన: 30.11.2023.
అభ్యంతరాల స్వీకరణ: 07.12.2023.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ స్క్రీనింగ్ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 08.12.2023.
![]() |
Important Links
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి