AISSEE 2024: అఖిల భారత సైనిక పాఠశాలలో ప్రవేశ (అడ్మిషన్) పరీక్ష కు నోటిఫికేషన్ (AISSEE )-2024 | AISSEE 2024: Notification for All India Military School Admission Test (AISSEE)-2024
AISSEE 2024: అఖిల భారత సైనిక పాఠశాలలో ప్రవేశ (అడ్మిషన్) పరీక్ష కు నోటిఫికేషన్ (AISSEE )-2024
భారత రక్షణ త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇక్కడి బోధన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసంతోపాటు, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించే విధంగా ఉంటుంది. పాఠశాల దశ నుంచే రక్షణ రంగంలోకి ప్రవేశించడానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తారు. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్షకు (AISSEE -2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం దీని కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. 19 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది అవి ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసేలా కార్యాచరణ ఉంటుంది ఆరోతరగతిలో ప్రవేశాలు ఈ పాఠశాలల్లోనూ AISSEE -2024 ద్వారా జరుగుతాయి.
పరీక్ష వివరాలు...
* అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE )-2024
సీట్ల కేటాయింపు: ఆరో తరగతి (ప్రభుత్వ- 2970, ప్రైవేటు- 2255)కి 5225; తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు.
ఏపీలోని కోరుకొండ(విజయనగరం జిల్లా),
కలికిరి (చిత్తూరు జిల్లా),
కృష్ణపట్నం(ఎస్పీఎస్సార్ నెల్లూరు)
పై ప్రాంతాలలో సైనిక పాఠశాలలు ఉన్నాయి.
అర్హతలు:
ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు 10-12 ఏళ్ల మధ్యలో ఉండాలి అంటే మార్చి 31, 2024 నాటికి ఈ వయసు (జన్మించి) ఉండాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
* తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు 13-15 ఏళ్ల మధ్యలో ఉండాలి
అంటే మార్చి 31, 2024 నాటికి ఈ వయసు (జన్మించి) ఉండాలి అలాగే ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించి ఉండాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత ప్రవేశం కల్పిస్తారు.
పరీక్ష విధానం: పెన్ పేపర్ అంటే OMR Sheet విధానంలో ఉంటుంది ఈ వ్రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
* 6వ తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకయితే మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుది. 125 ప్రశ్నలు ఇస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. లాంగ్వేజ్, ఇంటలిజెన్స్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నలను అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. 2.30 గంటలుగా పరీక్ష కాల వ్యవధి ఉంటుంది.
* తొమ్మిదో తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు, ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, ఇంటలిజెన్స్, సోషల్ సైన్స్, జనరల్ సైన్స్, సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానం వ్రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. మూడు గంటల పరీక్షకు సమయం ఉంటుంది.
* తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో, ఆరో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, మరాఠీ, ఒడియా, పంజాబీ, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, తమిళ్, ఉర్దూ, తెలుగు మీడియం లలో పరీక్ష రాయడానికి అవకాశం ఉంది.
సీట్ల కేటాయింపు ఇలా ఉంటుంది: ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు వితరణ చేస్తారు. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% రిజర్వేషన్ కల్పించారు. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు అలాగే మిగతా 25% ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయించబడవచ్చు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాంచడానికి వీలు ఉండదు.
పరీక్ష కేంద్రాలు: పరీక్ష రాసేందుకు దేశ వ్యాప్తంగా 186 కేంద్రాలు అంటే దాదాపు అన్ని సైనిక స్కూళ్లలో అవకాశం ఉంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో నవంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 16, 2023 లోగా అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులో మార్పులకు అవకాశం ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి. ప్రవేశ పరీక్ష జనవరి 21, 2024న నిర్వహిస్తారు.
The Central Government has set up military schools with the aim of preparing officers required for the three forces of Indian Defense from the school level. The teaching here is holistic personality development, discipline and patriotism. Right from the school stage, they are taught the skills needed to enter the defense sector. For the academic year 2024-2025, the Central Government has released the All India Military Schools Entrance Examination (AISSEE-2024) notification for admissions to 6th and 9th class in 33 military schools under the Ministry of Defense across the country. National Testing Agency (NTA) conducts the entrance test for this as per the rules of Sainik School Society. Ministry of Defense has approved 19 new Military Schools which will be operated in partnership with NGOs/Private Schools/State Governments.Admissions in Class VI will also be conducted through AISSEE-2024.
Exam Details...
* All India Military Schools Entrance Examination (AISSEE)-2024
Allotment of Seats: 5225 for Class VI (Government- 2970, Private- 2255); 697 seats have been allotted for ninth class.
Korukonda in AP (Vijayanagaram District),
Kalikiri (Chittoor District),
Krishnapatnam (SPSR Nellore)
There are military schools in the above areas.
Qualifications:
The age of the students seeking admission to Class VI should be between 10-12 years i.e. this age (born) as on March 31, 2024. Girls can also apply for admission in class VI.
* The age of the students taking admission in ninth standard should be between 13-15 years
Means should be of this age (born) by March 31, 2024 and should have passed eighth standard.
Selection Process: Candidates should have secured minimum 25% marks in each subject and 40% marks in aggregate in all subjects in the entrance test. In this, those who qualify will be given admission after conducting physical fitness and medical tests.
Exam Pattern: Pen Paper i.e. OMR Sheet Pattern The allotment of seats is based on the merit achieved in this written exam.
* There will be an exam of 300 marks for the students who get admission in 6th standard. 125 questions will be given. There will be 50 questions from Mathematics subject. Three marks for each question. 25 questions will be asked from Language, Intelligence and General Knowledge subjects. Two marks for each question. The duration of the exam will be 2.30 hours.
* Students entering class 9 will conduct the exam for 400 marks. 50 questions will be given from Mathematics, each question will carry four marks. Answer 100 questions of 25 questions each from English, Intelligence, Social Science, General Science, Subjects. Two marks for each question. The duration of the exam will be three hours.
* Class IX students can appear in English medium, Class VI students in English, Marathi, Odia, Punjabi, Hindi, Assamese, Bengali, Gujarati, Kannada, Malayalam, Tamil, Urdu, Telugu medium.
Allotment of seats is as follows: 67% of the total seats available in a state where a military school is located will be allocated to students from that state/UT and 33% to students from other states. Out of that SC-15%, ST-7.5% and 27% reservation for students belonging to other castes. Of the remaining 50.50% seats, 25% may be reserved for children of Ex-Defence personnel and the remaining 25% for students from other states/UTs. No more than three seats can be allotted to a single state in this quota.
Exam Centers: There are 186 centers across the country i.e. almost all military schools have the opportunity to write the exam.
Exam centers in AP and Telangana states: Anantapur, Guntur, Kadapa, Kurnool, Nellore, Ongole, Rajamahendravaram, Srikakulam, Tirupati, Vijayawada, Visakhapatnam, Vijayanagaram, Hyderabad, Karimnagar.
Application Procedure: Eligible students can apply online from November 7, 2023 to December 16, 2023. From December 18th to 20th, changes in the application will be possible. Students belonging to SC/ ST castes will have to pay Rs.500 and others will have to pay Rs.650. The entrance test will be held on January 21, 2024.
కామెంట్‌లు