2000 పోస్టుల భర్తీకీ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల :
మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) లో, జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేది | డిసెంబర్ 19,2020 |
దరఖాస్తులకు చివరి తేది | జనవరి 9,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
జనరల్ | 989 |
EWS | 113 |
ఓబీసీ | 417 |
ఎస్సీ | 360 |
ఎస్టీ | 121 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ కోర్సులను పూర్తిచేసి ఉండవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎగ్జామ్స్ ఫీజు 100 రూపాయలు మరియు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఫీజు 500 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులు ఎగ్జామ్స్ ఫీజు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 7th లెవెల్ ప్రాతిపదికన నెలకు 44,900 రూపాయలు నుండి 1,42,400 రూపాయలు వరకూ జీతం అందుకోనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనే అభ్యర్థులు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయనుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ :
గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం.
తెలంగాణ :
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి