ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన జాంబియా బృందం |పరిగిలో రైతులతో సమావేశం | Natural farming Observed Zambian team | Meeting with farmers in Parigi
ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన జాంబియా బృందం | పరిగిలో రైతులతో సమావేశం
హిందూపురం, జూన్ 10 పరిగి మండలంలోని గొరవనహళ్లిలో స్థానిక రైతులు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని జాంబియా బృందం సభ్యులు సోమవారం పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసా యంపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్, రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నాలజీ ఇన్నోవేటివ్ అధికారి లక్ష్మానా యక్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.35 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని సాగుచేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4120గ్రామాల్లో ఈ కార్యక్రమం అమలు అవుతోందన్నారు. రైతు సాధికార సంస్థ ప్ర పంచ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, దాతృత్వ సంస్థల భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తోందన్నారు. ప్రపంచంలో విస్తృత స్థాయిలో ఆగ్రో ఎకాలజీ కార్యక్రమం నడుపుతున్న సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిం చేందుకు జాంబి యా దేశ ప్రతినిధి బృందం ఈ నెల 7నుంచి 21వరకు పర్యటిస్తోందని, ఇందులో ఉమ్మడి అనంత పురం జిల్లాలో ఈ బృందం పర్య టించిందన్నారు. ఇక్కడ సాగుచేస్తున్న ప్రకృతి వ్యవసాయంపై సంతృప్తి చెందారని, తమ దేశంలోనూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కృషిచేస్తామని వారు చెప్పారని లక్ష్మానాయక్ తెలిపారు.
ఆహార దినుసులను పరిశీలిస్తున్న జాంబియా దేశ బృందం
Natural farming Observed Zambian team
Meeting with farmers in Parigi
Hindupuram, June 10 The members of the Zambian team on Monday inspected the organic farming being practiced by the local farmers at Goravanahalli in Parigi mandal. Andhra Pradesh called for Public Participatory Natural Farming. On this occasion, Lakshmana Yak, District Manager of Nature Agriculture Project, Chief Technology Innovative Officer of Rythu Sadhikar Sanstha, said... 1.35 lakh farmers are cultivating nature agriculture in the state so far. He said that this program is being implemented in 4120 villages across the state. He said that Rythu Sadhikar Sanstha is working in partnership with various governments, social organizations and charitable organizations all over the world. He said that it has been recognized as an organization running agro-ecology program on a wide scale in the world. He said that the delegation of Zambia is touring from 7th to 21st of this month to examine the natural agriculture in the state, in which the team visited the joint Anantapuram district. Lakshmanayak said that they are satisfied with the nature agriculture being cultivated here and that they will work hard to promote nature agriculture in their country as well.
A Zambian country team examining food items
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు