1, జులై 2021, గురువారం

ఇగ్నోలో జులై సెషన్‌–2021 దూరవిద్య ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021


న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(ఇగ్నో).. జులైæ 2021 సెషన్‌కు సంబంధించి వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Adminissions  
మాస్టర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు..
మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్, ఎంసీఏ, మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్‌ డిగ్రీ/హయ్యర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: కనీసం రెండేళ్ల నుంచి గరిష్టంగా నాలుగేళ్ల వరకు ఉంటుంది.

బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్, బీసీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌వర్క్, బీఎస్సీ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఆరేళ్ల వరకు ఉంటుంది.

డిప్లొమా ప్రోగ్రామ్‌లు..
న్యూట్రిషన్‌–హెల్త్‌ ఎడ్యుకేషన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, డెయిరీ టెక్నాలజీ, మీట్‌ టెక్నాలజీ, హార్టికల్చర్, ఆక్వాకల్చర్‌ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: కనీసం ఒక ఏడాది నుంచి గరిష్టంగా మూడేళ్ల వరకు ఉంటుంది.

పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లు
పీజీ డిప్లొమా ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌లేషన్, అప్లైడ్‌ స్టాటిస్టిక్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
కోర్సు వ్యవధి: కనీసం ఒక ఏడాది నుంచి గరిష్టంగా మూడేళ్ల వరకు ఉంటుంది.

సర్టిఫికేట్‌ కోర్సులు..
కోర్సులు: లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఇన్విరాన్‌మెంట్‌ స్టడీస్, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: కనీసం 6 నెలలు నుంచి గరిష్టంగా 2 ఏళ్ల వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.ignou.ac.in

ఏపీ బీజీ ఇంటర్‌ సెట్‌–2021.. దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2021 పరీక్షా తేదీ: త్వరలో వెల్లడిస్తారు


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌).. 2021–2022 విద్యాసంవత్సరానికి 164 సాంఘిక సంక్షేమ జూనియర్‌ కాలేజీలు, మూడు ఐఐటీ మెడికల్‌ అకాడెమీస్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Adminissions 
బాలయోగి గురుకులం ఇంటర్మీడియెట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(బీజీ ఇంటర్‌ సెట్‌–2021) ద్వారా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలు 2021–22.
అర్హతలు: 2021 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బీజీ ఇంటర్‌ సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
వయసు: 31.08.2021 నాటికి 17 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఒక ఏడాది సడలింపు లభిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: 2021–22 బీజీ ఇంటర్‌ సెట్‌లో సాధించిన మెరిట్‌ ఆ«ధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ 25 ప్రశ్నలు, ఫిజికల్‌ సైన్స్‌ 15 ప్రశ్నలు, బయోసైన్స్‌ 15 ప్రశ్నలు, సోషల్‌ సైన్స్‌ 15 ప్రశ్నలు, ఇంగ్లిష్‌(కాంప్రెహెన్షన్‌ అండ్‌ గ్రామర్‌) 15 ప్రశ్నలు, లాజికల్‌ రీజనింగ్‌ 15 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు.

పతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. అలాగే ఇందులో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఐఐటీ–మెడికల్‌ అకాడెమీస్‌ పరీక్ష..
ఐఐటీ–మెడికల్‌ అకాడెమీస్‌ను ఎంచుకొని.. బీజీ ఇంటర్‌ సెట్‌లో మెరిట్‌లో నిలిచిన విద్యార్థులకు డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజికల్‌ అండ్‌ బయోలాజికల్‌ సైన్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం..
దరఖాస్తు: ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2021
పరీక్షా తేదీ: త్వరలో వెల్లడిస్తారు

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apgpcet.apcfss.in/Inter

APEAMCET ఏపీ ఈఏపీసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌ సీహెచ్‌ఈ)..

Adminissions 
ఏపీ ఈఏపీసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, కాకినాడ నిర్వహిస్తోంది.

ప్రవేశ పరీక్ష: ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈఏపీసెట్‌–2021)

ప్రవేశం కల్పించే కోర్సులు..
  • ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌(డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), బీటెక్‌(ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ).
  • బీఎస్సీ అగ్రికల్చర్‌/బీఎస్సీ హార్టికల్చర్‌/ బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/బీఎఫ్‌ఎస్సీ.
  • బీ ఫార్మసీ, ఫార్మా డి.
అర్హతలు: ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ/బైపీసీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.06.2021

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021

హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌: 12.08.2021

పరీక్ష తేది: 19.08.2021 నుంచి 25.08.2021 వరకు

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/APSCHEHome.aspx

అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సులు.. దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021

హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2021–22 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Adminissions  
అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు: బీఏ/బీకామ్‌/బీఎస్సీ
అర్హత: 10+2/ ఇంటర్మీడియెట్‌/ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
పీజీ కోర్సులు: ఎంఏ/ఎంకామ్‌/ఎంఎస్సీ; అర్హత: సంబంధిత కోర్సులను అనుసరించి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.braou.ac.in/UGPGAdmissions.aspx 

ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో ఐదో తరగతి, బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది: 10.07.2021

 



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)..
Adminissions 
 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి, ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

ఐదో తరగతి ప్రవేశాలు: మొత్తం సీట్ల సంఖ్య: అన్ని జిల్లాల్లో కలిపి 2480.

ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు: మొత్తం సీట్లు తరగతుల వారీగా: ఆరో తరగతి–582, ఏడో తరగతి–135, ఎనిమిదో తరగతి–121, తొమ్మిదో తరగతి–145.

మీడియం: ఇంగ్లిష్‌
అర్హత: ఆయా తరగతిలో ప్రవేశాలను అనుసరించి ప్రభుత్వ/గుర్తింపు పొంది పాఠశాలల్లో వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దర ఖాస్తు ప్రారంభ తేది: 25.06.2021

దరఖాస్తులకు చివరి తేది: 10.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aptwgurukulam.ap.gov.in/

ఏపీఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌–2021 ప్రవేశాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

 



ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ.. ఏపీలోని 10 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ మొదటి ఏడాది, డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌–2021 ప్రకటన విడుదల చేసింది.
Adminissions  
ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ (ఏపీఆర్‌జేసీ) 2021–22:
అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థి ఆంధ్రప్రదేశ్‌లో చదివి ఉండాలి.

ఎంపిక విధానం: లాటరీ పద్థతి ద్వారా ఎంపిక చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌ (ఏపీఆర్‌డీసీ) 2021–22:
అర్హత:
2021లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. వివిధ కోర్సులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్‌ మెరిట్‌/లక్కీ డ్రా ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, విశాఖపట్నం.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 3.08.2021


విశాఖపట్నం ఆర్మీరిక్రూట్‌మెంట్‌ కార్యాలయం ఆరు జిల్లాల(తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణా, శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరం, యానాం(పుదుచ్చేరి)కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు ఇండియన్‌ ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహిస్తోంది.
Jobs  
పోస్టులు: సోల్జర్‌–జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌–
టెక్నికల్, సోల్జర్‌–టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్, సోల్జర్‌–క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌.

అర్హత: ఎనిమిది, పదో తరగతి, 10+2/ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: సోల్జర్‌ జనరల్‌ డ్యూటీకి 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు, మిగతా పోస్టులకు 17ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌(పీఎఫ్‌టీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ), ఉమ్మడి ప్రవేశ పరీక్ష మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ర్యాలీ నిర్వహణ తేది: 2021 ఆగస్ట్‌ 16 నుంచి 31 వరకు
ర్యాలీ ప్రదేశం: ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం, ఏపీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 3.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in