3, డిసెంబర్ 2023, ఆదివారం

మిచాంగ్ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు....గుంతకల్లు, ధర్మవరం, తిరుపతి, విశాఖపట్నం ఇంకా మరెన్నో | మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి

మిచాంగ్ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు....గుంతకల్లు, ధర్మవరం, తిరుపతి, విశాఖపట్నం ఇంకా మరెన్నో | మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి



గుంతకల్లు: మైచాంగ్ తుపాను కారణంగా గుంతకల్లు డివిజన్ మీదుగా నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. రద్దయిన ఎక్స్ ప్రెస్ రైళ్ల వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు.
తిరుపతి-లింగంపల్లి (12733) 3, 4, 5 తేదీల్లో.
లింగంపల్లి - తిరుపతి (12734) 4, 5 మరియు 6 తేదీలలో.
తిరుపతి-సికింద్రాబాద్ (12763) 3, 4 తేదీల్లో.
సికింద్రాబాద్-తిరుపతి (12764) 5, 6 తేదీల్లో.
నర్సాపూర్-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ (17247) 3, 4 మరియు 5 తేదీల్లో .
ధర్మవరం-నర్సాపూర్ (17248) 4, 5, 6 తేదీల్లో ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. 
తిరుపతి-ఆదిలాబాద్-తిరుపతి (17405/06) ఎక్స్‌ప్రెస్ రైళ్లను 5వ తేదీన రద్దు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం-కడప (17488) 3, 4 మరియు 5 తేదీల్లో రైళ్లు.
కడప - విశాఖపట్నం (17487) రైలు 4, 5, 6 తేదీల్లో.
సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (20701/02) ఎక్స్ ప్రెస్ రైళ్లను 3, 4 తేదీల్లో రద్దు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.


8 నుంచి పలు రైళ్ల దారి మళ్లింపు మరియు రద్దు, సొరంగ మార్గం మరమ్మతుల కోసం ఈ నిర్ణయం 
పుట్టపర్తి టౌన్: ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ - కొత్తచెరువు మార్గంలోని నల్లకొండ వద్ద 234 మీటర్ల పొడవైన రైల్వే సొరంగంలో పగుళ్ళను అలాగే ప్రమాదాలకు గురి చేసే రాళ్లను తొలగించి మరమ్మతులను చేయడానికి నిర్ణయించడం వలన ఈ నెల 8 నుంచి ఫిబ్రవరి 8 వరకూ పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు ఇంకొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్ మేనేజర్ సతీష్ రెడ్డి చెప్పారు. ఈ సందర్బంగా ఒక ప్రకటనలో తెలియజేశారు. 
రద్దయినవి:- చెన్నై-షిరిడీ, బెంగుళూరు - పుట్టపర్తి, బెంగుళూరు- ధర్మవరం, కొండవీడు, గరీబ్ రథ్, కర్ణాటక, రాజధాని, ఉద్యాన్, ప్రశాంతి, బసవ మొదలైన ప్రధాన సర్వీసులు రద్దు పరిధులు తగ్గించినవి:- హౌర, కాచిగూడ ఎక్స్ప్రెస్లు ధర్మవరం రైల్వేస్టేషన్ వరకే నడుస్తాయి. చెన్నై ఎక్స్ ప్రెస్ (ప్రతి శనివారం) వరకు ప్రయాణిస్తాయి. 
బెంగళూరు ఫిబ్రవరి 9 నుంచి సర్వీసులు పునఃప్రారం భమవుతాయి. 
కనుక ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ధర్మవరం రైల్వేస్టేషన్- పుట్టపర్తి బస్సు సర్వీసులు పెంచుతున్నట్లు డిపో మేనేజర్ ఇనయతుల్లా అన్నారు. 

కామెంట్‌లు లేవు: