నేడు విద్యుత్ సరఫరా బంద్
హిందూపురం అర్బన్, నవంబరు 17: పరిగి మండలంలోని పెద్దిరెడ్డిపల్లి సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నిజాముద్దీన్ తెలిపారు. శాసనకోట, ఎం. చెర్లో
పల్లి, మోద, శ్రీరంగరాజుపల్లి, ముల్లమోతుకపల్లి, పెద్దిరెడ్డిపల్లి, పాపిరెడ్డిపల్లి, పుట్టగూర్లపల్లి, కోనాపురం, కొడిగెనహళ్ళి, గొరవనహళ్ళి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. సేవామందిర్లో 132 కేవీ కొత్త లైన్ పనులు జరుగుతున్నాయని, దీనివల్ల కూడా అంతరాయం ఉంటుందన్నారు.
ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
కామెంట్‌లు