Alerts

--------

9, నవంబర్ 2023, గురువారం

Internship jobs ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

విశాఖపట్నం,హైదరాబాద్‌లలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: రాక్స్‌ట టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 13
అర్హతలు: డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/34a381

విజయవాడలో

డిజిటల్‌ మార్కెటింగ్‌
సంస్థ: డిజిటల్‌ వెర్టొ
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: నవంబరు 9
అర్హతలు: డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ అనలిటిక్స్‌, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలు
* internshala.com/i/9d2ceb

ఆపరేషన్స్‌

సంస్థ: ఐకుషల్‌ స్పేసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 14
అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*  internshala.com/i/27709f

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో..496 జేఈ కొలువులు! ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగంలో 496 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు వార్షిక వేతనం రూ.13 లక్షలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో..496 జేఈ కొలువులు!

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగంలో 496 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు

వార్షిక వేతనం రూ.13 లక్షలు  

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగంలో 496 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షతో నియామకాలు ఉంటాయి. ఈ అవకాశం వచ్చినవారు ఏడాదికి రూ.13 లక్షల వేతనం అందుకోవచ్చు. పదోన్నతులతో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.

ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థల్లో ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఒకటి. ఎయిర్‌ పోర్టుల సమర్థ నిర్వహణలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) సేవలే కీలకం. ఈ విభాగంలో ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలు పర్యవేక్షిస్తూ, ప్రయాణం సాఫీగా జరిగేలా చూస్తారు. ఇందుకు గానూ వీరికి రూ.40 వేల మూలవేతనం దక్కుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలిపి వీరు రూ.13 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం

ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రుణాత్మక మార్కులు ఉండవు. పరీక్షలో చూపిన ప్రతిభతో షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వాయిస్‌ టెస్టు ఉంటుంది. అనంతరం సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్సెస్‌ టెస్టు, సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్టు, మెడికల్‌ టెస్టు, బ్యాక్‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. వీటిలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. తుది నియామకాలు రాత పరీక్షతోపాటు సంబంధిత విభాగాల్లో చూపిన ప్రతిభ ద్వారా చేపడతారు. ఎంపికైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఏటీసీ) పోస్టుల్లో చేరేవారు శిక్షణ అనంతరం కనీసం మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం రూ.7 లక్షల విలువైన ఒప్పందపత్రంపై అంగీకారం తెలపాలి. శిక్షణలో ఉన్నప్పుడు ఐసీఏవో లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ లెవెల్‌ 4 (ఆపరేషనల్‌)లో ఉత్తీర్ణత సాధించాలి.  

పరీక్ష ఇలా

ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. పార్ట్‌ ఏ, బీల నుంచి 60 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఏలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 20, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/రీజనింగ్‌ 15, జనరల్‌ ఆప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఎబిలిటీ 15, జనరల్‌ నాలెడ్జ్‌/అవేర్‌నెస్‌ 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. బీలో ప్లస్‌2 స్థాయిలో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ నుంచి కాన్సెప్ట్‌, అప్లికేషన్స్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌ ఏ, బీ ఒక్కో దానికీ 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. రుణాత్మక మార్కులు లేవు.

సన్నద్ధత

  •  పార్ట్‌ బీలో ఎక్కువ మార్కులు పొందడానికి 11, 12 తరగతుల మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ పుస్తకాలు బాగా చదవాలి. వాటిలోని ప్రాథమికాంశాలు, అనువర్తనాలపై దృష్టి సారించాలి.
  •  పార్ట్‌ ఏలో ప్రశ్నలు తేలికగానే ఉంటాయి. బ్యాంక్‌ క్లర్క్‌ పరీక్ష స్థాయిలో వీటిని అడుగుతారు.
  •  ఐబీపీఎస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీఎస్సీ, బీటెక్‌ అభ్యర్థులు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పరీక్షను సులువుగానే
  • ఎదుర్కోవచ్చు.
  •  ప్రతి విభాగంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
  •  గతంలో నిర్వహించిన జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఏటీసీ ప్రశ్నపత్రాలు పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. పరీక్ష, ప్రశ్నల తీరు, సన్నద్ధతపై అవగాహన వస్తుంది.
  • జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌ విభాగంలో వర్తమానాంశాలతోపాటు విమానయానం, ఎయిర్‌ పోర్టులకు సంబంధించిన ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.
  •  సన్నద్ధత పూర్తయిన తర్వాత పరీక్షలోపు కనీసం పది మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, తప్పులు తగ్గించుకోగలిగితే విజయానికి అవకాశం ఉంటుంది.
  •  రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలను సైతం ఆలోచించి, ఏదో ఒక జవాబు గుర్తించుకోవచ్చు.

    ముఖ్య వివరాలు

ఖాళీలు: 496. వీటిలో విభాగాల వారీ అన్‌ రిజర్వ్‌డ్‌ 199, ఓబీసీ ఎన్‌సీఎల్‌ 140, ఈడబ్ల్యుఎస్‌ 49, ఎస్సీ 75, ఎస్టీ 33 ఉన్నాయి. వీటిలోనే దివ్యాంగులకు 5 కేటాయించారు.
అర్హత: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్‌ (ఏదైనా సెమిస్టర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి) కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఆంగ్ల భాషలో రాత, మాట్లాడే నైపుణ్యాలు అవసరం.
వయసు: నవంబరు 30, 2023 నాటికి 27 ఏళ్లు మించరాదు. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
దరఖాస్తు ఫీజు: రూ.వెయ్యి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు. ఏఏఐలో ఏడాది అప్రెంటీస్‌ పూర్తిచేసినవారికీ ఫీజు మినహాయించారు.  
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
వెబ్‌సైట్‌: https://www.aai.aero/en/careers/recruit

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

పేద విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పులు ONGC Scholarships for Poor Students

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

పేద విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పులు

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఫౌండేషన్‌ విభాగం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి ఏటా స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. ఇటీవలే ఆ ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు..

ఓఎన్‌జీసీ ఏటా మొత్తం 2000 ఉపకార వేతనాలు అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్‌ అభ్యర్థులకు 500 చొప్పున కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. వీటికి దరఖాస్తు చేసుకోవ డానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి     రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయ్యేంతవరకూ  ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.

ఎవరికి: దేశంలో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ కేటగిరీల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు
అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్‌ కోర్సు రెగ్యులర్‌ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్‌ (బీఈ/బీటెక్‌), ఎంబీబీఎస్‌ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్‌/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2023-2024 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్‌ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు అవకాశం ఉంటుంది.
ఎంపిక: ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సులకు డిగ్రీలో ప్రతిభ ప్రాతిపదికన స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు.
స్కాలర్‌షిప్పు వ్యవధి: ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.
వయసు: అక్టోబరు 16, 2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి.

నిబంధనలు

వేరే ఏ ఉపకార వేతనాలూ మంజూరు కానివాళ్లే ఓఎన్‌జీసీ ప్రోత్సాహకాలకు అర్హులు. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ద్వారా లబ్ధి పొందేవాళ్లూ ఈ స్కాలర్‌షిప్పునకు అర్హులే. ఎంపికైనవారి వివరాలను ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కేవలం పైన తెలిపిన కోర్సుల్లో భారత్‌లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

కొనసాగాలంటే

స్కాలర్‌షిప్పు ఏటా కొనసాగడానికి వార్షిక పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ మార్కులు పొందితే ఆ తర్వాత విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్పు అందదు.
దరఖాస్తు: ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. ప్రవేశపత్రం, ఫొటో, కుల ధ్రువీకరణ పత్రం, కాలేజ్‌ ఐడీ కార్డు, ఇంటర్‌ లేదా గ్రాడ్యుయేషన్‌ మార్కు షీట్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం.. వీటిని అప్‌లోడ్‌ చేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
వెబ్‌సైట్‌: https://ongcscholar.org/#/

కోర్సులు, కేటగిరీలవారీ...

ఇంజినీరింగ్‌: 500 (ఎస్సీ, ఎస్టీ), 300 ఓబీసీ, 300 జనరల్‌
ఎంబీబీఎస్‌: 90 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్‌
ఎంబీఏ: 140 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్‌
జియాలజీ/ జియోఫిజిక్స్‌: 270 (ఎస్సీ, ఎస్టీ), 100 ఓబీసీ, 100 జనరల్‌.
దేశాన్ని 5 జోన్లగా విభజించారు. ఒక్కో జోన్‌ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్‌ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్‌ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్‌ 5 పరిధిలో ఉన్నాయి.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ప్రభుత్వ ఉద్యోగాలు ఎయిమ్స్‌ రిషికేశ్‌లో 86 టీచింగ్‌ ఖాళీలు శ్రీ కొండా లక్ష్మణ్‌ వర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ వ్యవసాయ కళాశాలలో టీచింగ్‌ అసోసియేట్‌లు సీఎస్‌ఎల్‌లో నర్సింగ్‌ అసిస్టెంట్‌లు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎయిమ్స్‌ రిషికేశ్‌లో 86 టీచింగ్‌ ఖాళీలు
ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషికేశ్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌/ డెప్యుటేషన్‌/ కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో 86 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. అసోసియేట్‌ ప్రొఫెసర్‌   2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
3. ప్రొఫెసర్‌  4. అడిషనల్‌ ప్రొఫెసర్‌
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, డెంటిస్ట్రీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఈఎన్‌టీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌, డీఎం/ ఎంసీహెచ్‌/ పీహెచ్‌డీతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.
ఎంపిక: దరఖాస్తు షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-11-2023.
వెబ్‌సైట్‌:https://aiimsrishikesh.edu.in/a1_1/

ప్రవేశాలు 

శ్రీ కొండా లక్ష్మణ్‌ వర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ

సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్‌ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
1. ఎంఎస్సీ (హార్టికల్చర్‌): 30 సీట్లు
స్పెషలైజేషన్‌: ఫ్రూట్‌ సైన్స్‌, వెజిటబుల్‌ సైన్స్‌, ఫ్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌స్కేపింగ్‌, ప్లాంటేషన్‌, స్పైసెస్‌, మెడిసినల్‌, ఆరోమాటిక్‌ క్రాప్స్‌
అర్హత: బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌/ బీఎస్సీ (హార్టికల్చర్‌)తో పాటు ఐకార్‌- ఏఐఈఈఏ (పీజీ)-2023 స్కోరు సాధించి ఉండాలి.
2. పీహెచ్‌డీ (హార్టికల్చర్‌): 06 సీట్లు
స్పెషలైజేషన్‌: ఫ్రూట్‌ సైన్స్‌, వెజిటబుల్‌ సైన్స్‌, ఫ్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌స్కేపింగ్‌, ప్లాంటేషన్‌, స్పైసెస్‌, మెడిసినల్‌, ఆరోమాటిక్‌ క్రాప్స్‌
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్‌)తో పాటు ఐకార్‌ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించి ఉండాలి.
వయసు: గరిష్ఠ వయసు 31 డిసెంబర్‌ 2023 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: విద్యార్హత మార్కులు, జాతీయ స్థాయి పరీక్షల్లో సాధించిన స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్సీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. మిగతా అభ్యర్థులందరికీ రూ.2000.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది రిజిస్ట్రార్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌, ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ, ములుగు, సిద్దిపేట’ జిల్లా చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2023
వెబ్‌సైట్‌:https://www.skltshu.ac.in/

వాక్ ఇన్ 

వ్యవసాయ కళాశాలలో టీచింగ్‌ అసోసియేట్‌లు

నంద్యాల జిల్లా మహానందిలోని వ్యవసాయ కళాశాల- ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
1. టీచింగ్‌ అసోసియేట్‌ (జీపీబీఆర్‌): 01
2. టీచింగ్‌ అసోసియేట్‌ (ప్లాంట్‌ పాథాలజీ):  01  
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ.
వేతనం:  నెలకు రూ.49,000.
ఇంటర్వ్యూ తేదీ: 15-11-2023.
ప్రదేశం: అసోసియేట్‌ డీన్‌ కార్యాలయం, అగ్రికల్చర్‌ కాలేజీ, మహానంది, నంద్యాల జిల్లా.

సీఎస్‌ఎల్‌లో నర్సింగ్‌ అసిస్టెంట్‌లు

కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(సీఎస్‌ఎల్‌)... ఒప్పంద ప్రాతిపదికన నర్సింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నర్సింగ్‌ అసిస్టెంట్‌ కమ్‌ ఫస్ట్‌ ఎయిడర్‌: 02
అర్హత: ఏడో తరగతి, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌తోపాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 15-11-2023.
వేదిక: రీక్రియేషన్‌ క్లబ్‌, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌, కొచ్చి.
వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/Careers

Tags :
 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

8, నవంబర్ 2023, బుధవారం

Professor Jobs in AP: శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU)లో 205 ఫ్యాకల్టీ పోస్టులు | శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU) 205 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తును సమర్పించవచ్చు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ప్రొఫెసర్లు: 32 పోస్టులు
మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ.
పే స్కేల్: రూ.1,44,200 - 2,18,200/-

అసోసియేట్ ప్రొఫెసర్లు: 60 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ మరియు పీహెచ్‌డీ.
పే స్కేల్: రూ.1,33,400 - 2,17,100/-

అసిస్టెంట్ ప్రొఫెసర్: 113 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ/ బీఈ/ బీటెక్/ బీఎస్ అండ్ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్.
పే స్కేల్: రూ.57,700 - 1,82,400/-

దరఖాస్తు రుసుము (వాపసు ఇవ్వబడదు): రూ.3000/-

ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి (లింక్ ద్వారా: https://recruitments.universities.ap.gov.in)
అభ్యర్థి పూరించిన దరఖాస్తు యొక్క ప్రింట్-అవుట్ తీసుకొని, అన్ని స్వీయ-ధృవీకరణ పత్రాలను జతచేసి రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా "ది రిజిస్ట్రార్, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, S.V. పురం, అనంతపురం - 515 003కు పంపాలి. ".

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 20, 2023
  • ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ: నవంబర్ 27, 2023

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

JNV Selection Test: నవోదయ దరఖాస్తు గడువు మరోసారి పెంపు * ఎంపికైతే ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

JNV Selection Test:  నవోదయ దరఖాస్తు గడువు మరోసారి పెంపు

* ఎంపికైతే ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు

దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ)లో తొమ్మిది, పదకొండో తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును నవంబర్‌ 15 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. 

     నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు    

       నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు      

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Free tailoring training: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

సత్యసాయిబాబా జయంత్యుత్సవాల ను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని సత్యసా యి సేవా సమితి, శ్రీసాయి ప్రశాంతి చారిటబుల్‌ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మహిళలకు 45 రోజుల పాటు ఉచిత టైలరింగ్‌, మగ్గం శిక్షణకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్‌ విశ్వప్రసాద్‌, శ్రీసాయి ప్రశాంతి చారిటబుల్‌ సేవా ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మహిళా శిక్షకురాలుచే సత్యసాయి మందిరంలో లేడీస్‌ టైలరింగ్‌ ట్రైనింగ్‌, జ్యూట్‌ బ్యాగుల తయారీ, మగ్గం పెయింటింగ్‌పై ప్రత్యేకంగా 45 రోజులపాటు ఉచితంగా శిక్షణ, భోజన, నివాస వస తి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు సత్యసాయి మందిరంలో బయోడేటా, సెల్‌ నంబర్‌, రెండు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్లు 94413 03182, 62814 12245లను సంప్రదించాలని సూచించారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...