24, డిసెంబర్ 2020, గురువారం

RRB NTPC TOPICS

ఇండియన్ రైల్వే.. వివిధ ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షలో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ అంశాలకు ప్రాధాన్యం ఉంటోంది. అర్థమెటిక్‌లో లాభ- నష్టాలు, సగటు, కాలం-పని, కాలం-వేగం-దూరం తదితర అంశాల సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్‌లో సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్‌మెంట్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. స్టాక్ జీకేలో రైల్వే వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలతోపాటు.. జాతీయ చిహ్నాలు, అంతర్జాతీయ సరిహద్దులు, ఐక్యరాజ్యసమితి, పరిశోధన సంస్థలు, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, ప్రపంచం/ఇండియాలో తొలి, ఎత్తై, పొడవైన తదితర అంశాలకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. వర్తమాన వ్యవహారాల కోసం రోజూ దినపత్రికలు, మేగజీన్లను చదవాలి. పాఠశాల స్థాయి పుస్తకాల్లోని అంశాలను పూర్తిస్థాయిలో నేర్చుకోవడం ద్వారా అధిక మార్కులు సాధించొచ్చు.

కామెంట్‌లు లేవు: