22, జనవరి 2021, శుక్రవారం

31 నుంచి ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ మూడో దశ పరీక్షలు

న్యూఢిల్లీ: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష మూడోదశ షెడ్యూల్‌ను రైల్వేరిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. మూడో విడుత పరీక్షలు జనవరి 31 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు ఫిబ్రవరి 12న ముగుస్తాయని తెలిపింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 28 లక్షల మంది హాజరుకానున్నారు. పరీక్షలకు నాలుగు రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.   

ఆర్‌ఆర్‌బీ 35,208 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి 2019లో నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను దశలవారీగా మార్చివరకు నిర్వహిస్తున్నారు. మొదటి విడుత పరీక్షలు గతేడాది డిసెంబర్‌ 28న ప్రారంభమై జనవరి 12న ముగిశాయి. రెండో దశ పరీక్షలు 16 నుంచి 30 వరకు జరుగనున్నాయి. ఇక మూడో దశ పరీక్షలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరుగుతాయి.

కామెంట్‌లు లేవు: