SBI నుంచి భారీ నోటిఫికేషన్, 452 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ :
భారతదేశ ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ముంబై నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 452 పోస్టుల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | డిసెంబర్ 22,2020 |
దరఖాస్తులకు చివరి తేది | జనవరి 11,2021 |
పరీక్ష నిర్వహణ తేది | ఫిబ్రవరి 1,2021 |
కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది | జనవరి 22,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా SBI లో వివిధ విభాగాల్లో ఖాళీగా మేనేజర్స్, డిప్యూటీ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
మేనేజర్స్ :
మార్కెటింగ్ | 12 |
క్రెడిట్ ప్రాసెసర్స్ | 2 |
నెట్ వర్క్ రూటింగ్ అండ్ స్విచింగ్ స్పెషలిస్ట్ | 20 |
సెక్యూరిటీ స్పెషలిస్ట్ | 12 |
డిప్యూటీ మేనేజర్స్ :
మార్కెటింగ్ | 26 |
సిస్టమ్ | 17 |
సెక్యూరిటీ అనలిస్ట్ | 60 |
ఇంటర్నల్ ఆడిట్ | 28 |
అసిస్టెంట్ మేనేజర్స్ :
సిస్టమ్స్ | 183 |
సెక్యూరిటీ అనలిస్ట్ | 40 |
ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ | 15 |
ప్రాజెక్ట్ మేనేజర్స్ | 14 |
అప్లికేషన్ ఆర్చిటెక్ట్స్ | 5 |
టెక్నికల్ లీడ్ | 2 |
ఫైర్ ఇంజనీర్స్ | 16 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాలవారీగా క్రింది విద్యార్హతలను కలిగి ఉండవలెను.
మార్కెటింగ్, క్రెడిట్ ప్రాసెసర్స్ విభాగాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు MBA/PGDM/PGDBA/CSA/FRM కోర్సులలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.ఇంటర్నల్ విభాగాలకు CA కోర్సును పూర్తి చేయవలెను.
ఫైర్ ఇంజినర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫైర్ /సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ లో BE/B. TECH/B. Sc కోర్సులను పూర్తి చేయవలెను.
మిగిలిన టెక్నికల్ విభాగాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా సంబంధిత సబ్జెక్ట్స్ లలో B. E/B. TECH/M. SC/MCA కోర్సులను పూర్తి చేయవలెను.నిర్దేశిత వయసు మరియు అనుభవం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అవసరం. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ ను అభ్యర్థులు చూడవచ్చు.
కరెస్పాండెన్స్ మరియు పార్ట్ టైం కోర్సులలో విద్యా అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వీలులేదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు అభ్యర్థులు విభాగాలను అనుసరించి 750 రూపాయలు వరకూ దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. SC/ST/దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష, షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఆయా విభాగాలను అనుసరించి అభ్యర్థులకు 45,000 రూపాయలు నుండి 85,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
SBI Notification 2
SBI Notification 4
SBI Notification 6
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి