17, ఆగస్టు 2021, మంగళవారం

కోల్‌ ఇండియాలో 588 ఉద్యోగాలు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021



భారత ప్రభుత్వ మహారత్న కంపెనీ.. కోల్‌ ఇండియా లిమిటెడ్‌.. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Edu news 
మొత్తం పోస్టుల సంఖ్య: 588
పోస్టుల వివరాలు: మైనింగ్‌–253. ఎలక్ట్రికల్‌–117, మెకానికల్‌–134, సివిల్‌–57, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌–15, జియాలజీ–12.
అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌), ఎమ్మెస్సీ/ఎంటెక్‌(జియాలజీ /జియోఫిజిక్స్‌/అప్లయిడ్‌ జియోఫిజిక్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 04.08.2021 నాట కి 30ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్‌–2021 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021
వెబ్‌సైట్‌: https://www.coalindia.in/

యూజీసీ నెట్‌– 2021(జూన్‌) నోటిఫికేషన్‌ | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021 | పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 06.09.2021 | పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్‌ 06 నుంచి 11 వరకు జరుగుతాయి;



దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోషల్‌ సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్‌ఎఫ్,లెక్చర్‌షిప్‌(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) అర్హత కోసం నిర్వహించే యూజీసీ–నేషనల్‌ ఎలిజి బిలిటీ టెస్ట్‌(నెట్‌)–జూన్‌ 2021 నోటిఫి కేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది.

Edu newsఅర్హత: హ్యూమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ (లాంగ్వేజెస్‌ని కలుపుకొని), కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్, ఎలక్ట్రానిక్‌ సైన్స్‌ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న వారు, మాస్టర్స్‌ డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: జేఆర్‌ఎఫ్‌నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహా మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో అడుగుతారు.పేపర్‌ 1– 50 ప్రశ్నలు–100 మార్కులకు, పేపర్‌ 2–100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. పరీక్షా సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది.

ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 06.09.2021
పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్‌ 06 నుంచి 11 వరకు జరుగుతాయి;
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in

యూబీఐలో 347 ఉద్యోగాలు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021


ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ).. 2021–22 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Edu news 
మొత్తం పోస్టుల సంఖ్య: 347
పోస్టుల వివరాలు: సీనియర్‌ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్‌ మేనేజర్లు–146.
విభాగాలు: రిస్క్, సివిల్‌ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్‌ ఇంజనీర్, ప్రింటింగ్‌ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్‌ అకౌంటెంట్, టెక్నికల్‌ ఆఫీసర్లు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబం«ధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
వయసు: సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 30 నుంచి 40ఏళ్లు, మిగతా పోస్టులకు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం 120 నిమిషాలు. –దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021
వెబ్‌సైట్‌: https://www.unionbankofindia.co.in

ఐఓసీఎల్, సదరన్‌ రీజియన్‌లో 480 ఖాళీలు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.08.2021


భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) మార్కెటింగ్‌ డివిజన్‌ సదరన్‌ రీజియన్‌ (తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)లో...2021–22 సంవత్సరానికి గాను ట్రేడ్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Edu news

మొత్తం ఖాళీల సంఖ్య: 480
విభాగాలు: ఐటీఐ/అకౌంటెంట్‌/డేటా ఎంట్రీ ఆపరేటర్‌–ఫ్రెషర్‌/స్కిల్‌ సర్టిఫికేట్‌ హోల్డర్స్‌/ రిటైల్‌ సేల్స్‌ అసోసియేట్‌–ఫ్రెషర్‌/స్కిల్‌ సర్టిఫికేట్‌ హోల్డర్స్, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 13.08.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.08.2021
వెబ్‌సైట్‌: www.iocl.com

ఐడీబీఐ 650 ఉద్యోగాలు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.08.2021 | పరీక్ష నిర్వహణ తేది: 04.09.2021


ముంబైలోని ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ).. మణిపాల్‌ (బెంగళూరు), నిట్టే(గ్రేటర్‌ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ విభాగంలో.. ఏడాది(9 నెలలు క్లాస్‌రూం+3 నెలలు ఇంటర్న్‌షిప్‌) పాటు పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లామా(పీజీడీబీఎఫ్‌)లో శిక్షణ ఇస్తోంది.

ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి ఐడీబీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌గా నియామకం ఖరారు చేస్తోంది.

పోస్టు: అసిస్టెంట్‌ మేనేజర్‌.

మొత్తం ఖాళీల సంఖ్య: 650
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి.
వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున తగ్గిస్తారు.

ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.08.2021
పరీక్ష నిర్వహణ తేది: 04.09.2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
వెబ్‌సైట్‌: www.idbibank.in

16, ఆగస్టు 2021, సోమవారం

అగ్రికల్చరల్‌ వర్సిటీల్లో డిప్లొమాలు | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18-08-2021.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చరల్‌, హార్టికల్చరల్‌, యానిమల్‌ హస్బెండరీ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలోని డా.వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలోని వివిధ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. మూడేళ్ల వ్యవధిగల అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా; రెండేళ్ల వ్యవధిగల వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయం, పశు పోషణ, మత్స్య శాస్త్రం, ఉద్యాన డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పశు పోషణ, మత్స్య శాస్త్రం కోర్సులను తెలుగు మాధ్యమంలో; మిగిలిన వాటిని ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు. పంచాయితీ, మునిసిపల్‌ పరిధి పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 75:25 నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 

సీట్లు: 4230

ఇందులో అగ్రికల్చరల్‌ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. విశ్వవిద్యాలయ అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌లలో వ్యవసాయం 550, విత్తన సాంకేతిక పరిజ్ఞానం 25, సేంద్రీయ వ్యవసాయం 25, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ 60 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌లలో వ్యవసాయం 2460, విత్తన సాంకేతిక పరిజ్ఞానం 480, సేంద్రీయ వ్యవసాయం 120, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ 510 సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పదోతరగతిని కంపార్ట్‌మెంటల్‌గా పూర్తిచేసినవారు, ఇంటర్మీడియెట్‌ తప్పినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌, ఆపై అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అనర్హులు. అభ్యర్థుల వయసు ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: పదోతరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందికి సమాన గ్రేడ్‌ వస్తే మొదట సైన్స్‌, తరవాత మేథ్స్‌, ఇంగ్లీష్‌, తెలుగు, సోషల్‌, హిందీలోని గ్రేడ్‌ పాయింట్ల ప్రకారం నిర్ణయిస్తారు. అభ్యర్థి వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.600 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300) 

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: విద్యార్థి చదివిన పాఠశాల నుంచి ధృవీకరణ, బదిలీ పత్రాలు; పదోతరగతి సర్టిఫికెట్‌; కులం, వైకల్యం, ఆదాయం, ఎన్‌సీసీ, రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీ స్థాయి క్రీడలలో పాల్గొన్న ధృవీకరణ పత్రాలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:  18-08-2021.

వెబ్‌సైట్‌: angrau.ac.in

డా.వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం 

సీట్లు: 480

ఇందులో ఉద్యాన డిప్లొమా కోర్సు ఉంది. విశ్వవిద్యాలయ హార్టికల్చరల్‌ పాలిటెక్నిక్‌లలో కలికిరి (చిత్తూరు) 40, మడకశిర (అనంతపురం) 60, నూజివీడు (కృష్ణా) 40, రామచంద్రాపురం (తూర్పుగోదావరి) 60 సీట్లు ఉన్నాయి. పొదిలి (ప్రకాశం), వేగవరం (పశ్చిమగోదావరి), నెల్లిపర్తి (విజయనగరం), మద్దిరాల (గుంటూరు), ఎచ్చెర్ల (శ్రీకాకుళం), బద్వేల్‌ (డా.వైఎస్సార్‌ కడప), కొయిలకుంట్ల (కర్నూలు)లోని ప్రైవేట్‌ హార్టీకల్చరల్‌ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 40 సీట్లు ఉన్నాయి. 

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 

సీట్లు: 1339

పశు పోషణ (యానిమల్‌ హస్బెండరీ) కోర్సులో మొత్తం 900 సీట్లు ఉన్నాయి. మడకశిర, రాపూర్‌, బనవాసి, గరివిడి, రామచంద్రాపురం, వెంకటరామన్న గూడెం, పలమనేరు, కొమ్మేమర్రి, వెన్నెలవలస, సదుంలోని ‘విశ్వవిద్యాలయ యానిమల్‌ హస్బెండరీ పాలిటెక్నిక్‌’లలో ఒక్కోదానిలో 30 సీట్లు ఉన్నాయి. ఇ అబ్బవరం, కాకినాడ, ఆళ్లగడ్డ, ప్రొద్దుటూరు, పిరిడి, టక్కోలు, జమ్మలమడుగు, ఎచ్చెర్ల, అనంతపురం, కనుమల, వక్కపట్లవారి పాలెం, నరసరావుపేటలోని అనుబంధ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 50 సీట్లు ఉన్నాయి.  

మత్స్య శాస్త్రం (ఫీషరీ) కోర్సులో మొత్తం 439 సీట్లు ఉన్నాయి. కృష్ణా జిల్లా భావదేవరపల్లిలోని విశ్వవిద్యాలయ ఫిషరీ పాలిటెక్నిక్‌లో 39 సీట్లు; నర్సీపట్నం, కాకినాడ, దారిమడుగు, టక్కోలు, కాకినాడ, పసుపుల, ఎచ్చెర్ల, పొదిలిలోని అనుబంధ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 50 సీట్లు ఉన్నాయి.

యూజీసీ నెట్ జూన్ 2021 | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: సెప్టెంబ‌ర్ 06, 2021



దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోష‌ల్ సైన్సెస్, త‌త్స‌మాన స‌బ్జెక్టుల‌కు సంబంధించి జేఆర్ఎఫ్, లెక్చ‌ర్‌షిప్(అసిస్టెంట్ ప్రోఫెస‌ర్‌) అర్హ‌త‌కు నిర్వ‌హించే యూజీసీ - నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌) -జూన్ 2021ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది.
Adminissions  
వివ‌రాలు...
  • యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్(యూజీసీ)-నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌), జూన్ 2021

అర్హ‌త‌:
  • హ‌్యూమానిటీస్, సోష‌ల్ సైన్సెస్‌(లాంగ్వేజెస్‌ని క‌లుపుకొని) కంప్యూట‌ర్‌సైన్స్ అండ్ అప్లికేష‌న్స్, ఎల‌క్ట్రానిక్స్ సైన్స్ త‌దిత‌ర స‌బ్జెక్టుల్లో క‌నీసం 55% మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: సెప్టెంబ‌ర్ 06, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://ugcnet.nta.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P
Pub