భారత
ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
లిమిటెడ్(ఐఓసీఎల్)కి చెందిన పైప్‌లైన్స్ విభాగం నాన్ ఎగ్జిక్యూటివ్
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 47 (అన్‌రిజర్వ్‌డ్-31, ఎస్సీ-07, ఎస్టీ-04, ఓబీసీ-04, ఈడబ్ల్యూఎస్-01, పీడబ్ల్యూడీ-01, ఎక్స్ సర్వీస్‌మెన్-04)
పోస్టులు-ఖాళీలు: ఇంజినీరింగ్ అసిస్టెంట్(మెకానికల్, ఆపరేషన్స్, ఎలక్ట్రికల్, టీ&ఐ.)-27, టెక్నికల్ అటెండెంట్-20.
అర్హత, వయసు:
1) ఇంజినీరింగ్ అసిస్టెంట్(మెకానికల్): కనీసం 55% మార్కులతో మెకానిల్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/ లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణత.
2) ఇంజినీరింగ్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్): కనీసం 55%
మార్కులతో ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/ లేటరల్ ఎంట్రీ డిప్లొమా
ఉత్తీర్ణత.
3)ఇంజినీరింగ్ అసిస్టెంట్(టీ&ఐ): కనీసం 55%
మార్కులతో ఈసీఈ/ ఈటీఈ/ ఐసీఈ/ ఐపీసీఈ/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో
మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/ లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణత.
4) ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఆపరేషన్స్): కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా ఇంజినీరింగ్/ లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణత.
5) టెక్నికల్ అటెండెంట్: పదోతరగతి, సంబంధిత
ట్రేడుల్లో (ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్,
టర్నర్ తదితరాలు) ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో ఎస్‌సీవీటీ/
ఎన్‌సీవీటీ జారీ చేసిన ట్రేడ్ సర్టిఫికెట్/ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్
ఉండాలి.
వయసు: 22.12.2020 నాటికి కనీస వయసు 18 ఏళ్లకు
తగ్గకుండా గరిష్ఠ వయసు 26 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/
ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు
ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ ప్రొఫిషియన్సీ/
ఫిజికల్ టెస్ట్ (ఎస్‌పీపీటీ) ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
స్కిల్/ ప్రొఫిషియన్సీ/ ఫిజికల్ టెస్ట్(ఎస్‌పీపీటీ)ని కేవలం అర్హత
కోసం మాత్రమే నిర్వహిస్తారు. తుది ఎంపిక రాతపరీక్షలో సాధించిన
మార్కులు, ఎస్‌పీపీటీలో ఫిట్‌నెస్ ఆధారంగా ఉంటుంది. రాతపరీక్షలో
కనీసం 40% మార్కులు సాధించినవారు మాత్రమే ఎస్‌పీపీటీకి అర్హత
సాధిస్తారు.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్
ప్రశ్నల రూపంలో రాత పరీక్ష ఉంటుంది. దీనిని 100 మార్కులకు
నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుకు 100 ప్రశ్నలకు గాను 75
ప్రశ్నలు అభ్యర్థి ఎంచుకున్న డిప్లొమా సబ్జెక్టుల నుంచి మిగతా 25
ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్,
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి. టెక్నికల్
అటెండెంట్ పోస్టుకు 100 ప్రశ్నలకు గాను 75 ప్రశ్నలు అభ్యర్థి
ఎంచుకున్న ఐటీఐ ట్రేడ్ సబ్జెక్టుల నుంచి మిగతా 25 ప్రశ్నలు జనరల్
ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్
అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్
ఉండదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 15.01.2021.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి