Alerts

--------

9, డిసెంబర్ 2020, బుధవారం

రెండేళ్లలో 10,000 మంది నర్సుల నియామకాలకు ఏపీ సర్కార్ కసరత్తు ..!



సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో 10 వేల మంది నర్సులను నియమించేందుకు కసరత్తు మొదలైంది.
Education News

ప్రాథమిక ఆరోగ్యం పరిపుష్టం చేయడంలో భాగంగా సర్కారు ఈ ప్రక్రియను చేపట్టింది. కుగ్రామంలోని ప్రజలకు కూడా ప్రాథమిక వైద్యం అందించాలని, దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆరోగ్య సిబ్బందిని నియమించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవస్థను రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ (హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలన్నింటినీ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌గా ఉన్నతీకరిస్తున్నారు. మొత్తం 10,030 హెల్త్ కినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 8,615 క్లినిక్స్‌కు కొత్తగా భవన నిర్మాణాలు చేపడుతుండగా, మిగతా వాటికి బిల్డింగ్‌లు ఉన్నాయి.

  • మొత్తం 10,030 హెల్త్ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులను నియమిస్తున్నారు.
  • ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కొత్తగా చేపడుతున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌కు జాతీయ హెల్త్ మిషన్ నిధులిస్తోంది.
  • పతి కేంద్రంలోనూ ఒక బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థి ఉండాలి. ఇప్పటికే 4,060 మంది నర్సుల నియామకానికి కేంద్రం అనుమతించింది. మిగతా 6 వేల నియామకాలకు త్వరలోనే అనుమతివ్వనుంది.
  • ఎంపికై న నర్సులకు ఆరు మాసాలు ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ) నిపుణులు శిక్షణ ఇస్తారు.
  • శిక్షణ సమయంలో నర్సులకు స్టైఫండ్‌తో పాటు అకామిడేషన్, భోజన వసతి కల్పిస్తారు.
  • కొత్త నిర్మాణాల కోసం రూ.1,745 కోట్లు వ్యయం చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కువ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. ప్రతి హెల్త్‌కినిక్‌కూ పీహెచ్‌సీతో అనుసంధానం చేస్తారు.


హెల్త్ క్లినిక్‌లలో 12 రకాల సేవలు

  • గర్భిణులకు, చిన్నారులకు ప్రత్యేక సేవలు
  • నవజాత శిశువులు టీకాలు
  • చిన్నారులు, యుక్త వయసు వారికి వైద్య సేవలు
  • కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రత్యేక సేవలు
  • సాంక్రమిక వ్యాధులకు గురికాకుండా పటిష్ట చర్యలు
  • సాంక్రమిక వ్యాధుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం
  • మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా చర్యలు తీసుకోవడం
  • కన్ను, చెవి సమస్యలను ముందే పరిష్కరించేలా చర్యలు
  • సాధారణ ఆరోగ్య సంబంధిత సేవలు
  • వృద్ధుల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు
  • అత్యవసర సేవల్లో భాగంగా వైద్యం
  • చిన్న చిన్న మానసిక సమస్యలకు ప్రాథమిక దశలోనే స్క్రీనింగ్


కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న క్లినిక్‌లు

జిల్లా

హెల్త్ క్లినిక్స్ సంఖ్య

తూర్పుగోదావరి

1,084

అనంతపురం

632

కృష్ణా

666

శ్రీకాకుళం

653

గుంటూరు

638

పశ్చిమ గోదావరి

739

విజయనగరం

492

ప్రకాశం

744

నెల్లూరు

546

కర్నూలు

643

చిత్తూరు

728

వైఎస్సార్

500

విశాఖపట్నం

550

మొత్తం

8,615


ముమ్మరంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం
ప్రస్తుతం 8,604 భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ విభాగం ఈ పనులను చేపట్టింది. 5,010 భవనాలు ఎర్త్ వర్క్ దశలో ఉన్నాయి. మరో 1,519 బేస్‌మెంట్ లెవెల్‌కు వచ్చాయి. వీలైనంత త్వరలో అన్నింటినీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. యథావిధిగా నర్సుల నియామకం చేపడతాం.
- అనిల్ కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ

అగ్రి, హార్టికల్చర్ బీఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

 

గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోందని రిజిస్ట్రార్ డాక్టర్ త్రిమూర్తులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Education Newsఏపీ ఎంసెట్-2020లో ర్యాంకు సాధించిన బైపీసీ అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, అనుబంధ ప్రైవేట్ కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-అనిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ-ఏహెచ్), బీఎస్సీ (ఫిషరీస్), బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్, బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ) కోర్సులకు రైతుల కోటా కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. www.angrau.ac.in లో ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాలన్నారు. నవంబరు నెల 23 నుంచి డిసెంబర్ 13 వరకు దరఖాస్తు గడువు పెంచామని చెప్పారు. అన్ని వర్సిటీలకు ఒకే దరఖాస్తు సరిపోతుందన్నారు.
 

జేఈఈ మెయిన్ 2021: జనవరిలో కాదు ఫిబ్రవరిలో..


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించే జేఈఈ-మెయిన్ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
  ఈ పరీక్ష జనవరిలో జరగాల్సి ఉంది. ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇంకా జరుగుతూనే ఉన్నందున జేఈఈ మెయిన్‌ను వాయిదా వేసినట్లు తెలిపారు. సరైన బ్రాంచ్‌గానీ, స్కోర్‌గానీ రాలేదనుకునే విద్యార్థులకు ఇది మరో అవకాశాన్ని ఇస్తుందని అన్నారు. పెరుగుతున్న కరోనా కేసులు కూడా వాయిదాకు మరో కారణమని చెప్పారు. పరీక్ష తేదీ వివరాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పారు. వచ్చే నెలలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.

శుభవార్త... త్వరలో 499 మంది వైద్యుల నియామకానికి నోటిఫికేషన్!

 

సాక్షి, అమరావతి: వైద్యారోగ్యశాఖలో నియామకాల పరంపర కొనసాగుతోంది. తాజాగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికోసం సోమవారం వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులిచ్చారు. మొత్తం 560 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, ఇప్పటికే 61 మంది వైద్యులున్నారు. మరో 499 మందిని కొత్తగా నియమించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా వీరిని నియమించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, డీఎంహెచ్‌వో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సబ్జెక్టు మార్కులు 75గా నిర్ధారించగా, మిగతా 15 మార్కులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సర్వీస్ వెయిటేజీకి ఇస్తారు. ఏజెన్సీల్లో పనిచేసిన వారికి ఆరు నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో చేసిన వారికి 2 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఒక్క మార్కు ఉంటుంది. ఎంబీబీఎస్ పాసైన సంవత్సరం నుంచి ఏడాదికొకటి చొప్పున 10 మార్కులుంటాయి.

APPSC Latest update in Telugu 2020 || బిగ్ బ్రేకింగ్ న్యూస్, గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ముఖ్యమైన అప్డేట్

 

గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ పై ముఖ్యమైన అప్డేట్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో జరగనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ఒక అతి ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సి) నిర్వహిస్తున్న ఈ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ఏపీ హైకోర్టు నేడు తమ కీలక నిర్ణయాన్ని ప్రకటించినది.

హైకోర్టు ప్రకటించిన ఈ కీలక నిర్ణయం ద్వారా ఏపీ లో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ఈనెల డిసెంబర్ -14 వ తేదీ నుండి జరగనున్నాయి.

ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష కు కొత్తగా ఎంపికైన అభ్యర్థులు తమకు పరీక్ష ప్రిపరేషన్ కు సమయం సరిపోదంటూ, పరీక్షలను వాయిదా వేయాలంటూ  హైకోర్టు లో రిట్ వేయగా,

నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభ్యర్థుల రిట్ పిటిషన్ ను తిరస్కరించినది. దీనితో ఏపీ గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై నెలకొని ఉన్న సంధిగ్దత కు తెరపడినది.

ఏపీ  లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్స్ పై నేడో, రేపో అధికారిక సమాచారం రానుంది.

ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ హాల్ టికెట్స్ ను అభ్యర్థులు ఈ  క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

website

NMMS Exam 2020 Update || NMMS 2020 పరీక్ష వాయిదా పై తాజా అప్డేట్

 

ఇరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు NMMS స్కాలర్ షిప్ పరీక్ష  2020 గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.


ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వారి చదువులకు కావాల్సిన ఆర్థిక భరోసాను కల్పించడానికి భారతీయ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ (NMMS) స్కాలర్ షిప్ పరీక్ష  ఫిబ్రవరి 14, 2021 న నిర్వహించనున్నారు.

ఈ  NMMS 2020 పరీక్షలకు దరఖాస్తుల గడువును మరోసారి పెంచారు. జనవరి 9,2021 వరకూ ఈ స్కాలర్ షిప్ పరీక్షల గడువును పెంచారు.

విద్యార్థులు ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ లను తెలుసుకోవడానికి ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చు.

Website

APSET Exam 2020 Update Telugu || ఏపీ సెట్ 2020 పరీక్ష హాల్ టికెట్స్ విడుదలపై ముఖ్యమైన ప్రకటన

 

ఏపీ సెట్  2020 హాల్ టికెట్స్ విడుదలపై ముఖ్య ప్రకటన :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కళాశాల లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ల ప్రమోషన్స్ కొరకు నిర్వహించబోయే  ముఖ్యమైన పరీక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2020 గురించి ఒక ముఖ్యమైన వార్త వచ్చినది.


ఆంధ్రప్రదేశ్  స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్ ) 2020 పరీక్షను డిసెంబర్ 20వ తారీఖున నిర్వహించనున్నారు. ఈ ఏపీ సెట్ 2020 పరీక్ష కు సంబంధించిన హాల్ టికెట్స్ ను డిసెంబర్ 12వ తేదీన విడుదల కానున్నాయి.

ఏపీ సెట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ద్వారా హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Website

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...