విజయానికి ఇవే ప్రధానం!
జేఈఈ మెయిన్ - 2024 మొదటి సెషన్‌ను జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీల మధ్య నిర్వహించనున్నారు. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారి సౌలభ్యం కోసం విద్యా సంవత్సరం మొదటిలోనే ప్రవేశ పరీక్షల సిలబస్‌ను ప్రకటిస్తుంటారు. కానీ పరీక్షకు కేవలం రెండు నెలల ముందే జేఈఈ-మెయిన్ 2024 సిలబస్‌ను వెల్లడించారు. అయితే సిలబస్‌ను కొంతమేరకు తగ్గించడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం.
పరీక్ష సరళిని అర్థం చేసుకోండిజేఈఈ-మెయిన్
స్టడీ మెటీరియల్
పట్టులేనివాటికి ప్రాధాన్యం
రెగ్యులర్ ప్రాక్టీస్, పాత ప్రశ్నపత్రాలు
మాక్ టెస్ట్‌లు
ఆరోగ్య సంరక్షణ

జేఈఈ మెయిన్ 2023 ఆలిండియా ర్యాంక్స్ vs ( పర్సంటైల్ స్కోర్స్
సలహాలు - సందేహ నివృత్తి
పరీక్ష రోజు
గమనించండి!
- మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో జేఈఈ మెయిన్-2024 కోసం ప్రత్యేకంగా తొలగించిన అంశాలన్నీ ఏపీ, టీఎస్ ఇంటర్మీడియట్ సిలబస్‌లో ఉన్నాయి.
- అందులోనూ తొలగించిన ఆ భాగాల నుంచి ప్రశ్నలు కూడా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో తప్పకుండా వస్తాయి. అందువల్ల జేఈఈ-మెయిన్ కోసం మాత్రమే సన్నద్ధమయ్యే విద్యార్థులు, తొలగించిన ఆయా అంశాలను బోర్డు పరీక్షల స్థాయిలో సన్నద్ధం కావడం మంచిది.
- జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా జేఈఈ-మెయిన్‌లో తొలగించిన అంశాలపై పట్టు సాధించాలి. మరీ ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్‌లలో జేఈఈ-మెయిన్‌లో తొలగించిన అంశాల ప్రభావం జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఎంతమాత్రం చూపించదు.
- జేఈఈ-అడ్వాన్స్‌డ్-2024 సిలబస్ కూడా ప్రకటించిన తర్వాత మనకు పూర్తిగా అర్థమవుతుంది. అంతవరకు జేఈఈ-అడ్వాన్స్‌డ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు జేఈఈ-అడ్వాన్స్‌డ్-2023ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.