సాక్షి,
అమరావతి: వైద్యారోగ్యశాఖలో నియామకాల పరంపర కొనసాగుతోంది. తాజాగా పట్టణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం
నిర్ణయించింది.
దీనికోసం
సోమవారం వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్
ఉత్తర్వులిచ్చారు. మొత్తం 560 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు
చేస్తుండగా, ఇప్పటికే 61 మంది వైద్యులున్నారు. మరో 499 మందిని కొత్తగా
నియమించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా
వీరిని నియమించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్
చైర్‌పర్సన్‌గా, డీఎంహెచ్‌వో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సబ్జెక్టు
మార్కులు 75గా నిర్ధారించగా, మిగతా 15 మార్కులను కాంట్రాక్ట్,
ఔట్‌సోర్సింగ్ సర్వీస్ వెయిటేజీకి ఇస్తారు. ఏజెన్సీల్లో పనిచేసిన వారికి
ఆరు నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో చేసిన వారికి 2 మార్కులు,
పట్టణ ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఒక్క మార్కు ఉంటుంది. ఎంబీబీఎస్ పాసైన
సంవత్సరం నుంచి ఏడాదికొకటి చొప్పున 10 మార్కులుంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి