17, నవంబర్ 2023, శుక్రవారం

నాలుగేళ్ల డిగ్రీ ఉంటే ఏడాదిలోనే పీజీ!

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

నాలుగేళ్ల డిగ్రీ ఉంటే ఏడాదిలోనే పీజీ!

దిల్లీ: నాలుగేళ్ల డిగ్రీ చదివిన విద్యార్థులు ఏడాదిలోనే పీజీ పూర్తి చేసేలా నిబంధనలను తేవాలని యూజీసీ నిర్ణయించింది. దీంతోపాటు పీజీ విద్యార్థులు సబ్జెక్టులను మార్చుకునే అవకాశం ఇవ్వనుంది. అభ్యసన విధానాన్ని ఆఫ్‌లైన్‌, డిస్టెన్స్‌, ఆన్‌లైన్‌, హైబ్రిడ్‌ విధానంలో దేన్నైనా విద్యార్థులు ఎంచుకునేలా అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు డ్రాఫ్ట్‌ కరిక్యులంతోపాటు క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌తో ముసాయిదాను యూజీసీ సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను త్వరలో అందరికీ అందుబాటులో ఉంచి అభిప్రాయాలను సేకరిస్తారు. ‘ఏడాది, రెండేళ్లు, ఐదేళ్ల సమీకృత పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ఇందులో నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌, సబ్జెక్టుల మిళితం ద్వారా అత్యున్నత స్థాయి విద్య అందనుంది’ అని ఆ ముసాయిదా వెల్లడించింది.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: