24, డిసెంబర్ 2020, గురువారం

అమ్మ ఒడి అప్డేట్ | తల్లిదండ్రులకు ముఖ్య సమాచారం Ammavodi Update

అమ్మఒడి స్కూల్ లాగిన్ నందు
Eligible list కు సంబంధించి

R1----eligible
         Ineligible
         Withheld
         Orphans

R 2----Updated invalid             
           bank details

R 3---Updated eligible to
          ineligible details
అనే మూడు రకాల రిపోర్ట్స్ generate అవుతున్నాయి

ప్రశ్నః- Eligible/ineligible/withheld lo student name లేకపోతే ఏమి చేయాలి సార్

జవాబుః- *MEO మెయిల్ కు నిన్న వచ్చిన No Data found format లో డీటెయిల్స్ DEO గారి మెయిల్ కు పంపాలి*🤞

అమ్మఒడి కి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం, దయచేసి మనసు పెట్టి చదివి మీ పరిధిలోని విద్యార్థుల తల్లులు తెలుసుకోవాలి.

➡️అమ్మఒడి కి సంబంధించిన లబ్దిదారుల వివరాలు గ్రామ సచివాలయం నందు ఉండవు,

➡️అనగా అమ్మఒడి కి సంబంధించి Eligible (అర్హులు), Ineligible (అనర్హులు), Withheld (నిలిపివేయబడినవారు) లబ్ధిదారుల పూర్తి వివరాలను స్కూల్ హెడ్మాస్టర్ ల లాగిన్ నందు మాత్రమే ఇవ్వడం జరిగింది.

➡️కావున మీరు మీ కుటుంబాలలో 1 నుండి 10 వ తరగతి వరకు చదువుచున్న విద్యార్థుల పాఠశాలకి వెళ్లి హెడ్మాస్టర్ గారి లాగిన్ ద్వారా వారు అమ్మఒడికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు.

➡️హడ్మాస్టర్ గారి లాగిన్ నందు అర్హత కలిగిన వారు మరియు Withheld జాబితాలో ఉన్న వారు, సచివాలయంలో ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించవలసిన అవసరం లేదు. కాబట్టి వారు మన సచివాలయంకు ఎళ్ళాల్సిన పనిలేదు.

➡️ పాఠశాల హెచ్ఎం గారి లాగిన్ నందు వివరాలు చెక్ చేసుకున్న తర్వాత ఎవరైతే అనర్హుల (Ineligible) జాబితాలో ఉన్నారో వారు వారి యొక్క అనర్హతకు గల కారణంను కూడా హెచ్ఎం గారి లాగిన్లోనే చెక్ చేసుకోవలెను.

➡️ఒకవేళ అర్హులైనప్పటికీ హెచ్ఎం గారి లాగిన్ నందు వారి పేరు అనర్హుల లిస్టులో వచ్చినట్లయితే అటువంటి వారు వారి అర్హతను నిరూపించుకొనుటకు తగిన ఆధారాలతో సంబంధిత సచివాలయానికి సందర్శించవలెను.

➡️సచివాలయం వారు తీసుకొచ్చిన ఆధారాలను పూర్తిగా పరిశీలన చేసి వాటిని 6 అంచెల దృవీకరణ (6 Step Validation) ద్వారా మన కమిషనర్ సార్ గారి లాగిన్ కి పంపడం జరుగుతుంది. తదుపరి అవి జిల్లా సంయుక్త కలెక్టర్ సార్  గారి లాగిన్ కు వెళతాయి వాటిని జిల్లా సంయుక్త కలెక్టర్ గారు పూర్తిగా గా పరిశీలించి అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఆమోదించడం జరుగుతుంది.

*అమ్మఒడి అనర్హుల జాబితాలో ఉన్న వారు 6 Step Validation (ఆరంకెల ధ్రువీకరణకు) సమర్పించవలసిన పత్రాలు*

*_Income tax_*
ఇన్కమ్ టాక్స్ కడుతున్నారు అని వచ్చిన వారు, గడచిన మూడు సంవత్సరాల నుండి వారి కుటుంబంలో ఎవరూ ఇన్కమ్ టాక్స్ కట్టడం లేదు అని ఆడిటర్ లేదా సి ఎ ద్వారా TDS ఫామ్ సమర్పించవలెను.

*_Electricity Bill_*
కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిన వారు వారి సర్వీస్ నెంబర్ కి ఆరు నెలల కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్లుగా AE, ఎలక్ట్రికల్ గారి ధ్రువీకరణ పత్రం సమర్పించవలెను.

*_4 Wheeler_*
నాలుగు చక్రాల బండి ఉంది అని వచ్చిన వారు దానిని ఎవరికి అమ్మినారో వారి వివరాలను తెలియజేస్తూ RTA/MVI గారి ద్వారా ధ్రువీకరణ పత్రం సమర్పించవలెను.

*_Property_*
రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంది అని వచ్చిన వారు మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ధ్రువీకరణ పత్రం సమర్పించవలెను.

*_Land_*
వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంది అని వచ్చిన వారు ఎమ్మార్వో గారి ద్వారా ధ్రువీకరణ పత్రం సమర్పించవలెను.

*_Government Employee_*
ప్రభుత్వ ఉద్యోగి అని వచ్చిన వారు సంబంధిత CFMS ఐడిని తెలియజేస్తూ డి డి ఓ గారి ద్వారా ధ్రువీకరణ పత్రం సమర్పించవలెను.



కామెంట్‌లు లేవు: