3, డిసెంబర్ 2023, ఆదివారం

Short News in telugu



✅ ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో 'మిచౌంగ్‌' తుపాను నేపథ్యంలో భారీ సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.. నేటి నుంచి 7వ తేదీ వరకు భారీ సంఖ్యలో రైళ్ల రద్దు. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక
రేపు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం

✅ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సెలవు రోజుల్లోకూడా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 2,3 తేదిల్లో శని, ఆదివారాల్లో కూడా ఓటరు నమోదు క్యాంపును ప్రతి సచివాలయంలో నిర్వ హించాలని స్పష్టం చేసింది. 2024 జనవరి 1వ తేది నాటికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 

✅ భారత్‌ తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే గనన్‌యాన్‌ యాత్రకు వ్యోమగాముల ఎంపిక పూర్తయ్యిందని, 2025లో చేపట్టే అంతరిక్ష యాత్ర కోసం తామంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ శనివారం ప్రకటించారు

 ప్రపంచంలో తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీయగల పెద్ద నగరాల్లో మన దేశానికి చెందిన రెండు సిటీలు అహ్మదాబాద్, చెన్నైలకు చోటు దక్కింది

✅ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)-గువాహటిలో 2023-24 సంవత్సరానికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులు తొలి రోజు 164 ఉద్యోగాలు పొందారు. 11 మందికి రూ.కోటికి పైగా వార్షిక వేతనం

✅ అమెరికాలోని ఓహియోలో చిన్నారులు న్యుమోనియా వ్యాధి బారిన పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. బ్యాక్టీరియల్‌ న్యుమోనియాకు సంబంధించిన ఈ కొత్త రకం ఇన్‌ఫెక్షన్‌ చైనా, డెన్మార్క్‌, అమెరికా, నెదర్లాండ్స్‌ను వణికిస్తున్నది

✅ సూర్యుడిపై పరిశోధనలకు భారత్‌ ప్రయోగించిన 'ఆదిత్య-ఎల్‌1' తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఉపగ్రహంలోని 'ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌' (ఏఎస్‌పీఈఎక్స్‌) అనే పేలోడ్‌.
సౌర గాలుల్లోని అయాన్లకు సంబంధించిన కొలతలను విజయవంతంగా సేకరించింది 

✅ ఇంజినీరింగ్‌లో 6జీ పాఠాలు
బీటెక్‌ ఈసీఈలో సిలబస్‌ మార్చాలి
ఎంటెక్‌లో కోర్సులు... పీహెచ్‌డీలో పరిశోధన
నిపుణుల కమిటీ నివేదికతో యూజీసీ ఆదేశాలు

✅ చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది
రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్దే -వెల్లడించిన ఆర్‌బీఐ

✅ ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో శనివారం ఉదయం జరిగిన నక్సలైట్ల దాడిలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు, ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. గత ఏడాది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయిన 54 మంది నక్సలైట్ల జ్ఞాపకార్థం నేటి నుంచి డిసెంబర్‌ 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుపుకోనున్నట్లు నక్సలైట్లు కరపత్రాలను విడుదల చేశారు

✅ ప్రభుత్వ బడులకు  అంతర్జాతీయ నైపుణ్యాలు
భవిష్యత్లో విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకునేలా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం
పాఠశాలల్లో రూ.2,400 కోట్లతో డిజిటల్ వసతులు
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: