రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించే ఎన్టీపీసీ అభ్యర్థులకు
గమనిక. డిసెంబర్ 28 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరగను విషయం
తెలిసిందే. గతేడాది ఆర్ఆర్బీ 35,208 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్
(NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం కూడా విధితమే.
అయితే.. ఇప్పటివరకు ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
నిర్వహించలేదు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
9, డిసెంబర్ 2020, బుధవారం
రైల్వే పరీక్షలు: ఈనెల 28 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్.. త్వరలో అడ్మిట్ కార్డులు
BOI Recruitment 2020 News in Telugu || బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :
బ్యాంకు ఆఫ్ ఇండియా (BOl) ముంబై లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 9,2020 |
| దరఖాస్తుకు ముగింపు తేదీ | డిసెంబర్ 21,2020 |
విభాగాల వారీగా ఖాళీలు :
| సెక్యూరిటీ ఆఫీసర్స్ | 20 |
| ఫైర్ ఆఫీసర్ | 1 |
మొత్తం ఖాళీలు :
ఈ ప్రకటన ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు..
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సంబంధిత సబ్జెక్టులలో బీఈ / బీ. టెక్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. గ్రాడ్యుయేషన్ /ఆర్మీ /నేవీ /ఎయిర్ ఫోర్స్ లో 5 ఏళ్ళు అనుభవం ఉండవలెను. ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫైర్ ఇంజనీరింగ్ లో బీఈ కోర్సును పూర్తి చేసి ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలనుండి 40 సంవత్సరాల మధ్య ఉండవలెను.
ఎంపిక విధానం :
గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విభాగాలను అనుసరించి నెలకు 30,000 రూపాయలు నుండి 45,000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.
ఫీజు :
జనరల్ అభ్యర్థులు 850 రూపాయలు, ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలను దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.
ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్- 2021 నోటిఫికేషన్
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బాలికలకు ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్(10+2) వరకు
ఉచిత విద్యతోపాటు, వసతి, భోజనం, యూనిఫారం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా
అందిస్తారు. ఇక్కడ విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థారుు పరీక్షల్లో
రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆసక్తి ఉన్న విద్యార్ధుల
నుంచి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు:
ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్: 2020- 21
అర్హత:
- 2020-21 విద్యాసంవత్సరానికి 5వ తరగతి చదువుతుండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
- ఏ జిల్లాలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో.. వారు ప్రస్తుతం అదే జిల్లాలో చదువుతూ ఉండాలి.
వయసు: మే 1, 2008 నుంచి ఏప్రిల్ 30, 2012 మధ్య జన్మించినవారు అర్హులు.
పరీక్ష విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. నవోదయ ప్రవేశ పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మాతృభాష (తెలుగు)లోను రాసే వీలుంది. ప్రశ్నలు మల్టిపుల్ చారుుస్(ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటాయి. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షను రెండు గంటల్లో పూర్తి చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2020.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 10, 2021 (ఉదయం 11.30 నుంచి మ.1.30 గంటల వరకు)
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.navodaya.gov.in లేదా
www.navodaya.gov.in/nvs/en/Admission-JNVST/JNVST-class
రెండేళ్లలో 10,000 మంది నర్సుల నియామకాలకు ఏపీ సర్కార్ కసరత్తు ..!
ప్రాథమిక ఆరోగ్యం పరిపుష్టం చేయడంలో భాగంగా సర్కారు ఈ ప్రక్రియను
చేపట్టింది. కుగ్రామంలోని ప్రజలకు కూడా ప్రాథమిక వైద్యం అందించాలని, దీనికి
సంబంధించి ఎక్కడికక్కడ ఆరోగ్య సిబ్బందిని నియమించి దేశంలో ఏ రాష్ట్రంలో
లేని విధంగా వ్యవస్థను రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో
భాగంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు)ను
ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలన్నింటినీ
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్గా ఉన్నతీకరిస్తున్నారు. మొత్తం 10,030 హెల్త్
కినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 8,615 క్లినిక్స్‌కు కొత్తగా
భవన నిర్మాణాలు చేపడుతుండగా, మిగతా వాటికి బిల్డింగ్లు ఉన్నాయి.
- మొత్తం 10,030 హెల్త్ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులను నియమిస్తున్నారు.
- ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కొత్తగా చేపడుతున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌కు జాతీయ హెల్త్ మిషన్ నిధులిస్తోంది.
- పతి కేంద్రంలోనూ ఒక బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థి ఉండాలి. ఇప్పటికే 4,060 మంది నర్సుల నియామకానికి కేంద్రం అనుమతించింది. మిగతా 6 వేల నియామకాలకు త్వరలోనే అనుమతివ్వనుంది.
- ఎంపికై న నర్సులకు ఆరు మాసాలు ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ) నిపుణులు శిక్షణ ఇస్తారు.
- శిక్షణ సమయంలో నర్సులకు స్టైఫండ్‌తో పాటు అకామిడేషన్, భోజన వసతి కల్పిస్తారు.
- కొత్త నిర్మాణాల కోసం రూ.1,745 కోట్లు వ్యయం చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కువ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. ప్రతి హెల్త్‌కినిక్‌కూ పీహెచ్‌సీతో అనుసంధానం చేస్తారు.
హెల్త్ క్లినిక్‌లలో 12 రకాల సేవలు
- గర్భిణులకు, చిన్నారులకు ప్రత్యేక సేవలు
- నవజాత శిశువులు టీకాలు
- చిన్నారులు, యుక్త వయసు వారికి వైద్య సేవలు
- కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రత్యేక సేవలు
- సాంక్రమిక వ్యాధులకు గురికాకుండా పటిష్ట చర్యలు
- సాంక్రమిక వ్యాధుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం
- మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా చర్యలు తీసుకోవడం
- కన్ను, చెవి సమస్యలను ముందే పరిష్కరించేలా చర్యలు
- సాధారణ ఆరోగ్య సంబంధిత సేవలు
- వృద్ధుల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు
- అత్యవసర సేవల్లో భాగంగా వైద్యం
- చిన్న చిన్న మానసిక సమస్యలకు ప్రాథమిక దశలోనే స్క్రీనింగ్
కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న క్లినిక్‌లు
|
జిల్లా |
హెల్త్ క్లినిక్స్ సంఖ్య |
|
తూర్పుగోదావరి |
1,084 |
|
అనంతపురం |
632 |
|
కృష్ణా |
666 |
|
శ్రీకాకుళం |
653 |
|
గుంటూరు |
638 |
|
పశ్చిమ గోదావరి |
739 |
|
విజయనగరం |
492 |
|
ప్రకాశం |
744 |
|
నెల్లూరు |
546 |
|
కర్నూలు |
643 |
|
చిత్తూరు |
728 |
|
వైఎస్సార్ |
500 |
|
విశాఖపట్నం |
550 |
|
మొత్తం |
8,615 |
ముమ్మరంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం
ప్రస్తుతం 8,604 భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్
విభాగం ఈ పనులను చేపట్టింది. 5,010 భవనాలు ఎర్త్ వర్క్ దశలో ఉన్నాయి. మరో
1,519 బేస్మెంట్ లెవెల్‌కు వచ్చాయి. వీలైనంత త్వరలో అన్నింటినీ పూర్తి
చేసి అందుబాటులోకి తెస్తాం. యథావిధిగా నర్సుల నియామకం చేపడతాం.
- అనిల్ కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ
అగ్రి, హార్టికల్చర్ బీఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఏపీ
ఎంసెట్-2020లో ర్యాంకు సాధించిన బైపీసీ అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు
చేసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల
పరిధిలోని ప్రభుత్వ, అనుబంధ ప్రైవేట్ కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్)
అగ్రికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-అనిమల్ హస్బెండరీ
(బీవీఎస్సీ-ఏహెచ్), బీఎస్సీ (ఫిషరీస్), బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్,
బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ)
కోర్సులకు రైతుల కోటా కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. www.angrau.ac.in
లో ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలన్నారు. నవంబరు నెల 23 నుంచి డిసెంబర్ 13
వరకు దరఖాస్తు గడువు పెంచామని చెప్పారు. అన్ని వర్సిటీలకు ఒకే దరఖాస్తు
సరిపోతుందన్నారు.జేఈఈ మెయిన్ 2021: జనవరిలో కాదు ఫిబ్రవరిలో..
శుభవార్త... త్వరలో 499 మంది వైద్యుల నియామకానికి నోటిఫికేషన్!
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...