9, డిసెంబర్ 2020, బుధవారం

రైల్వే పరీక్షలు: ఈనెల 28 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌.. త్వరలో అడ్మిట్‌ కార్డులు

 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించే ఎన్‌టీపీసీ అభ్యర్థులకు గమనిక. డిసెంబర్ 28 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ జరగను విషయం తెలిసిందే. గతేడాది ఆర్ఆర్‌బీ 35,208 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం కూడా విధితమే. అయితే.. ఇప్పటివరకు ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించలేదు.

ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఏడాదిన్నరగా పరీక్షల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 28 నుంచి 2021 మార్చి చివరి వారం వరకు దశలవారీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. ఈ పోస్టులతో పాటు మిగిలిన పోస్టులకు కూడా డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి.

కామెంట్‌లు లేవు: