18, నవంబర్ 2023, శనివారం

ఏపీ ఈఏపీసెట్‌-2023 సీట్ల కేటాయింపు పూర్తి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ఏపీ ఈఏపీసెట్‌-2023 సీట్ల కేటాయింపు పూర్తి

ఏపీ ఈఏపీసెట్‌-2023(ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఆంధ్రప్రదేశ్‌) బైపీసీ విభాగంలో 96శాతం సీట్లు భర్తీ చేసినట్లు రాష్ట్ర ఈఏపీసెట్‌-2023 కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి శుక్రవారం తెలిపారు.


ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీ ఈఏపీసెట్‌-2023(ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఆంధ్రప్రదేశ్‌) బైపీసీ విభాగంలో 96శాతం సీట్లు భర్తీ చేసినట్లు రాష్ట్ర ఈఏపీసెట్‌-2023 కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి శుక్రవారం తెలిపారు. ‘బీ-ఫార్మసీ, ఫార్మ్‌-డీ, ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి 192 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 10,423 సీట్లు అందుబాటులో ఉండగా, 141 సీట్లు మినహా 10,282 సీట్లు భర్తీ చేశాం. బైపీసీ విభాగంలో ఫార్మా కోర్సుల కోసం 15,456 మంది నమోదు చేసుకోగా 15,395 మంది అర్హత సాధించారు. తుది ఎంపికలో 14,832 మందికి సీట్లు కేటాయించాం. ఫార్మా ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి మూడు విశ్వవిద్యాలయాలు, ఒక ప్రైవేటు కళాశాలల్లో 150 సీట్లు ఉండగా అన్ని భర్తీ అయ్యాయి. ఫార్మ్‌-డీ కోర్సులలో రెండు విశ్వవిద్యాలయాల్లో 59సీట్లు, 63 ప్రైవేటు కళాశాలల్లో 1448 సీట్లు ఉండగా అన్ని భర్తీ చేశాం. బీ-ఫార్మసీలో 8 విశ్వవిద్యాలయాల్లో ఉన్న 478 సీట్లు, 115 ప్రైవేటు కళాశాలల్లో ఉన్న 8,288 సీట్లల్లో 8,147 భర్తీ అయ్యాయి. రాష్ట్రక్రీడాభివృద్ధి సంస్థ నుంచి తుది మెరిట్‌ జాబితా విడుదలకాగానే   క్రీడా కోటా కింద ఉన్న 47 సీట్లనుభర్తీ చేస్తాం. ప్రవేశాలు దక్కించుకున్న విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఈనెల 21 లోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది’ అని నాగరాణి తెలిపారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: