14, నవంబర్ 2023, మంగళవారం

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) వివిధ గ్రూప్ B మరియు C పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది సమాచారాన్ని తెలుసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా రిక్రూట్‌మెంట్: 487 గ్రూప్ బి, సి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) వివిధ గ్రూప్ B మరియు C పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది సమాచారాన్ని తెలుసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యాంశాలు:

  • DGHS నుండి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్.
  • 487 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
  • గ్రూప్ బి, సి పోస్టుల రిక్రూట్‌మెంట్.
dghs group b c recruitment 2023
dghs గ్రూప్ bc రిక్రూట్‌మెంట్ 2023
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అవసరమైన రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు ఇతర గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ క్రింది విధంగా పోస్టుల వివరాలను తెలుసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

పోస్ట్‌ల పేరు
రీసెర్చ్ అసిస్టెంట్ - 12
టెక్నీషియన్ -06
లేబొరేటరీ అటెండెంట్ - 02
లేబొరేటరీ అసిస్టెంట్ (గ్రేడ్ 2) - 4
ఇన్సెక్ట్ కలెక్టర్ : 2
సాంకేతిక నిపుణుడు - 4
లేబొరేటరీ టెక్నీషియన్ - 3
హెల్త్ ఇన్‌స్పెక్టర్ - 6
ఫీల్డ్ వర్కర్ - 1
లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 6
లైబ్రరీ క్లర్క్ - 2
ఫిజియోథెరపిస్ట్ - 6
మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 6
ఎక్స్ రే టెక్నీషియన్ - 6
మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ - 6
బోధకుడు (VTW) ఫిట్టర్ ట్రేడ్ – 2
జూనియర్ మెడికల్ లేబొరేటరీ - 2

సాంకేతిక నిపుణుడు - 2
నొక్కడం - 5

త్వరగా ఉద్యోగాన్ని ఎలా కనుగొనాలి?

అర్హత : పోస్టుల వారీగా పోస్టులకు సంబంధించిన సబ్జెక్టులో SSLC/ సెకండరీ పీయూసీ/ గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: 11-11-2023
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30-11-2023

వయస్సు అర్హత
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు మించకూడదు. తరగతుల వారీగా వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

DGHS ఉద్యోగ నోటిఫికేషన్ 2023

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ/మెరిట్ ఆధారంగా.

దరఖాస్తును సమర్పించడానికి అవసరమైన సమాచారం / పత్రాలు
SSLC రికార్డులు
సెకండరీ పీయూసీ పాస్ పత్రాలు
డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పత్రాలు
ఆధార్ కార్డు
మొబైల్ నెం
ఇ-మెయిల్ చిరునామా
ఇతర సమాచారం

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Private Jobs for Fresher

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 


Mphasis: ఎంఫేసిస్‌లో ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్ 

ఎంఫాసిస్‌ కంపెనీ.. ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు..

ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్ 

అర్హత: బీకాం, బీబీఏ, బీబీఎం ఉత్తీర్ణత. 0-1 ఏళ్ల పని అనుభవం. ఎమ్ఎస్‌ ఆఫీస్‌, ఎక్స్‌ఎల్‌, వర్డ్‌, పవర్‌ పాయింట్‌, ఎక్సెల్ మాక్రో ఈ మెయిల్ డ్రాఫ్టింగ్ తదితరాల్లో నైపుణ్యాలు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

జాజ్‌ లొకేషన్‌: పుణె.

Important Links

Posted Date: 14-11-2023

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో కంట్రోలర్‌షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ... కంట్రోలర్‌షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:  

కంట్రోలర్‌షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ 

అర్హత: చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణత. పవర్ బీఐ, ఆల్టెరిక్స్, క్విక్‌వ్యూ, పవర్ క్వెరీ, ఎస్‌క్యూఎల్‌ క్వెరీస్‌, డ్యాష్‌బోర్డ్‌ నైపుణ్యాలతో పాటు అకౌంటింగ్‌ పరిజ్ఞానం ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Important Links

Posted Date: 14-11-2023

Deloitte: డెలాయిట్‌లో అసోసియేట్ అనలిస్ట్ పోస్టులు 

డెలాయిట్ కంపెనీ.. అసోసియేట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు:

* అసోసియేట్ అనలిస్ట్

అర్హత: బీకాం డిగ్రీ, సాప్‌, ఇతర ఫైనాన్స్ అప్లికేషన్స్‌పై అవగాహన. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌పై పరిజ్ఞానం.

పని అనుభవం: 0 - 2 సంవత్సరాలు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

జాబ్ లొకేషన్: హైదరాబాద్
 

Important Links

Posted Date: 13-11-2023

TATA: టాటా కమ్యూనికేషన్స్‌లో ఇంజినీర్‌ ఖాళీలు 

టాటా కమ్యూనికేషన్స్‌.. ఇంజినీర్‌ (ప్లాట్‌ఫామ్‌ ప్లానింగ్‌  డిజైన్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

*ఇంజినీర్‌- ప్లాట్‌ఫామ్‌ ప్లానింగ్‌  అండ్‌ డిజైన్‌ 

అర్హత: బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌, టెలికమ్యూనికేషన్స్‌)తో పాటు 0-4 ఏళ్ల పని అనుభవం. టెలికమ్యూనికేషన్స్‌ సిస్టమ్స్‌, మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఐపీ డేటా తదితరాల్లో పరిజ్ఞానం ఉండాలి. 

జాబ్‌ లొకేషన్‌: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Important Links

Posted Date: 11-11-2023


Siemens: సిమెన్స్‌లో సిస్టమ్‌ ఇంజినీర్‌ ఖాళీలు 

సిమెన్స్‌ కంపెనీ- సిస్టమ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ఫ్రెషర్స్‌ నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

సిస్టమ్‌ ఇంజినీర్‌ (ఫ్రెషర్స్‌)

అర్హత: డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌ (ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం (ఎక్సెల్‌, వర్డ్, పవర్ పాయింట్‌) తదితరాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: గురుగ్రామ్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

Important Links

Posted Date: 11-11-2023

Moodys: మూడీస్‌లో డేటా అసోసియేట్ పోస్టులు 

మూడీస్ కంపెనీ డేటా అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు:

* డేటా అసోసియేట్

అర్హత: బిజినెస్/ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ. బిజినెస్‌, పైనాన్షియల్‌ డేటా, ఎక్సెల్ బేస్‌డ్‌ ప్రొసెస్‌లో 0-2 ఏళ్ల పని అనుభవంతో పాటు ఇతర నైపుణ్యాలు. పైనాన్షియల్‌ స్టేట్‌మెంట్, టర్మ్‌లలో పరిజ్ఞానం ఉండాలి.   

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Important Links

Posted Date: 10-11-2023

Infosys: ఇన్ఫోసిస్‌లో ప్రాసెస్ ట్రైనీ పోస్టులు 

ఇన్ఫోసిస్‌ కంపెనీ.. ప్రాసెస్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

ఖాళీల వివరాలు..

* ప్రాసెస్ ట్రైనీ 

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కలిగి ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Important Links

Posted Date: 10-11-2023

Private Jobs for Fresher

Company Name

ఎంఫేసిస్

Job Role

Mphasis: ఎంఫేసిస్లో ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్

Eligibility

బీకాం, బీబీఏ, బీబీఎమ్

Last date

25-11-2023

ఫ్లిప్కార్ట్

Flipkart: ఫ్లిప్కార్ట్లో కంట్రోలర్షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

సీఏ

22-11-2023

డెలాయిట్

Deloitte: డెలాయిట్లో అసోసియేట్ అనలిస్ట్ పోస్టులు

డిగ్రీ

23-11-2023

టాటా కమ్యూనికేషన్స్

TATA: టాటా కమ్యూనికేషన్స్లో ఇంజినీర్ఖాళీలు

బీటెక్

15-11-2023

సిమెన్స్

Siemens: సిమెన్స్లో సిస్టమ్ఇంజినీర్ఖాళీలు

బీటెక్‌, ఎంటెక్‌, డిప్లొమా

22-11-2023

మూడీస్

Moodys: మూడీస్లో డేటా అసోసియేట్ పోస్టులు

డిగ్రీ

22-11-2023

ఇన్ఫోసిస్

Infosys: ఇన్ఫోసిస్లో ప్రాసెస్ ట్రైనీ పోస్టులు

డిగ్రీ

22-11-2023




- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Job Notifiction: 10 రోజుల్లో 80 వేల ఖాళీలకు నోటిఫికేషన్‌ * ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ, భోజనం, స్టడీ మెటీరియల్‌ * డిసెంబరు 2న శిక్షణ ప్రారంభం

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ చేపట్టే బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉద్యోగార్థులకు పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్, రామ్‌కీ ఫౌండేషన్‌ ఉచిత శిక్షణ ఇవ్వనున్నాయి. సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా కేంద్రం 80 వేలకు పైగా ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది. ఇందుకు అర్హులైన యువతకు హైదరాబాద్, గుంటూరులో ఆయా ఫౌండేషన్‌లు న‌వంబ‌రు 26న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 29న ఫలితాలు ప్రకటిస్తాయి. ఇందులో అర్హత సాధించిన 600 మంది అభ్యర్థులకు డిసెంబరు 2 నుంచి అయిదు నెలల పాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్‌ ఉచితంగా ఇచ్చి శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు 9703651233, 7337585959, 9000797789ని సంప్రదించవచ్చు. 


నవంబర్‌ 24న ప్రకటన

నవంబర్‌ 24న నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28 పూర్తి కానుంది. కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరగనుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

11.5 కోట్ల పాన్ కార్డ్స్ రద్దు – అందులో మీ పాన్ కార్డ్ ఉందా.... చెక్ చేసుకోండి...

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

పాన్-ఆధార్ లింక్ లేటెస్ట్ అప్‌డేట్: పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. లేదంటే డీయాక్టివేట్‌ చేయక తప్పదని హెచ్చరించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ లింక్ చేయడానికి గడువు ఇచ్చింది. ఇది కూడా చాలా సార్లు పొడిగించబడింది. చివరి గడువు ముగియడంతో, CBDT ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డ్‌లను డీయాక్టివేట్ చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి.

11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసిన CBDT : దేశవ్యాప్తంగా 70.24 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లు ఉండగా, 57.25 కోట్ల మంది తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) వెల్లడించింది. దాదాపు 12 కోట్ల మంది పాన్ కార్డు హోల్డర్లు ఆధార్‌తో లింక్ చేయలేదని, వారిలో 11.5 కోట్ల మంది కార్డులు డీయాక్టివేట్ అయ్యాయని తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుపై సీబీడీటీ స్పందించింది. 2017 జూలై 1కి ముందు జారీ చేసిన పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం కేంద్రం పలుమార్లు గడువును పొడిగిస్తూ వస్తోంది. ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి మార్చి 30 వరకు గడువు ఇచ్చినప్పటికీ జూన్‌ 30 వరకు చివరి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

గడువు తప్పిన వారికి మరో అవకాశం… కార్డులు డీయాక్టివేట్ అయిన వారి కార్డులను రెన్యూవల్ చేసుకునేందుకు సీబీడీటీ మరో అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం వారు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30, 2023 గడువును ఎవరు మిస్ చేసుకున్నారో వారు పెనాల్టీని చెల్లించడం ద్వారా తమ పాన్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే.. కార్డు యాక్టివేట్ కావడానికి 30 రోజులు పడుతుంది. పాన్ కార్డ్ నిరుపయోగంగా మారడంతో లావాదేవీలకు ఉపయోగించలేరు. దీనికి ముందు మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందా? లేక డీయాక్టివేట్ అయిందా? కనిపెట్టండి. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

How  to check PAN card status?

మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి, ముందుగా మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

ఆ తర్వాత అక్కడ ‘వెరిఫై యువర్ పాన్‘ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ పాన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయాలి.

ఆ తర్వాత ‘కొనసాగించు‘పై క్లిక్ చేయండి.

అంతే మీ పాన్ కార్డ్ స్టేటస్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ప్రైవేటు మరియు విదేశీ ఉద్యోగాలు మీ సొంత విచక్షణతో అప్లై చేసుకోండి Private and Abroad Jobs try at your own risk

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో..496 జేఈ కొలువులు!

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో..496 జేఈ కొలువులు!

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగంలో 496 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు


వార్షిక వేతనం రూ.13 లక్షలు  


ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగంలో 496 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షతో నియామకాలు ఉంటాయి. ఈ అవకాశం వచ్చినవారు ఏడాదికి రూ.13 లక్షల వేతనం అందుకోవచ్చు. పదోన్నతులతో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.

ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థల్లో ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఒకటి. ఎయిర్‌ పోర్టుల సమర్థ నిర్వహణలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) సేవలే కీలకం. ఈ విభాగంలో ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలు పర్యవేక్షిస్తూ, ప్రయాణం సాఫీగా జరిగేలా చూస్తారు. ఇందుకు గానూ వీరికి రూ.40 వేల మూలవేతనం దక్కుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలిపి వీరు రూ.13 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం

ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రుణాత్మక మార్కులు ఉండవు. పరీక్షలో చూపిన ప్రతిభతో షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వాయిస్‌ టెస్టు ఉంటుంది. అనంతరం సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్సెస్‌ టెస్టు, సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్టు, మెడికల్‌ టెస్టు, బ్యాక్‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. వీటిలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. తుది నియామకాలు రాత పరీక్షతోపాటు సంబంధిత విభాగాల్లో చూపిన ప్రతిభ ద్వారా చేపడతారు. ఎంపికైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఏటీసీ) పోస్టుల్లో చేరేవారు శిక్షణ అనంతరం కనీసం మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం రూ.7 లక్షల విలువైన ఒప్పందపత్రంపై అంగీకారం తెలపాలి. శిక్షణలో ఉన్నప్పుడు ఐసీఏవో లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ లెవెల్‌ 4 (ఆపరేషనల్‌)లో ఉత్తీర్ణత సాధించాలి.  



పరీక్ష ఇలా

ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. పార్ట్‌ ఏ, బీల నుంచి 60 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఏలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 20, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/రీజనింగ్‌ 15, జనరల్‌ ఆప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఎబిలిటీ 15, జనరల్‌ నాలెడ్జ్‌/అవేర్‌నెస్‌ 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. బీలో ప్లస్‌2 స్థాయిలో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ నుంచి కాన్సెప్ట్‌, అప్లికేషన్స్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌ ఏ, బీ ఒక్కో దానికీ 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. రుణాత్మక మార్కులు లేవు.


సన్నద్ధత

  •  పార్ట్‌ బీలో ఎక్కువ మార్కులు పొందడానికి 11, 12 తరగతుల మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ పుస్తకాలు బాగా చదవాలి. వాటిలోని ప్రాథమికాంశాలు, అనువర్తనాలపై దృష్టి సారించాలి.
  •  పార్ట్‌ ఏలో ప్రశ్నలు తేలికగానే ఉంటాయి. బ్యాంక్‌ క్లర్క్‌ పరీక్ష స్థాయిలో వీటిని అడుగుతారు.
  •  ఐబీపీఎస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీఎస్సీ, బీటెక్‌ అభ్యర్థులు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పరీక్షను సులువుగానే
  • ఎదుర్కోవచ్చు.
  •  ప్రతి విభాగంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
  •  గతంలో నిర్వహించిన జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఏటీసీ ప్రశ్నపత్రాలు పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. పరీక్ష, ప్రశ్నల తీరు, సన్నద్ధతపై అవగాహన వస్తుంది.
  • జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌ విభాగంలో వర్తమానాంశాలతోపాటు విమానయానం, ఎయిర్‌ పోర్టులకు సంబంధించిన ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.
  •  సన్నద్ధత పూర్తయిన తర్వాత పరీక్షలోపు కనీసం పది మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, తప్పులు తగ్గించుకోగలిగితే విజయానికి అవకాశం ఉంటుంది.
  •  రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలను సైతం ఆలోచించి, ఏదో ఒక జవాబు గుర్తించుకోవచ్చు.

    ముఖ్య వివరాలు

ఖాళీలు: 496. వీటిలో విభాగాల వారీ అన్‌ రిజర్వ్‌డ్‌ 199, ఓబీసీ ఎన్‌సీఎల్‌ 140, ఈడబ్ల్యుఎస్‌ 49, ఎస్సీ 75, ఎస్టీ 33 ఉన్నాయి. వీటిలోనే దివ్యాంగులకు 5 కేటాయించారు.
అర్హత: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్‌ (ఏదైనా సెమిస్టర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి) కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఆంగ్ల భాషలో రాత, మాట్లాడే నైపుణ్యాలు అవసరం.
వయసు: నవంబరు 30, 2023 నాటికి 27 ఏళ్లు మించరాదు. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
దరఖాస్తు ఫీజు: రూ.వెయ్యి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు. ఏఏఐలో ఏడాది అప్రెంటీస్‌ పూర్తిచేసినవారికీ ఫీజు మినహాయించారు.  
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
వెబ్‌సైట్‌: https://www.aai.aero/en/careers/recruitment

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

సైనిక్‌ స్కూళ్ల మార్గం రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్‌ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అక్కడే చదువుకోవచ్చు. అలాగే విద్యతోపాటు త్రివిధ దళాలకు కావాల్సిన నైపుణ్యాలనూ సొంతం చేసుకోవచ్చు. ఈ సంస్థల్లో వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)- 2024తో దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు భర్తీ చేస్తారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

రక్షణ కొలువుకు దారి

రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్‌ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అక్కడే చదువుకోవచ్చు.

సైనిక్‌ స్కూళ్ల మార్గం

రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్‌ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అక్కడే చదువుకోవచ్చు. అలాగే విద్యతోపాటు త్రివిధ దళాలకు కావాల్సిన నైపుణ్యాలనూ సొంతం చేసుకోవచ్చు. ఈ సంస్థల్లో వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)- 2024తో దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు భర్తీ చేస్తారు.

దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 33 సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయి.  వీటిలో ప్రవేశానికి పరీక్ష తప్పనిసరి. దీన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. అలాగే కొత్తగా ప్రారంభమైన 19 సంస్థల్లో ఆరో తరగతిలోనే విద్యార్థులను చేర్చుకుంటారు. వీటికి సైనిక్‌ స్కూల్‌ సొసైటీ నిబంధనలు జారీ చేస్తుంది. కొత్తగా ప్రారంభమైన ప్రతి పాఠశాల కనీసం 40 శాతం సీట్లను ఆల్‌ ఇండియా మెరిట్‌ లిస్టు ప్రకారం భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం... ఇలా పలు విభాగాల్లో ఈ స్కూళ్లు నడుస్తున్నాయి. అందువల్ల ఫీజు ఒకేలా ఉండదు.

ప్రయోజనాలెన్నో

ప్రభుత్వ పరంగా జరుగుతోన్న ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ శాతం రక్షణ రంగంలోనే ఉంటున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సులతోపాటు సీఏపీఎఫ్‌లోకివచ్చే.. బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ...తదితర విభాగాల్లో క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎక్కువ నియామకాలు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఉంటాయి. యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ వీటిలో అత్యంత ముఖ్యమైనది. అలాగే ఆర్మీలో గ్రూప్‌ ఎక్స్‌, వై. నేవీలో సెయిలర్‌-ఎంఆర్‌, ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ. ఎయిర్‌ ఫోర్స్‌లో ఎయిర్‌ మెన్‌ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలు ఇంటర్‌ విద్యార్హతతో భర్తీ చేస్తున్నారు.
ఈ ప్రకటనలన్నీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వెలువడుతున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు హైస్కూల్‌ నుంచే సరైన శిక్షణ పొందితే సులువుగా విజయం సాధించగలరు అందువల్ల ఈ పరీక్షల్లో సైనిక్‌ పాఠశాల నేపథ్యం ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది విజయవంతమవుతున్నారు. ఈ స్కూళ్ల పర్యవేక్షణ రక్షణ రంగంలో ఉన్నత స్థాయిలో పనిచేసినవారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ చదువుతోపాటు క్రీడలు, క్రమశిక్షణ, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యమిస్తారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలవుతుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి బాలికలూ దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిదిలో చేరడానికి బాలురే అర్హులు. పరీక్షలో ప్రతిభ, మెడికల్‌ టెస్టులతో విద్యార్థులను ఎంపిక చేస్తారు.


పరీక్ష ఇలా

ఆరో తరగతికి: పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 125 ప్రశ్నలు వస్తాయి. సీబీఎస్‌ఈ ఐదో తరగతి సిలబస్‌ నుంచి వీటిని అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మ్యాథ్స్‌ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. జీకే (సైన్స్‌, సోషల్‌) 25, లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌/తెలుగు/ హిందీ.. ఇలా నచ్చిన భాష ఎంచుకోవచ్చు) 25, ఇంటెలిజెన్స్‌ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. తెలుగు మాధ్యమంలోనూ పరీక్ష రాసుకోవచ్చు.

తొమ్మిదో తరగతికి: 400 మార్కులకు ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు వస్తాయి. సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి సిలబస్‌ నుంచి వీటిని అడుగుతారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. మ్యాథ్స్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇంగ్లిష్‌, ఇంటెలిజెన్స్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌ ఒక్కో విభాగం నుంచీ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది.

రెండు తరగతుల ప్రవేశాలకు సంబంధించి పరీక్ష సిలబస్‌ వివరాలు ప్రకటించారు. సబ్జెక్టులవారీ ఆ పాఠ్యాంశాలను చదువుకుంటే సరిపోతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. వాటికి సమాధానాలను ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి. పరీక్షలో అర్హత సాధించడానికి సబ్జెక్టులవారీ కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే మొత్తం మీద 40 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో విజయవంతమైనవారిని ఆరు, తొమ్మిదో తరగతుల్లో చేర్చుకుంటారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.


సీట్లు.. ఫీజు

మొత్తం సీట్లలో 67 శాతం ఆ సైనిక్‌ స్కూల్‌ ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారికి దక్కుతాయి. కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో 78, తొమ్మిదిలో 22 సీట్లు ఉన్నాయి. కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో 105, తొమ్మిదిలో 10 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లోని 67 శాతం సీట్లకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చు. సైనిక స్కూళ్లలో చేరిన విద్యార్థులు ఫీజు చెల్లించాలి. బోధన, వసతి, భోజనం అన్నీ కలిపి ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలు అవసరమవుతాయి. అయితే మెరిట్‌ విద్యార్థులు, అల్పాదాయ వర్గాలకు రాష్ట్రాలు స్కాలర్‌షిప్పు అందించడం లేదా ఫీజు మినహాయించడం చేస్తున్నాయి. కొత్తగా ప్రారంభమైన ఆదానీ వరల్డ్‌ స్కూల్‌ నెల్లూరులో ఆరో తరగతిలోకి 80 సీట్లు కేటాయించారు.


ఏయే అర్హతలు?

ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. అలాగే మార్చి 31, 2024 నాటికి వయసు 10 నుంచి 12 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2012 - మార్చి 31, 2014 మధ్య జన్మించినవారు అర్హులు. తొమ్మిదిలో చేరాలనుకున్నవారు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుండాలి. వయసు మార్చి 31, 2024 నాటికి 13 నుంచి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2009 - మార్చి 31, 2011 మధ్య జన్మించినవారు అర్హులు.


దరఖాస్తులు: డిసెంబరు 16 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.500. మిగిలిన అందరికీ రూ.650.


పరీక్ష తేదీ: జనవరి 21  

పరీక్ష కేంద్రాలు: ఏపీలో..అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌.

వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/AISSEE/

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

Work for Companies from Where you are