22, జనవరి 2021, శుక్రవారం

📚✍గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం✍📚



🌻ఒంగోలు టూటౌన్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సం క్షేమ గురుకుల విద్యాలయాలలో 2020-21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశానికి మిగిలి ఉన్న ఖాళీలను లాటరీ పద్ధతిలో భర్తీ చేసేందుకు బాల, బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కో-ఆర్డినేటర్ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ లోగా సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాల యాల సంస్థ (పాత రిమ్స్) నందు దరఖాస్తు చేసు కోవాలని తెలిపారు. 24వ తేదీ ఉదయం 11 గంట లకు చీమకుర్తిలోని సాంఘిక సంక్షేమశాఖ గురు కుల కళాశాలలో లాటరీ పద్ధతి ద్వారా సీట్ల కేటా యించనున్నట్టు తెలిపారు. ఇతర సమాచారం కోసం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లేదా కళాశాల నందు ప్రధానాచార్యులను సంప్రదిం చాలని కోరారు.

కామెంట్‌లు లేవు: