9, డిసెంబర్ 2020, బుధవారం

BOI Recruitment 2020 News in Telugu || బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

 

బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :

బ్యాంకు ఆఫ్ ఇండియా (BOl) ముంబై లో  ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై  చేసుకోవచ్చు. 


ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 9,2020
దరఖాస్తుకు ముగింపు తేదీడిసెంబర్ 21,2020

విభాగాల వారీగా ఖాళీలు :

సెక్యూరిటీ ఆఫీసర్స్20
ఫైర్ ఆఫీసర్1

మొత్తం ఖాళీలు :

ఈ ప్రకటన ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు..

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సంబంధిత సబ్జెక్టులలో  బీఈ / బీ. టెక్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. గ్రాడ్యుయేషన్ /ఆర్మీ /నేవీ /ఎయిర్ ఫోర్స్ లో 5 ఏళ్ళు అనుభవం ఉండవలెను. ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫైర్ ఇంజనీరింగ్ లో బీఈ కోర్సును పూర్తి చేసి ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలనుండి 40 సంవత్సరాల మధ్య ఉండవలెను.

ఎంపిక విధానం :

గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విభాగాలను అనుసరించి నెలకు 30,000 రూపాయలు నుండి 45,000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.

ఫీజు :

జనరల్ అభ్యర్థులు 850 రూపాయలు, ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలను దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.

Website

Notification

కామెంట్‌లు లేవు: