UGC-NET: డిసెంబర్ 6-14 తేదీల్లో యూజీసీ-నెట్ పరీక్షలు
* జనవరి 10న ఫలితాలు
* త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల
![]() |
యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 (యూజీసీ-నెట్) పరీక్ష నిర్వహణ షెడ్యూల్ విడుదలైంది. ముఖ్య నగరాల్లోని కేంద్రాల్లో డిసెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరీక్ష జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు- 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు- 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.
యూజీసీ- నెట్ డిసెంబర్ 2023 పరీక్షల షెడ్యూల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి