ఇండియన్ నేవి లో 210 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :
భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత నావిక దళంలో వివిధ బ్రాంచ్ ల్లో పర్మినెంట్ కమిషన్ (PC) మరియు షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైనది.
ఎటువంటి పరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబోయే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పెళ్లి కానీ పురుషులు మరియు స్త్రీలు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేది | డిసెంబర్ 18,2020 |
దరఖాస్తుకు చివరి తేది | డిసెంబర్ 31,2020 |
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | ఫిబ్రవరి 21,2021 |
శిక్షణ ప్రారంభం తేది | జూన్ 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ :
SSC జనరల్ సర్వీస్ (హైడ్రో క్యాడర్ – మెన్ ) | 40 |
SSC నావల్ ఆయుధ ఇన్స్పెక్టరేట్ క్యాడర్ | 16 |
SSC అబ్సర్వర్ (మెన్ ) | 6 |
SSC పైలట్ (మెన్ & ఉమెన్ ) | 15 |
SSC లాజిస్టిక్స్ (మెన్ & ఉమెన్ ) | 20 |
SSC ఎక్స్ ( ఐ టీ ) | 25 |
టెక్నికల్ బ్రాంచ్ :
SSC ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ – మెన్ ) | 30 |
SSC ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ – మెన్ ) | 40 |
ఎడ్యుకేషనల్ బ్రాంచ్ :
SSC విద్య | 16 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్స్ లలో 60% మార్కులతో బీ.ఈ /బీ. టెక్ /బీ. ఎస్సీ /బీ. కామ్ /బీ. ఎస్సీ (ఐటీ )/ఎం. ఎస్సీ /పీజీ డిప్లొమా /ఎంబీఏ /ఎంసీఏ /ఎంఎస్సీ(ఐటీ) కోర్సులను పూర్తి చేసి, DGCA జారీ చేసిన కమర్షియల్ పైలెట్ లైసెన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 24 సంవత్సరాలు కలిగి ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 100 రూపాయలును చెల్లించవలెను. ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
అకాడమిక్ మెరిట్ మరియు ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిర్వహించి, కేరళ రాష్ట్రం ఏజిమల లో ఉన్న ఇండియన్ నావల్ అకాడమి లో 44 వారల పాటు శిక్షణ ను అందించనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి