4, మే 2021, మంగళవారం

Tirupati jobs vacancy 2021 : పరీక్ష లేదు, తిరుపతిలో 410 ఉద్యోగాలు, వర్చ్యువల్ విధానంలో ఇంటర్వ్యూలు

APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అమర్ రాజా గ్రూప్స్ లిమిటెడ్స్,   కరకంబాడి రోడ్ , తిరుపతి, చిత్తూరు జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు .

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిమే 8, 2021
వర్చ్యువల్ ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమే 11, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

మెషిన్ ఆపరేటర్స్300
ఐటీఐ వెల్డర్స్110
Tirupati jobs vacancy 2021

అర్హతలు :

10వ తరగతి లో ఉత్తీర్ణులు అయిన అభ్యర్థులు మరియు ఇంటర్, ఐటీఐ కోర్సులలో పాస్ /ఫెయిల్ అయిన అభ్యర్థులు అందరూ మెషిన్ ఆపరేటర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

10వ తరగతి /ఇంటర్ /ఐటిఐ (ఫిట్టర్ /టర్నర్ /మెషినిస్ట్ /ఎలక్ట్రికల్ /మెకానికల్ /ప్లాస్టిక్ )కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఐటిఐ వెల్డర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు .

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

వర్చ్యువల్ ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Tirupati jobs vacancy 2021
Tirupati jobs vacancy 2021

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి కరమైన జీతం లభించనుంది.మరియు నైట్ అలోవెన్స్, అటెండెన్స్ అలోవెన్స్ కూడా లభించనున్నాయి.

మరియు ఈ జీతంతో పాటు భోజన మరియు వసతి సౌకర్యాలలో రాయితీ కల్పించబడుతుంది.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

8247766099

1800-425-2422

Registration Link 

Website 

2, మే 2021, ఆదివారం

Defence Services Jobs 2021 || డిఫెన్స్ సర్వీస్ లో వివిధ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు:

83

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి 21 రోజుల లోపు అని చెప్పడం జరుగుతుంది.

విభాగాల వారీగా ఖాళీలు:

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 24
లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసి10
సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్)7
సుఖాని1
వడ్రంగి1
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్60

లెవల్స్:

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2Level 4
లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసిLevel 2
సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్)Level 2
సుఖానిLevel 2
వడ్రంగిLevel 2
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్Level 1

జీతం:

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 225500-81100
లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసి19900-63200
సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్)19900-63200
సుఖాని19900-63200
వడ్రంగి19900-63200
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్18000-56900

వయస్సు:

పోస్ట్ ని బట్టి 18-27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

Website

Notification

 

1, మే 2021, శనివారం

DFCCIL Recruitment | భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగాల భర్తీ, 1074 రైల్వే పోస్టులు

 

భారీ స్థాయిలో జీతం లభించే ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనీ ప్రకటనలో పొందుపరిచారు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదిమే 23, 2021
CBT పరీక్ష నిర్వహణ తేదిజూన్ 2021

విభాగాల వారీగా ఖాళీలు :

జూనియర్ మేనేజర్ (సివిల్ )31
జూనియర్ మేనేజర్ (ఆపరేషన్స్ & BID)77
జూనియర్ మేనేజర్ (మెకానికల్ )3
ఎగ్జిక్యూటివ్ (సివిల్ )73
ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ )42
ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్ )87
ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్ & BD)237
ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ )3
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ )135
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ &టెలి కమ్యూనికేషన్ )147
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్ & BD)225
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ )14

అర్హతలు :

జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బాచిలర్ డిగ్రీ /బీఈ /బీ. టెక్ /ఎంబీఏ /పీజీడీజీఏ /పీజీడీబీఎం /పీజీడీఎం మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను.

సంబంధిత విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో  10వ తరగతి మరియు ఐటీఐ కోర్సులను కంప్లీట్ చేసిన వారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఈ పోస్టుల విద్యా అర్హతలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

DFCCIL Recruitment

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు .

ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 15 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు .

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు ఉద్యోగాల విభాగాలను అనుసరించి 700 – 1000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను .

ఎస్సీ /ఎస్టీ మరియు అన్ని కేటగిరిలకు చెందిన మహిళా అభ్యర్థులకు ఎటువంటి ధరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు (CBT) మరియు ఇంటర్వ్యూల విధానాల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 25,500 రూపాయలు నుండి 1,95,000 రూపాయలు వరకూ లభించనున్నాయి.

Website 

Notification

29, ఏప్రిల్ 2021, గురువారం

ఎస్‌బీఐలో 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. Closure of registration of application 20/05/2021



ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. క్లరికల్‌ కేడర్‌లో 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టులు: జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)
మొత్తం పోస్టుల సంఖ్య: 5454 (రెగ్యులర్‌–5000, బ్యాక్‌లాగ్‌– ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ –121, పీడబ్ల్యూడీ–96, ఎక్స్‌సర్వీస్‌మెన్‌–237).

హైదరాబాద్‌ సర్కిల్‌(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 275.
విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1993 –01.04.2001 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష : ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులకు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు; రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్‌ ఎగ్జామ్‌: మెయిన్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు; క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2గంటల 40నిమిషాలు.

ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021
ప్రిలిమినరీ పరీక్ష : జూన్‌ 2021లో జరుగుతుంది.
మెయిన్‌ పరీక్ష తేది: 31.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bank.sbi/careers

State Bank SBI Clerk Recruitment 2021 Apply Online for 5000 Post | Closure of registration of application   20/05/2021 

ఐఐఐటీడీఎం, కర్నూలులో 10 ఫ్యాకల్టీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది మే 15..

 

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కర్నూలు(ఏపీ)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు:
ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌– 05, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌– 01, మెకానికల్‌ ఇంజనీరింగ్‌–02, సైన్సెస్‌–02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: దీన్ని రెండు విధాలుగా నిర్వహిస్తారు. అవి.. సెమినార్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. కొన్ని విభాగాలు స్క్రీనింగ్‌ టెస్ట్‌ కూడా నిర్వహించే అవకాశం ఉంది. మొదటగా షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల్ని సెమినార్‌కి పిలుస్తారు. సెమినార్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపికైన వారిని ఇంటర్వూకి ఆహ్వానిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.05.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.iiitk.ac.in

ఏఎన్‌జీఆర్‌ఏ యూనివర్శిటీ, గుంటూరులో 149 ఫ్యాకల్టీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది మే 23..

 



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ(ఏఎన్‌జీఆర్‌ఏ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs మొత్తం పోస్టుల సంఖ్య: 149
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–06, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–34, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–109.
విభాగాలు: అగ్రికల్చర్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్‌(హోమ్‌ సైన్స్‌).
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో యూనివర్శిటీ నిబంధనల ప్రకారం–అర్హత ప్రమాణాలు ఉండాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.05.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.angrau.ac.in

28, ఏప్రిల్ 2021, బుధవారం

నేవీలో 2500 సెయిల‌ర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021

 



భారత నావికా దళం(ఇండియన్‌ నేవీ).. 2500 సెయిలర్‌ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ)–500, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)–2000 ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
Jobs పోస్టులు: సెయిలర్‌
కోర్సు ప్రారంభం: ఆగస్టు 2021
మొత్తం పోస్టుల సంఖ్య: 2500(ఏఏ–500, ఎస్‌ఎస్‌ఆర్‌–2000).

ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ): 500
అర్హత: ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి.
వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)–2000
అర్హత: ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి.
వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం..
రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌చేస్తారు. మొత్తం 2500 సెయిలర్‌ పోస్టులకు దాదాపు 10వేల మందిని రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టుకు పిలుస్తారు.

పరీక్ష విధానం..
ప్రశ్న పత్రం హిందీ/ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ప్రశ్న పత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్‌ నాలెడ్జ్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అదే రోజు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఏడు నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగు పూర్తిచేయాలి. అలాగే 20 ఉటక్‌ భైటక్, 10 ఫుష్‌ అప్స్‌చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/