దేశవ్యాప్తంగా
ఉన్న నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో
ప్రవేశాలకునోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వరంలోని అన్ని
స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధన ఉంటుంది.

వివరాలు:
ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్: 2020- 21
అర్హత:
- 2020-21 విద్యాసంవత్సరానికి 5వ తరగతి చదువుతుండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
- ఏ జిల్లాలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో.. వారు ప్రస్తుతం అదే జిల్లాలో చదువుతూ ఉండాలి.
వయసు: మే 1, 2008 నుంచి ఏప్రిల్ 30, 2012 మధ్య జన్మించినవారు అర్హులు.
పరీక్ష విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. నవోదయ ప్రవేశ పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మాతృభాష (తెలుగు)లోను రాసే వీలుంది. ప్రశ్నలు మల్టిపుల్ చారుుస్(ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటాయి. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షను రెండు గంటల్లో పూర్తి చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2020.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 10, 2021 (ఉదయం 11.30 నుంచి మ.1.30 గంటల వరకు)
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.navodaya.gov.in లేదా
www.navodaya.gov.in/nvs/en/Admission-JNVST/JNVST-class
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి