20, డిసెంబర్ 2020, ఆదివారం

🔳స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 17 స్టాఫ్‌ నర్సుల ఉద్యోగాల నియామకానికి సాంఘిక సంక్షేమశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఎపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల నియామకానికి గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి బిఎస్‌సి నర్సింగ్‌ లేదా జిఎన్‌ఎం విద్యార్హత కలిగి రెండు నుంచి మూడేళ్లు అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 29 ఉదయం పది గంటలకు నిర్వహించే రాత, ముఖాముఖి పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. ఆసక్తిగలవారు వారి విద్యార్హతల సర్టిఫికెట్లతో సూచించిన సమయానికి హాజరుకావాలని కోరారు. నోటిఫికేషన్‌ పూర్తి వివరాల కోసం www.aphermc.ap.gov.in &nbsp సందర్శించాలని సూచించారు.

కామెంట్‌లు లేవు: