18, నవంబర్ 2023, శనివారం

SSC JE Jobs: ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌-2023 పేపర్‌-1 ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

SSC JE Jobs: ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌-2023 పేపర్‌-1 ఫలితాలు

* ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

 జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి నిర్వహించిన పేపర్‌-1 రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. పేపర్‌-1లో మొత్తం 12,227 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరు పేపర్‌-2 పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. ఎంపికైన వారికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.




  ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌-2023 పేపర్‌-1 ఫలితాలు (జాబితా-1)  





 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఏపీ ఈఏపీసెట్‌-2023 సీట్ల కేటాయింపు పూర్తి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ఏపీ ఈఏపీసెట్‌-2023 సీట్ల కేటాయింపు పూర్తి

ఏపీ ఈఏపీసెట్‌-2023(ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఆంధ్రప్రదేశ్‌) బైపీసీ విభాగంలో 96శాతం సీట్లు భర్తీ చేసినట్లు రాష్ట్ర ఈఏపీసెట్‌-2023 కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి శుక్రవారం తెలిపారు.


ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీ ఈఏపీసెట్‌-2023(ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఆంధ్రప్రదేశ్‌) బైపీసీ విభాగంలో 96శాతం సీట్లు భర్తీ చేసినట్లు రాష్ట్ర ఈఏపీసెట్‌-2023 కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి శుక్రవారం తెలిపారు. ‘బీ-ఫార్మసీ, ఫార్మ్‌-డీ, ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి 192 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 10,423 సీట్లు అందుబాటులో ఉండగా, 141 సీట్లు మినహా 10,282 సీట్లు భర్తీ చేశాం. బైపీసీ విభాగంలో ఫార్మా కోర్సుల కోసం 15,456 మంది నమోదు చేసుకోగా 15,395 మంది అర్హత సాధించారు. తుది ఎంపికలో 14,832 మందికి సీట్లు కేటాయించాం. ఫార్మా ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి మూడు విశ్వవిద్యాలయాలు, ఒక ప్రైవేటు కళాశాలల్లో 150 సీట్లు ఉండగా అన్ని భర్తీ అయ్యాయి. ఫార్మ్‌-డీ కోర్సులలో రెండు విశ్వవిద్యాలయాల్లో 59సీట్లు, 63 ప్రైవేటు కళాశాలల్లో 1448 సీట్లు ఉండగా అన్ని భర్తీ చేశాం. బీ-ఫార్మసీలో 8 విశ్వవిద్యాలయాల్లో ఉన్న 478 సీట్లు, 115 ప్రైవేటు కళాశాలల్లో ఉన్న 8,288 సీట్లల్లో 8,147 భర్తీ అయ్యాయి. రాష్ట్రక్రీడాభివృద్ధి సంస్థ నుంచి తుది మెరిట్‌ జాబితా విడుదలకాగానే   క్రీడా కోటా కింద ఉన్న 47 సీట్లనుభర్తీ చేస్తాం. ప్రవేశాలు దక్కించుకున్న విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఈనెల 21 లోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది’ అని నాగరాణి తెలిపారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఎస్సై ఎంపిక ఫలితాలు ప్రకటించొద్దు తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎస్సై పోస్టుల ఎంపిక ఫలితాలను ప్రకటించొద్దని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 



ఎస్సై ఎంపిక ఫలితాలు ప్రకటించొద్దు

తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎస్సై పోస్టుల ఎంపిక ఫలితాలను ప్రకటించొద్దని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం

ఎత్తు విషయంలో 2018లో అర్హులైన వారు ఇప్పుడెలా అనర్హులవుతారని ప్రశ్న

ఈనాడు, అమరావతి: తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎస్సై పోస్టుల ఎంపిక ఫలితాలను ప్రకటించొద్దని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎత్తు విషయంలో 2018లో అర్హులైన అభ్యర్థులు 2023 నోటిఫికేషన్‌లో ఎలా అనర్హులు అవుతారని ప్రశ్నించింది. గతంలో ఉన్న దానికంటే ఎత్తు తగ్గారన్న వాదనను సమ్మతించలేమని పేర్కొంది. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్‌ను ఆదేశించింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న మరో వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఎస్సై పోస్టుల భర్తీలో (2023 నోటిఫికేషన్‌) శారీరకదారుఢ్య పరీక్షల్లో భాగంగా డిజిటల్‌ పరికరాలతో ఎత్తు కొలవడాన్ని సవాలు చేస్తూ 95 మంది అభ్యర్థులు హైకోర్టులో గతంలో పిటిషన్లు వేశారు. డిజిటల్‌ పరికరాల ద్వారా ఛాతి, ఎత్తు కొలతలు నిర్వహించడంతో తాము అనర్హులమయ్యామన్నారు. మాన్యువల్‌ విధానంలో కొలతలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2018 నోటిఫికేషన్‌లో ఎత్తు విషయంలో తాము అర్హత సాధించామని, ప్రస్తుతం ఎలా అనర్హులమవుతామని ప్రశ్నించారు. వారి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. మాన్యువల్‌ విధానంలో కొలతలు తీయాలని పోలీసు నియామక బోర్డును ఈ ఏడాది అక్టోబరులో ఆదేశించింది. అందులో అర్హులైన వారిని ప్రధాన రాతపరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మాన్యువల్‌ విధానంలో ఎత్తు కొలతను నిర్వహించిన అధికారులు.. పిటిషనర్లు అందరినీ అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో ఎ.దుర్గాప్రసాద్‌, మరో 23 మంది హైకోర్టులో తాజాగా పిటిషన్‌ వేశారు.

శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది రేగులగడ్డ వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. ఎత్తు విషయంలో గతంలో అర్హులైన వారిని ప్రస్తుత నోటిఫికేషన్‌లో అనర్హులుగా పేర్కొనడం చట్ట విరుద్ధమన్నారు. ఎత్తు విషయంలో వ్యత్యాస వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఫలితాలను ప్రకటించొద్దని ఆదేశించారు. 2018 నోటిఫికేషన్‌ ప్రకారం జరిగిన ప్రక్రియలో కొంత మంది అభ్యర్థులు 169.1, 168.1 సెంటీమీటర్ల ఎత్తు ఉంటే.. ప్రస్తుత నోటిఫికేషన్‌ ప్రక్రియలో అదే అభ్యర్థులు 167.6 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నట్లు గుర్తుచేశారు. ఎత్తు తగ్గారన్న వాదనను ఆమోదించలేమని స్పష్టం చేశారు. అంతకు ముందు సహాయ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాన్యువల్‌ విధానంలో ఎత్తు కొలత తీసినా పిటిషనర్లు ఎవరూ అర్హత సాధించలేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని కోరారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నేడు విద్యుత్ సరఫరా బంద్ | హిందూపురం అర్బన్

నేడు విద్యుత్ సరఫరా బంద్


హిందూపురం అర్బన్, నవంబరు 17: పరిగి మండలంలోని పెద్దిరెడ్డిపల్లి సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నిజాముద్దీన్ తెలిపారు. శాసనకోట, ఎం. చెర్లో
పల్లి, మోద, శ్రీరంగరాజుపల్లి, ముల్లమోతుకపల్లి, పెద్దిరెడ్డిపల్లి, పాపిరెడ్డిపల్లి, పుట్టగూర్లపల్లి, కోనాపురం, కొడిగెనహళ్ళి, గొరవనహళ్ళి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. సేవామందిర్లో 132 కేవీ కొత్త లైన్ పనులు జరుగుతున్నాయని, దీనివల్ల కూడా అంతరాయం ఉంటుందన్నారు.
ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

ఆధార్ బయోమెట్రిక్ లాకింగ్, అన్ లాక్ ఇలా | Aadhaar Biometric Locking, Unlocking



ఆధార్ బయోమెట్రిక్ ఒకరకంగా వ్యక్తిగత సెక్యూరిటీ మెకానిజమ్. దీంతో ఆధార్ కార్డుకు సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషను యాక్టివేట్, డీయాక్టివేట్ చేస్తూ ఎవరూ

మిసూజ్ చేయకుండా చూసుకోవచ్చు. 

అన్లాక్తో వ్యక్తి ఫింగర్ ప్రింట్, ఐరిస్ డేటా వినియోగాన్ని నిరోధించవచ్చు. దీని కోసం ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటరు వెళ్ళాలి. లేదంటే ఆధార్పో ర్టలు సందర్శించాలి. దీనికోసం...

యూఐడీఏఐ వెబ్సైట్ హోమ్పేజీలోని ఆధార్ సర్వీసెస్ విభాగంపై క్లిక్ చేస్తే, డ్రాప్టా డౌన్ మెనూ అదీ వివిధ ఆప్షన్లతో యాక్సెస్ లభిస్తుంది. 

అక్కడ లాక్/ అన్లాక్ బయోమెట్రిక్స్' ఆప్షన్ ఉంటుంది. 

అదే లాక్/ అన్లాక్ బయోమెట్రిక్స్ పేజీలోకి తీసుకెళుతుంది. 

ఆధార్ నంబర్ ఫీల్డ్ దిగువన సెక్యూరిటీ కోడ్ కనిపిస్తుంది. 

ఇమేజ్లోని కేరక్టర్లు టైప్ చేయాలి లేదా సెక్యూరిటీ కోడ్  బాక్స్లో ఉన్న టెక్స్ని టైప్ చేయాలి.

సెండ్ ఓటీపీ బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. 

ఓటీపీని నింపి, సబ్మిట్ లేదా అన్లాక్ బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు అన్లాకింగ్ ప్రక్రియ మొదలవుతుంది.

ప్రక్రియను పక్కాగా పూర్తి చేస్తే చాలు, అన్లాకింగ్కు సంబంధించిన కన్ఫర్మేషన్ మెసేజ్(ఎస్ఎంఎస్) అందుతుంది. 

ఈ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. 

ముఖ్యంగా యూజర్ మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకుంటే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్ళి 
అవసరమైన మార్పులు చేయించుకోవాలి. 

21వ తేదీన జాబ్ మేళాJob Mela on 21st



అనంతపురం క్లాక్ టవర్, నవంబరు 17:
హైదరాబాద్కు చెందిన ఎంఎస్.ఎన్ ల్యాబోరేటరీస్  ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యో గాల భర్తీకి మంగళవారం జాబ్మేళా నిర్వహిస్తు న్నట్లు ఎఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. ఇంటర్, ఫార్మసీ 2022-23 విద్యాసంవ త్సరంలో పూర్తి చేసి, 20 ఏళ్ల వయస్సులోపు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు రూ.11వేలు వేతనం చెల్లిస్తారు న్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మంగళ వారం ఆరీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్ఎ కాలజీ సెంటర్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజ రుకావాలన్నారు. వివరాలకు 9182063878, 9154829055 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

● పీజీలో నచ్చిన విభాగానికి మారొచ్చు ● కొత్త విద్యావిధానం మేరకు యూజీసీ నిబంధనల ముసాయిదా సిద్ధం

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 
నాలుగేళ్ల డిగ్రీ ఉంటే.. ఏడాదిలో పోస్టుగ్రాడ్యుయేషన్‌





న్యూఢిల్లీ, నవంబరు 17: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు శుభవార్త..! కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) మేరకు పీజీ కోర్సుల కాలపరిమితి, క్రెడిట్స్‌, ఎంపిక విధానాలు, విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టు, నచ్చిన మోడ్‌ను ఎంచుకునే వెసులుబాట్లను కల్పిస్తూ.. యూనివర్సిటీస్‌ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) కొత్త నిబంధనల ముసాయిదాను సిద్ధం చేసింది. త్వరలో ఈ ముసాయిదాను పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు. తాజా ముసాయిదాలో పీజీ కోర్సుల కోసం పాఠ్యాంశాలు, క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తూ.. విద్యార్థులు ఇకపై పీజీని పూర్తి చేసేందుకు యూజీసీ మూడు విధానాలను ప్రతిపాదించింది. అవి.. ఏడాది కాలపరిమితితో పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఇప్పుడున్న రెండేళ్ల పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ యూజీ–పీజీ కోర్సులు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ– బ్యాచిలర్‌ డిగ్రీ)లో నాలుగేళ్ల కోర్సులను చదివిన విద్యార్థులు, పరిశోధనను పూర్తిచేసి ఉంటే.. ఇకపై ఏడాదిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ)ని పూర్తిచేయొచ్చు. ఒకవేళ పరిశోధన లేనిపక్షంలో.. ప్రొఫెషనల్‌గా డిమాండ్‌ ఉన్న కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) వంటి సబ్జెక్టులను పూర్తి చేసినా.. అలాంటి వారు ఒక సంవత్సరంలో పీజీని పూర్తి చేయొచ్చు. అంతేకాదు..! పీజీలో నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు. అది ఆన్‌లైన్‌ మోడ్‌లోనా? లేక ఆఫ్‌లైన్‌/దూరవిద్య ద్వారానా? లేదంటే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మోడ్‌లను కలగలిపిన హైబ్రీడ్‌ విధానమా? అన్నదాన్ని విద్యార్థులు ఎంచుకోవచ్చు. దీంతోపాటు.. రెండేళ్ల పీజీ విధానం కొనసాగుతుంది. ఐదేళ్ల యూజీ–పీజీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులోనూ క్రెడిట్స్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ను పెంచాలని తాజా ముసాయిదా ప్రతిపాదించింది. యూజీ పూర్తిచేసిన విద్యార్థులు ఇప్పటి వరకు రెగ్యులర్‌ పద్ధతిలో పీజీలో చేరేందుకు ప్రవేశపరీక్షలను అధిగమించాల్సిందే..! స్టెమ్‌ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ.. లేదా మూడేళ్ల డిగ్రీతోపాటు రెండేళ్ల పీజీ.. లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను పూర్తి చేసినవారు ఎంఈ, ఎంటెక్‌లో చేరేందుకు అర్హులని ముసాయిదా ప్రతిపాదిస్తోంది.
 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html