గ్రూప్-1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ | Free Coaching for Group-1, 2 Exams

గ్రూప్-1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ
అనంతపురం ప్రెస్ క్లబ్, డిసెంబరు 16: ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-1, 2 రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొతారీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గ్రూప్-2కు ఈ నెల 22లోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని, 100 మంది అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తామని పేర్కొన్నారు. గ్రూప్-1 శిక్షణకు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. 60 మంది అభ్యర్థులకు జనవరి 5వ తేదీ నుంచి 60 రోజుల పాటు శిక్షణ, స్టైఫండ్, స్టడీ మెటీరియల్స్ ఇస్తామని తెలిపారు. డిగ్రీ మార్కుల ఆధారంగా, మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు 10, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (రూ.లక్ష లోపు), ఆధార్, బ్యాంక్ పాస్బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జతపరిచి.. గ్రూప్-2 అభ్యర్థులు ఈ నెల 22లోపు, గ్రూప్-1 అభ్యర్థులు ఈ నెల 31లోపు అనంతపురంలోని బీసీ స్టడీసర్కిల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Free Coaching for Group-1, 2 Exams
Anantapur Press Club, December 16: BC Study Circle Director, BC Welfare Department DD Kushbukothari said in a statement on Saturday that free training classes are being conducted for Group-1 and 2 recruitment preliminary exams conducted by APPSC. Eligible BC, SC and ST candidates belonging to the combined district can apply, he said. He said that applications for Group-2 should be made by 22nd of this month and 100 candidates will be trained for 45 days from 27th of this month. It is mentioned that stipend and study material will be provided. It is suggested to apply for Group-1 training by 31st of this month. He said that 60 candidates will be given training, stipend and study materials for 60 days from January 5. On the basis of degree marks, candidates will be selected on merit basis. Eligible candidates should attach their biodata along with 10th, inter, degree marks list, caste, income proof (less than Rs. lakh), Aadhaar, bank passbook, 2 passport size photographs. Group-2 candidates by 22nd of this month, Group-1 candidates by It is suggested to submit it at the office of BC Study Circle in Anantapur before 31st of the month
Broth.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.