నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాలు :
భారత కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఉత్తర్ ప్రదేశ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హతలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు అర్హతలు గల ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. NFL Jobs Recruitment Telugu 2020
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | డిసెంబర్ 22,2020 |
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 21,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ ) | 4 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (మెకానికల్ ) | 7 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ) | 4 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటల్ ) | 5 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (సివిల్ ) | 1 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ ల్యాబ్ ) | 7 |
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఫైర్ &సేఫ్టీ ) | 2 |
విభాగాల వారీగా అర్హతలు :
60% మార్కులతో సంబంధిత విభాగాలలో బీ. టెక్, బీ. ఈ, బీ. ఎస్సీ (ఇంజనీరింగ్ ) కోర్సులను పూర్తి చేసి, సంబంధిత ఇంజనీరింగ్ లో AMIE ఉత్తీర్ణత సాధించాలి.
మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ ల్యాబ్ ) ఉద్యోగాలకు 60% మార్కులతో కెమిస్ట్రీ విభాగంలో రెగ్యులర్ ఎం. ఎస్సీ డిగ్రీ కోర్స్ ను పూర్తి చేయవలెను.
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఫైర్ & సేఫ్టీ ) ఉద్యోగాలకు 60% మార్కులతో ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో డిగ్రీ కోర్సును పూర్తి చేయవలెను.పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చూడగలరు.
వయసు :
ఈ ఉద్యోగాలకు 27 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ /ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్థులు 700 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 40,000 రూపాయలు నుండి 1,40,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి