24, డిసెంబర్ 2020, గురువారం

నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే.. 210 పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్



భారత నావికా దళంలో కొలువు కోరుకునే యువతకు ఇండియన్ నేవీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobs వివిధ బ్రాంచ్‌ల్లో ఎస్‌ఎస్‌సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) ప్రాతిపదికన మొత్తం 210 ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. బీఈ/బీటెక్/ఎంబీఏ/బీఎస్సీ/ఎమ్మెస్సీ/బీకామ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడెమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 210
  • ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఎస్‌ఎస్‌సీ)122 పోస్టులు
  • టెక్నికల్ బ్రాంచ్ 70 పోస్టులు
  • ఎడ్యుకేషన్ బ్రాంచ్ 18 పోస్టులు

అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టు/బ్రాంచ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంఎస్సీ, బీఎస్సీ, బీకామ్, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా/ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ ఐటీ, డీజీసీఏ జారీచేసిన పెలైట్ లెసైన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ:
  • అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా జరపాల్సిన రాత పరీక్షను కొవిడ్-19 కారణంగా నిర్వహించడంలేదు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అకడమిక్ ఇయర్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా షార్‌‌టలిస్ట్ చేసి.. ఆయా పోస్టులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.
  • ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో భాగంగా వివిధ విభాగాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆయా విభాగాలకు చెందిన మెడికల్ బోర్డుల ద్వారా మెడికల్ టెస్టులకు పంపిస్తారు.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ: ఎస్‌ఎస్‌బీ 2021 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి బెంగళూరు/భోపాల్/విశాఖపట్నం కేంద్రాల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
శిక్షణ:
  • మెడికల్ టెస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులకు కేరళ రాష్ట్రంలోని ఎజిమలాలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో 44 వారాల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం నావిక్ షిప్పులలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ అందిస్తారు.
  • ఆఫీసర్స్ ఆఫ్ రెగ్యులర్ ఎన్‌ఓసీ వాళ్లకు 22 వారాల పాటు నావల్ ఓరియంటేషన్ కోర్సు ఉంటుంది.
  • ఆఫీసర్స్ ఆఫ్ ఎస్‌ఎస్‌సీ (ఐటీ) వారికి 4 వారాల పాటు నావల్ ఓరియేంటేషన్ కోర్సు ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.joinindiannavy.gov.in

కామెంట్‌లు లేవు: